ఆయన తెలుగులో మళ్లీ తీయాలి! | He should be back in Telugu! | Sakshi
Sakshi News home page

ఆయన తెలుగులో మళ్లీ తీయాలి!

Apr 24 2015 11:19 PM | Updated on Sep 3 2017 12:49 AM

ఆయన తెలుగులో మళ్లీ తీయాలి!

ఆయన తెలుగులో మళ్లీ తీయాలి!

నాన్నగారు రూపొందించిన సినిమాలకు ఏయమ్ రత్నంగారు పనిచేశారు...

‘‘నాన్నగారు రూపొందించిన సినిమాలకు ఏయమ్ రత్నంగారు పనిచేశారు. అప్పటినుంచి ఆయన పరిచయం. కమల్‌హాసన్, రజనీకాంత్‌లతో మంచి విజయవంతమైన చిత్రాలు తీశారు. అజిత్‌తో ఇది మూడో సినిమా. తమిళంలో లాగే తెలుగులో కూడా ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలి’’ అని హీరో గోపీచంద్ ఆకాంక్షించారు. అజిత్, త్రిష, అనుష్క హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం  ‘ఎన్నై అరిందాల్’ను  ‘ఎంతవాడు గానీ...’ పేరుతో ఎ.ఎమ్.రత్నం తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకుడు.

ఈ సినిమా పాటల వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా పాటల సీడీని ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి పాటల సీడీని ఆవిష్కరించి, హీరో గోపీచంద్‌కు అందజేశారు. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ -‘‘ఏయమ్ రత్నంగారు నిర్మించిన ‘జెంటిల్‌మ్యాన్’  చూసి ఆయనకు అభిమానిగా మారాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఆయన  తెలుగులో మళ్లీ సినిమాలు తీయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. తెలుగులో కూడా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఏయం రత్నం ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement