
పవన్ కల్యాణ్ (Pawan kalyan) నటించిన 'హరి హర వీరమల్లు'( Hari Hara Veera Mallu) మూవీ ట్రైలర్ వచ్చేసింది. సినిమా విడుదల తేదీతో పాటు ట్రైలర్ రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన 'వీరమల్లు' ఎట్టకేలకు వచ్చేశాడు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సుమారు 5ఏళ్లకు పైగా ఈ చిత్రాన్ని మేకర్స్ నిర్మించారు. దీంతో బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోయిందని నిర్మాత ఎ.ఎం రత్నం చెప్పారు.
పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పకులు. సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో జులై 24న విడుదల కానుంది.