
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)కు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు జులై 24న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, తాజాగా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ నుంచి ఒక నోట్ విడుదలైంది. నిర్మాత ఏఎం రత్నం మీద రెండు వేర్వేరు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఫిర్యాదుల చేశాయి. ఈ మేరకు టీఎఫ్‌సీసీ ఒక నోట్ విడుదల చేసింది.
ఏఎం రత్నం నిర్మించిన ‘ఆక్సిజన్’ సినిమాకి సంబంధించి రూ. 2.6 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్ పేర్కొంది. ఆపై ముద్దుల కొడుకు, బంగారం చిత్రాలకు సంబంధించి కూడా రూ.90 లక్షలు ఇవ్వాల్సి ఉందని మహాలక్ష్మీ ఫిల్మ్స్ సంస్థ ఫిర్యాదు చేసింది. అయితే, నిర్మాతగా ఏఎం రత్నం నిర్మించిన సినిమా ‘హరి హర వీరమల్లు’ రిలీజ్కు ముందే తమ బాకీలు క్లియర్ చేయాలని ఆ సంస్థలు అభ్యర్థించాయి. ఈ విషంయలో ఇతర డిస్ట్రిబ్యూటర్లు (నైజాం) సహకరించాలని కోరారు.
#HHVM ఆక్సిజన్ సినిమా బకాయిల మీద
ఫిలిం ఛాంబర్ లో కంప్లయింట్ pic.twitter.com/FRN9ulQEJ6— devipriya (@sairaaj44) July 20, 2025