
పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara VeeraMallu) సినిమా నుంచి 'అసుర హననం' పాటను తాజాగా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన నుంచి విడుదలవుతున్న తొలి సినిమా కాబట్టి ఆయన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. జూన్ 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు కొద్దిరోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను భారీ బడ్జెట్‌తో ఏఎమ్ రత్నం నిర్మించారు. సంగీతం ఎమ్ ఎమ్ కీరవాణి అందించారు.
ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించనున్నారు. తొలి భాగం 'హరి హర వీరమల్లు: పార్ట్ 1- స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకులు క్రిష్ కొంతభాగం తెరకెక్కింగా.. ఆ తర్వాత నిర్మాత రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. సుమారు 5 ఏళ్ల పాటు ఈ సినిమా షూటింగ్ పనులు కొనసాగాయి.