ఈ ఐటీ ఉద్యోగం.. రూ.కోటి జీతం | No CV no college Bengaluru AI startup founder offers Rs 1 crore job | Sakshi
Sakshi News home page

ఈ ఐటీ ఉద్యోగం.. రూ.కోటి జీతం

Jul 9 2025 6:35 PM | Updated on Jul 9 2025 8:42 PM

No CV no college Bengaluru AI startup founder offers Rs 1 crore job

పేరున్న కాలేజీలో పెద్ద పెద్ద డిగ్రీలు చదివితేనే మంచి ఉద్యోగాలు వస్తాయన్న భావనకు కాలం చెల్లిపోతోంది. ఏఐ టెక్నాలజీ విస్తృతమవుతున్న నేపథ్యంలో కాలేజీలు, డిగ్రీలతో సంబంధం లేకుండా ప్రతిభ ఉంటే చాలు రూ.లక్షల్లో జీతాలతో ఉద్యోగాలిస్తామంటూ ముందుకొస్తున్నాయి కొన్ని సంస్థలు. ఈ క్రమంలోనే భారత సంతతికి చెందిన ఓ స్టార్టప్ ఫౌండర్ సోషల్ మీడియాలో అసాధారణమైన జాబ్ లిస్టింగ్‌ను పోస్ట్ చేసి ఆన్‌లైన్‌లో విస్తృత చర్చను రేకెత్తించారు.

‘స్మాల్ ఏఐ’ అనే ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకుడు సుదర్శన్ కామత్ తన కంపెనీకి ఫుల్‌ స్టాక్‌ టెక్ లీడ్ కావాలంటూ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఓ పోస్ట్‌ పెట్టారు. ఈ జాబ్‌కి ఆయన రూ .1 కోటి వార్షిక వేతన పరిహారాన్నిఆఫర్ చేశారు. ఈ ప్యాకేజీలో రూ.60 లక్షల ఫిక్స్డ్ వార్షిక వేతనం కాగా రూ.40 లక్షలు కంపెనీ యాజమాన్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీనికి అభ్యర్థి కాలేజీ డిగ్రీలతో నిమిత్తం లేదని, రెజ్యూమ్‌ కూడా అక్కర్లేదని ప్రకటించడంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

ఇంకా ఈ ఉద్యోగానికి ఏమేం కావాలన్నది కామత్‌ వివరించారు. ఆదర్శ అభ్యర్థికి "4-5 సంవత్సరాల అనుభవం" ఉండాలని, "నెక్ట్స్ జెఎస్, పైథాన్, రియాక్ట్ జెఎస్" గురించి బాగా తెలిసి ఉండాలని కామత్ పేర్కొన్నారు. అలాగే ఈ ఉద్యోగం బెంగళూరు కేంద్రంగా ఉంటుందని, ఎంపికైనవారు తక్షణమే ఉ‍ద్యోగంలో చేరాల్సి ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా జాబ్‌ వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ విధానంలో ఉంటుందని, వారానికి 5 రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేయాలని కూడా వివరించారు.

ఈ జాబ్‌కు అప్లయి చేయడానికి రెజ్యూమె అవసరం లేదని, కేవలం 100 పదాలతో తమ గురించి తెలియజేస్తే చాలంటూ కంపెనీ ఈ మెయిల్‌ అడ్రస్‌ ఇచ్చారు. కామత్ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఇప్పటికే మూడు లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. నెటిజన్‌లు భిన్న కామెంట్లతో ప్రతిస్పందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement