
అనుకున్నది సాధించాలంటే సంకల్పం, దీక్ష అవసరం. ఈ రోజుల్లో లక్షలు జీతాలు తీసుకునేవారు కూడా మంత్ ఎండ్ వచ్చే సరికి.. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అయితే కేవలం 10వ తరగతి మాత్రమే చదివిన ఓ వ్యక్తి ఏకంగా కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదా చేసి.. అందరిచేతా ఔరా అనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
జేబులో రూ. 5000
రెడ్దిట్ పోస్టులో వైరల్ అవుతున్న ఓకే పోస్టులో.. తాను దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న గ్రామం నుంచి ఉండేవాడు. స్వయంగా ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకున్న తరువాత 2000 సంవత్సరంలో బెంగళూరుకు వచ్చాడు. అప్పుడు అతని వయసు 27 ఏళ్లు. ఆ సమయంలో అతని జేబులో ఉన్న డబ్బు రూ. 5000 మాత్రమే. తాను చాలా పేద కుటుంబం నుంచి వచ్చినట్లు చెప్పుకున్నాడు. అతని మొదటి జీతం రూ. 4200 మాత్రమే. చివరగా తీసుకున్న జీతం రూ. 63,000 అని పేర్కొన్నాడు.
బెంగళూరు శివార్లలో రూ. 6500లకు సింగిల్ బెడ్‌రూమ్ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అందులో అతడు, అతని భార్య, కూతురు మాత్రమే ఉంటారు. వీరి నెలవారీ ఖర్చులు రూ. 25000. గత 25 ఏళ్లలో అతడు కేవలం నాలుగు సార్లు మాత్రమే ఇల్లు మారాడు. అయితే అతడు ఎప్పుడు అప్పు ఇవ్వలేదు, అప్పు తీసుకోలేదని వివరించాడు.

2024లో పర్సనల్ ఫైనాన్స్.. ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుని అందులో పెట్టుబడి పెట్టడం నేర్చుకున్నాడు. ఇది తన బిడ్డ కోసం దాస్తున్నట్లు పేర్కొన్నాడు. అదృష్టవశాత్తూ వారికి ఎప్పుడూ పెద్ద అనారోగ్యం గానీ.. కష్టాలు గానీ రాలేదని చెప్పాడు.
క్రెడిట్ కార్డ్ లేదు
వివిధ బ్యాంకుల్లో 1 కోటి రూపాయలు. 10,000 రూపాయలు డిపాజిట్లు. ఈక్విటీలో రూ. 65 వేల రూపాయలు ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ లేదు. 2015 ప్రాంతంలో ఒక స్కూటర్ ఉండేది. చూపు తక్కువగా ఉండటం వల్ల దానిని సరిగ్గా నడపలేకపోవడంతో అమ్మేశాడు. ప్రతిచోటకు నడిచే వెళ్తాడు. ఇప్పటికీ ఒక గుక్క నీరు కూడా తాగకుండా ఐదు కిలోమీటర్లు నడవగలను/జాగింగ్ చేయగలనని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక
రాసిన లేదా ప్రింట్ చేసిన రచనలకు ప్రూఫ్ రీడింగ్ పని మాత్రమే చేసేవాడిని. అది తప్పా నేను వేరే ఏ పనీ చేయలేదని చెప్పుకొచ్చాడు. అయితే నా కూతురు చదువు పూర్తయిన తరువాత, పని చేయడం ప్రారంభించాను. నేను ఇప్పటి వరకు కూడబెట్టిన డబ్బుకు కుమార్తె డబ్బు రూ. 2 లక్షలు కలిశాయని చెప్పాడు.
నా అనుభవం నుంచే నేను చాలా నేర్చుకున్నాను. విద్య, తెలివితేటలు, ఆరోగ్యం, సమయం అనేవి ఒక వ్యక్తికి పెద్ద ఆస్తులు. అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి ఓర్పు, క్రమశిక్షణ చాలా అవసరం అని ఆ వ్యక్తి చెబుతాడు. విలాసాలకు పోకుండా జీవితం గడిపితే ఎవరైనా డబ్బు కూడబెట్టవచ్చు అని చెబుతాడు.