పవన్ హీరోగా వేదలం రీమేక్ | am rathnam clarifies on vedalam remake with pawan kalyan | Sakshi
Sakshi News home page

పవన్ హీరోగా వేదలం రీమేక్

Feb 7 2016 11:23 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ హీరోగా వేదలం రీమేక్ - Sakshi

పవన్ హీరోగా వేదలం రీమేక్

సర్థార్ గబ్బర్సింగ్ సెట్స్ మీద ఉండగానే పవన్ కళ్యాణ్ చేయబోయే నెక్ట్స్ సినిమా విషయంలో వార్తలు ఊపందుకున్నాయి. ఎస్ జె సూర్య డైరెక్షన్ సినిమా ఉంటుందన్న వార్తలు వినిపించినా...

సర్దార్ గబ్బర్సింగ్ సెట్స్ మీద ఉండగానే పవన్ కళ్యాణ్ చేయబోయే నెక్ట్స్ సినిమా విషయంలో వార్తలు ఊపందుకున్నాయి. ఎస్ జె సూర్య డైరెక్షన్ లో సినిమా ఉంటుందన్న వార్తలు వినిపించినా, పవన్ ఆ రిస్క్ చేయడానికి సిద్ధంగా లేడని అర్థమై పోయింది. తమిళ్లో సూపర్ హిట్ అయిన వేదలం సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి పవన్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు.

అజిత్ హీరోగా సిస్టర్ సెంటిమెంట్తో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ ఇమేజ్కు తగ్గట్టు యాక్షన్, హీరోయిజం పుష్కలంగా ఉన్నాయి. అందుకే తమిళ్లో ఈ సినిమాను నిర్మించిన ఎ ఎమ్ రత్నం తెలుగులోనూ పవన్ హీరోగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్తో రభస సినిమాను తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడంటూ వచ్చిన వార్తలను రత్నం ఖడించాడు.

పవన్ కళ్యాణ్తో వేదలం రీమేక్ చేస్తున్న మాట నిజమే కాని, ఆ సినిమాకు సాంకేతిక నిపుణులను, నటీనటులను ఇంత వరకు ఫైనల్ చేయలేదని తేల్చేశాడు. దీంతో ఈ సినిమా ఎవరి డైరెక్షన్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement