
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను వేకర్స్ ఫైనల్ చేశారు. జులై 24న పాన్ ఇండియా రేంజ్లొ విడుదల కానున్న ఈ మూవీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు విడుదల కానుంది. అయితే, ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 20న విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి రానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా రన్‌టైమ్: 2:42 నిమిషాలు ఉన్నట్లు పేర్కొంది.
గతంలో ఈ కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించాలనుకున్నారు. అప్పుడు సినిమా వాయిదా పడటంతో ఈ కార్యక్రమం కూడా ఆగిపోయింది. ఇప్పుడు తాజాగా విశాఖను ఎంచుకున్నారు. ఈ సినిమాకి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా దర్శకత్వం వహించగా.. ఏఎం రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మించారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలలో మెప్పించనున్నారు.