విజయవాడ–బెంగళూరు మధ్య వందేభారత్‌ | Vandebharat Express to Soon Run Between Vijayawada and Bengaluru | Sakshi
Sakshi News home page

విజయవాడ–బెంగళూరు మధ్య వందేభారత్‌

Nov 11 2025 3:37 AM | Updated on Nov 11 2025 3:37 AM

Vandebharat Express to Soon Run Between Vijayawada and Bengaluru

ఈ నెలాఖరు నుంచి రైలు ప్రారంభం 

విజయవాడ–చెన్నై రైలు నరసాపురం వరకు పొడిగింపు  

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మరో వందేభారత్‌ రైలును రైల్వే శాఖ మంజూరు చేసింది. విజయవాడ–బెంగళూరు వందేభారత్‌ రైలు ఈ నెలాఖరుకు పట్టాలు ఎక్కనుంది. ఈ మేరకు రూట్‌ మ్యాప్, షెడ్యూల్‌ను రైల్వే శాఖ ఖరారు చేసింది. మంగళవారం మినహా మిగిలిన 6 రోజులు ప్రయాణించే ఈ రైలులో విజయవాడ నుంచి ఎస్‌ఎంవీటీ (బెంగళూరు) 9 గంటల్లో చేరుకోవచ్చు. 

ఈ రైలుకు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాటా్పడి, కృష్ణరాజపురంలో హాల్ట్‌లు కల్పించింది. మొత్తం 8 బోగీలు ఉండే ఈ రైలులో 7 ఏసీ చైర్‌కార్‌ బోగీలు, ఒక ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ ఉంటాయి. ఈ రైలు (20711) విజయవాడలో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు బెంగళూరు చేరుతుంది. అలాగే, రైలు (20712) బెంగళూరులో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. కాగా, ఇప్పటికే ప్రారంభించిన విజ­య­వాడ– చెన్నై సెంట్రల్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను నరసాపురం వరకు పొడిగించారు. గుడివాడ, భీమవరంలో హాల్ట్‌లు కల్పించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement