వైఎస్‌ జగన్‌ నివాసంలో దీపావళి వేడుకలు | Diwali 2025 Celebrations At YSRCP Chief YS Jagan Residence In Bengaluru, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

YS Jagan Diwali Celebrations: వైఎస్‌ జగన్‌ నివాసంలో దీపావళి వేడుకలు

Oct 20 2025 8:14 PM | Updated on Oct 20 2025 9:34 PM

Bengaluru: Diwali Celebrations At Ys Jagan Residence

బెంగళూరు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపావళి వేడుకల్లో వైఎస్‌ జగన్‌ దంపతులు పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి వైఎస్‌ భారతి బాణాసంచా కాల్చారు. దీపావళి వేడుకలు సందర్భంగా వైఎస్‌ జగన్‌ నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ చేశారు.

దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎక్స్‌ ద్వారా వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజ‌యానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement