
టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన చారిత్రాత్మక తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. పవన్ సింగిల్ హీరోగా నటించిన చిత్రం విడుదల కాక చాలారోజులు అయింది. దీంతో ఆయన నటించిన కొత్త చిత్రం ‘హరి హర వీరమల్లు’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పవన్ అభిమానులలు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హరి హర వీరమల్లు’ మే 9న రానున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్‌పై ప్రకటన విడుదలైంది. ఒక పోస్టర్‌తో పాటుగా మే 9న ఈ చిత్రం విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘కొల్లగొట్టినాదిరో..’ పాట లిరికల్ వీడియోను కొద్దిరోజుల క్రితమే రిలీజ్ చేశారు. గణేష్ మాస్టర్స్ కొరియోగ్రఫీ స్టెప్పులకు అభిమానులు ఫిదా అయ్యారు. 2023లో విడుదలైన ‘బ్రో’ తర్వాత దాదాపు రెండేళ్లకు ‘హరి హర వీరమల్లు’తో పవన్ వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయని నిర్మాత ఏఎం రత్నం అన్నారు.

పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ మూవీని క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా పార్ట్-1 మాత్రం మార్చి 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. ఈమేరకు అధికారికంగా ఒక పోస్టర్‌ను కూడా ఆ సమయంలో విడుదల చేశారు. కానీ, పలు కారణాల వల్ల విడుదల విషయంలో జాప్యం జరిగింది. దీంతో మరోసారి విడుదల తేదీని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment