వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ | YSRCP IT Wing Meet And Greet Event In Bangalore | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’

Jul 20 2025 6:17 PM | Updated on Jul 20 2025 9:14 PM

YSRCP IT Wing Meet And Greet Event In Bangalore

బెంగళూరు:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం ఈ రోజు(ఆదివారం, జూలై 20వ తేదీ)  బెంగళూరులోని స్థానిక వేదికలో నిర్వహించబడింది. దేశం నలుమూలల నుండి వచ్చిన వైఎస్ఆర్‌సీపీ ఐటీ వింగ్ సభ్యులు ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ పాలసీలు, డిజిటల్ ప్రచారం, మరియు భవిష్యత్ యూత్ ఎన్గేజ్‌మెంట్ వ్యూహాలపై చర్చలు జరిపారు. పార్టీలో యువత పాత్రను పటిష్టపరిచేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ ఐటీ విభాగం ప్రముఖులు మాట్లాడుతూ, “డిజిటల్ యుగంలో పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్లేందుకు ఐటీ వింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ సమావేశం ద్వారా మనం ఒక కుటుంబంగా కలిసికట్టుగా ముందుకు సాగేందుకు మరో మెట్టు ఎక్కాం” అని తెలిపారు.

అంతేకాక, పాల్గొన్న సభ్యుల మధ్య అవగాహన పెంపు, నెట్‌వర్కింగ్, మరియు టీమ్ స్పిరిట్ మరింత బలపడేలా ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఓ వేదికగా నిలిచింది. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగానికి చెందిన పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. వీరిలో ఐటీ విభాగం ప్రెసిడెంట్‌ సునీల్‌ రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ భాస్కర్‌రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌లు ప్రతాప్‌ ముకుందాపురం, హరీష్‌రెడ్డి, జనార్థన్‌రెడ్డిలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యదర్శలు..
భాస్కర్ రెడ్డి కొప్పల, నల్లప రెడ్డి, విజయ్ రాఘవ రెడ్డి, రమేష్ రెడ్డి,
రోహిత్ రెడ్డి, జయచంద్ర రెడ్డి, సుధీర్ రెడ్డి, జగన్ పుసపాటి,
గుజ్జల శ్రీనివాసులు రెడ్డి, మురళి రెడ్డి, శ్రీనివాస్ పులి,
అంబవరం భాస్కర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి బాలం, మారుతి ఎం, గంగి రెడ్డి,
రఘునాథ రెడ్డి ఎన్, బాబుల్ తుమ్మా, శేఖర్ రెడ్డి, ప్రవీణ్ రాజు,
ఉదయ్ రెడ్డి, అశోక్ రెడ్డి, కల్యాణ్

పార్టీకి అంకితమైన అనేక మంది వైఎస్‌ జగన్‌ అభిమానులు ఈ సమావేశంలో పాల్గొని, ఐటీ విభాగం భవిష్యత్ దిశపై విలువైన సూచనలు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement