breaking news
IT wing
-
‘సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలి’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో వైఎస్ జగన్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడంలో ఐటీ వింగ్ క్రియాశీలక పాత్ర పోషించాలని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీలో టెక్నాలజీ ప్రాముఖ్యత, సులభంగా అర్థమయ్యే రీతిలో పార్టీ లైన్ క్యాడర్‌కు, ప్రజలకు వివరించడంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై చర్చ జరగడం మంచి పరిణామంగా సజ్జల పేర్కొన్నారు. బుధవారం.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఐటీ వింగ్ సమావేశం జరిగింది. సజ్జలతో పాటు ఐటీ వింగ్ ప్రెసిడెంట్ పోశింరెడ్డి సునీల్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ్ భాస్కర్ రెడ్డి, అన్ని జిల్లాల ఐటీ వింగ్ అధ్యక్షులు, పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, లేళ్ళ అప్పిరెడ్డి, పూడి శ్రీహరి, ఆలూరి సాంబశివారెడ్డి, తలారి రంగయ్య, టీజేఆర్ సుధాకర్ బాబు, దవులూరి దొరబాబు, పలువురు నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘సాంకేతికతను వాడుకుంటూ ఏ విధమైన మెకానిజం ఉండాలన్న దానిపై కూడా మనం చర్చిద్దాం. వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్‌పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కొనే మెకానిజాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేషన్‌ను అనుసంధానించడం అనేది ఒక ముఖ్యమైన ఎజెండాగా మనం ముందుకెళ్ళాలి. అబద్దాన్ని నిజం అని చంద్రబాబు, టీడీపీ చేస్తున్న ప్రచారం బలంగా తిప్పికొట్టాలి...ఐటీ వింగ్‌లో క్రియాశీలకంగా ఉన్నవారినందరినీ ఒక గ్రిడ్ కిందకు తీసుకువచ్చి అందరినీ మమేకం చేయాలి. పార్టీలోని అన్ని కమిటీల నిర్మాణంపై సీరియస్‌గా దృష్టిపెట్టాలి, వారి బాధ్యతలు, నిర్వర్తించాల్సిన విధులపై అవగాహన కల్పించాలి. మనమంతా ఒక ఆర్గనైజ్డ్ టీమ్‌గా ముందుకెళ్ళాలి. దానికి తగిన విధంగా మనం సిద్ధం కావాలి. రాష్ట్రస్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసుకుని అన్ని విభాగాలు సమన్వయం చేసుకోవాలి. అందరూ ఫోకస్‌తో కష్టపడి పనిచేసి పార్టీ మెకానిజంలో భాగస్వాములవ్వాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
ఘనంగా ‘వైఎస్సార్సీపీ ఐటి వింగ్ - ఢిల్లీ చాప్టర్’ ప్రారంభం
సాక్షి, ఢిల్లీ: న్యూఢిల్లీలోని "Constitution Club of India" లో ఢిల్లీ,ఎన్.సి.ఆర్ పరిధిలో నివాసం ఉంటున్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి , పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులతో,వైఎస్సార్సీపీ సానుభూతి పరులతో జరిగిన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమంలో ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటి వింగ్ - ఢిల్లీ చాప్టర్’ ను లాంచనంగా ప్రారంభించారు. డిల్లీ, గురుగ్రామ్, నోయిడా, నలుమూలల నుండి వచ్చిన వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ సభ్యులు ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర ఐటి వింగ్ ప్రెసిడెంట్ పోసింరెడ్డి సునీల్ రెడ్డి , రాష్ట్ర ఐటి వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ భాస్కర్ రెడ్డి, ఇతర సీనియర్ నాయకులు హాజరై వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు..అనంతరం MP గురుమూర్తి మాట్లాడుతూ... TDP కూటమి ప్రభుత్వం జగన్‌పై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఢిల్లీ వేదికగా తిప్పికొడతామని అన్నారు. అబద్ధం పైన పోరాటం లక్ష్యంగా ఢిల్లీ విభాగం పని చేస్తుంది అని ఆయన అన్నారు. పార్టీ బలోపేతం కోసం ఢిల్లీ లో అందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. రాబోయే కాలంలో మరిన్ని సమావేశాలు ఢిల్లీ వేదికగా నిర్వహిస్తామని చెప్పారు.ఐటి వింగ్ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి మాట్లాడుతూ ..ఐటీ వింగ్ కార్యకలాపాలు ఢిల్లీలో కూడా మొదలుపెట్టడం చాలా గర్వకారణంగా ఉంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాలలో చేసిన ఎన్నో ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ప్రచారం చేయడంలో మనం విఫలమయ్యామని తెలిపారు. కాబట్టి రాబోయే రోజుల్లో నిజాన్ని బలంగా పలికి, అబద్ధాన్ని ఖండించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. అలానే ఈ ప్రోగ్రాం దగ్గరుండి అన్ని చూసుకున్న వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ భాస్కర్ రెడ్డి, కోఆర్డినేషన్ సభ్యులను అభినందించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు..ఐటి వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్యాల విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇంత దూరం వచ్చి ఢిల్లీలో స్థిరపడి ఇన్ని సంవత్సరాలు అయినా రాష్ట్రానికి మరలా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నినాదించారు.. అందరి కోరిక తప్పకుండా 2029 సంవత్సరంలో తీరుతున్నది అని విశ్వాసం నెలకొల్పారు.రానున్న రోజుల్లో ఐటి వింగ్ ఆధ్వర్యంలో అన్నీ మెట్రో నగరాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్య మంత్రి చేసుకొనే ఒక బృహత్తర కార్యక్రమంలో ఐటి వింగ్ తన వంతుగా కృషి చేస్తోందన్నారు. మనకు 2024లో ఆశించిన ఫలితాలు రాకపోయిన ఇప్పటికీ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ పాలసీలు, డిజిటల్ ప్రచారం, భవిష్యత్ యూత్ ఎన్గేజ్మెంట్ వ్యూహాలపై చర్చలు జరిపారు. పార్టీలో యువత పాత్రను పటిష్టపరిచేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం ప్రముఖులు మాట్లాడుతూ, “డిజిటల్ యుగంలో పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్లేందుకు ఐటీ వింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ సమావేశం ద్వారా మనం ఒక కుటుంబంగా కలిసికట్టుగా ముందుకు సాగేందుకు మరో మెట్టు ఎక్కాం” అని తెలిపారు.కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగానికి చెందిన పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. వీరిలో• రాష్ట్ర ఐటి విభాగం అధ్యక్షుడు: సునీల్ రెడ్డి•రాష్ట్ర ఐటి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు: విజయ్ భాస్కర్ రెడ్డి.ఎన్నారై UK కోఆర్డినేటర్ కార్తీక్ ఎల్లాప్రగడఎన్నారై కెనడా కోఆర్డినేటర్ వేణురాష్ట్ర ఐటీ విభాగం ఉపాధ్యక్షులు హరీష్ రెడ్డి.రాష్ట్ర ఐటీ విభాగం భాగం అధికార ప్రతినిధి జగన్ పూసపాటి.ఢిల్లీ కార్యదర్శులు: శ్రీకాంత్, శామ్యూల్, జోగారావు, పెంచలయ్య, అనిల్, విష్ణువర్ధన్ , సదానంద్, మధుసూదన్.మరియు భారీ సంఖ్యలో వైసీపీ అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. -
వైఎస్సార్సీపీ ఐటీ విభాగం ‘మీట్ అండ్ గ్రీట్’
బెంగళూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం ఆధ్వర్యంలో “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమం ఈ రోజు(ఆదివారం, జూలై 20వ తేదీ) బెంగళూరులోని స్థానిక వేదికలో నిర్వహించబడింది. దేశం నలుమూలల నుండి వచ్చిన వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ సభ్యులు ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ పాలసీలు, డిజిటల్ ప్రచారం, మరియు భవిష్యత్ యూత్ ఎన్గేజ్మెంట్ వ్యూహాలపై చర్చలు జరిపారు. పార్టీలో యువత పాత్రను పటిష్టపరిచేందుకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను ఎలా వినియోగించుకోవాలి అనే దానిపై నాయకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగం ప్రముఖులు మాట్లాడుతూ, “డిజిటల్ యుగంలో పార్టీ అభిప్రాయాలను ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్లేందుకు ఐటీ వింగ్ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ సమావేశం ద్వారా మనం ఒక కుటుంబంగా కలిసికట్టుగా ముందుకు సాగేందుకు మరో మెట్టు ఎక్కాం” అని తెలిపారు.అంతేకాక, పాల్గొన్న సభ్యుల మధ్య అవగాహన పెంపు, నెట్వర్కింగ్, మరియు టీమ్ స్పిరిట్ మరింత బలపడేలా ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఓ వేదికగా నిలిచింది. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగానికి చెందిన పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. వీరిలో ఐటీ విభాగం ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ భాస్కర్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు ప్రతాప్ ముకుందాపురం, హరీష్‌రెడ్డి, జనార్థన్‌రెడ్డిలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యదర్శలు..భాస్కర్ రెడ్డి కొప్పల, నల్లప రెడ్డి, విజయ్ రాఘవ రెడ్డి, రమేష్ రెడ్డి,రోహిత్ రెడ్డి, జయచంద్ర రెడ్డి, సుధీర్ రెడ్డి, జగన్ పుసపాటి,గుజ్జల శ్రీనివాసులు రెడ్డి, మురళి రెడ్డి, శ్రీనివాస్ పులి,అంబవరం భాస్కర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి బాలం, మారుతి ఎం, గంగి రెడ్డి,రఘునాథ రెడ్డి ఎన్, బాబుల్ తుమ్మా, శేఖర్ రెడ్డి, ప్రవీణ్ రాజు,ఉదయ్ రెడ్డి, అశోక్ రెడ్డి, కల్యాణ్పార్టీకి అంకితమైన అనేక మంది వైఎస్ జగన్ అభిమానులు ఈ సమావేశంలో పాల్గొని, ఐటీ విభాగం భవిష్యత్ దిశపై విలువైన సూచనలు ఇచ్చారు. -
లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ పేరిట టీడీపీ ఐటీ వింగ్ హంగామా
సాక్షి, హైదరాబాద్: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్‌పై హంగామా సృష్టించేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ పేరిట టీడీపీ ఐటీ వింగ్ పేరుతో కొందనే మెట్రో రైలులో హడావుడి చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. వారికి మెట్రో ప్రయాణీకులే షాకిచ్చారు. సీబీఎన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తున్న వారిని అడ్డుకున్న ఓ మధ్య వయస్కుడు మాట్లాడుతూ... ‘ఎక్కడ చేయాలో అక్కడ చేయండి. ఏం చేయాలో అది చేయండి. అంతేకానీ ఊరికే అరచి ఏం ఉపయోగం’’ అని ప్రశ్నించడంతో వారు ఖంగు తిన్నారు. అయితే టీడీపీ వర్గం వారు అక్కడితో ఆగిపోలేదు.. ‘‘ఏం చేయమంటారు’’ అని ఎదురు ప్రశ్నించారు. దీనికి కూడా అతడు ఓపికగా బదులిచ్చాడు. ‘‘న్యాయపోరాటం ఒకటి నడుస్తోంది కదా...’’ అని సమాధానమిచ్చారు. టీడీపీ ఐటీ వింగ్ పేరుతో కొంతమంది మియాపూర్నుం నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోరైలులో ప్రయాణిఒంచారు. దారిపొడవునా నినాదాలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్శించాలన్నది వారి ఉద్దేశం. మియాపూర్‌లో మెట్రోరైలు ఎక్కే సమయంలోనూ టీడీపీ కార్యకర్తలు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అందరినీ ఒకేసారి వదలడం లేదంటూ పేచీ పెట్టారు. అయితే టీడీపీ కార్యకర్తలను మాత్రమే లోనికి వదిలే క్రమంలో ఇతరులు పలువురు ఇబ్బందులకు గురయ్యారు. మెట్రో స్టేషన్లోకి వెళ్లేందుకు మెట్ల వద్ద ఉన్న డోర్‌ను కాసేపు క్లోజ్ చేయడంతో.. చిన్నపిల్లలతో అరగంటపాటు మహిళలు, ఇతర ప్రయాణికులు మెట్లపై నిల్చునున్నారు. దీంతో అసహనానికి గురైన కొందరు మహిళా ప్రయాణికులు ఇదేంటి అంటూ పోలీసులను నిలదీశారు. ఇక ప్లకార్డులతో మెట్రో కింద ఫోటోలకు ఫోజులిచ్చిన కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వెంటనే అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు. ‘Let’s Metro for CBN’ protest by travelling from Miyapur-LB Nagar was held in #Hyderabad metro by supporters of Chandrababu Naidu, by wearing black t-shirts. Police and passengers stopped them from causing inconvenience to public pic.twitter.com/KxIx0vTKN6 — Naveena (@TheNaveena) October 14, 2023 -
హైదరాబాద్: మాదాపూర్ లో వైఎస్ఆర్ సీపీ ఐటీ వింగ్ సదస్సు
-
లక్ష మందితో వైఎస్సార్ సీపీ ఐటీ సైన్యం
సాక్షి, హైదరాబాద్: ఏపీలోని అధికార వైఎస్సార్సీపీకి చెందిన ఐటీ విభాగం వినూత్నంగా లక్ష మంది ఐటీ ప్రొఫెషనల్స్‌తో ఒక భారీ ఐటీ సైన్యాన్ని రూపొందిస్తోంది. దీనికి సంబంధించి మిషన్ ఐటీ ఆర్మీని ఆ పార్టీ ఐటీ విభాగ రాష్ట్ర అధ్యక్షులు సునీల్‌కుమార్ రెడ్డి పోసింరెడ్డి శనివారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఆ పార్టీ ఐటీ విభాగం ఐటీ ప్రొఫెషనల్స్‌తో ఒక భారీ సదస్సును నిర్వహించింది. ఈ సదసుకు హైదరాబాద్ జంటనగరాల్లోని వైఎస్సార్ సీపీఅభిమానులైన ఐటీ ఉద్యోగులు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ ఐటీ ప్రొఫెషనల్స్ భారీ ఎత్తన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి ఒక బలమైన శక్తిమంతమైన ఐటీ సైన్యం ఉండాలని తాము భావించామన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు మిషన్ ఐటీ ఆర్మ పేరిట వైసీపీకి ఒక భారీ ఐటీ ఆర్మీని ఆవిష్కరిస్తున్నామన్నారు. వైఎస్సార్ సీపీఐటీ విభాగానికి 5 లక్షలకు పైగా సభ్యత్వముందన్నారు. వీరిలో కనీసం లక్ష మందితో బలీయమైన ఐటీ సైన్యాన్ని ఏర్పాటు చేసి పార్టీ సేవలకు అంకితం చేయాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్‌ను ప్రారంభించామన్నారు. పార్టీ అభిమానులైన ఐటీ నిపుణులు, ఉద్యోగులంతా కూడా ఈ సైన్యం చేరి తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. దీని కోసం ప్రత్యేక పోర్టల్‌ను ఆరంభించామన్నారు. వైఎస్సార్ సీపీఐటీ సైన్యం అంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడ గ్రామీణ యువత, గ్రామాల్లోని ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లతో మమేకమవుతారని, వారి సాధకబాధలు తెలుసుకుని వారికి మంచి ఉద్యోగావకాశాలు లభించేలా ఈ వేదిక కృషి చేస్తుందన్నారు. అలాగే పార్టీ విజయాలను, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాధించిన విజయాలను, సంక్షేమ కార్యక్రమ ఫలాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతామన్నారు. ఈ తరహా సదస్సులను దేశంలోని ముఖ్య పట్టణాల్లో నిర్వహించి ఆ ప్రాంతాల్లోని ఐటీ ప్రొఫెషనల్స్‌తో అనుసంధానమవుతామన్నారు. ఐటీ వింగ్ పార్టీకి, పార్టీ అభిమానులైన ఐటీ ప్రొఫెషనల్స్‌కు మధ్య ఒక వారధిగా వ్యవహరిస్తుందన్నారు. చంద్రబాబుది రియల్ ఎస్టేట్ వ్యాపారం తాను ఐటీ అభివృద్ధి చేశానని టీడీపీ నేత చంద్రబాబు నిత్యం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటారని సునీల్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. నిజానికి హైదరాబాద్‌లో ఐటీ ప్రగతికి బీజం పడింది మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డ హయాంలో అయితే తదనంతరం ఐటీ ఊపందుకుంది మాత్రం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలోనేనని, ఇవేవో దాచేస్తే దాగే గణాంకాలు కావని, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్కలేనని చెప్పారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ పేరిట ఆయన హంగామా చేసి తన వాళ్ల చేత భూములు కొనిపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని విమర్శించారు. అమరావతిలో కూడా అలాగే రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రాష్ట్రాన్ని ముంచేశారన్నారు. కోవిడ్ కష్టాలు చుట్టుముట్టినా కూడా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ రాష్ట్రాన్ని ప్రగతి పథంవైపు సమర్థవంతంగా నడిపిస్తున్నారని ఆయన అన్నారు. ఈ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో పారిశ్రామిక, ఐటీ అభివృద్ది ఊపందుకుంటోందన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏపీవైపు చూస్తోందని, విశాఖపట్నం ప్రఖ్యాత ఐటీ కేంద్రంగా అభివృద్ధి చెంది, దేశంలోని పెద్ద పెద్ద నగరాలతోనే పోటీపడబోతోందన్నారు. ఇప్పటికే ఇక్కడ అదాని లాంటి సంస్థ అతి పెద్ద డాటా కేంద్రాన్ని ఏర్పాటు చేసి 50వేల ఉద్యోగాలు కల్పించబోతోందన్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ఐటీ విధానపత్రం ద్వారా రాబోయే మూడేళ్లలో మరో 50వేల ఉద్యోగాలు ఈ రంగంలో కల్పించబోతున్నామన్నారు. వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా, ప్రజలందరిపైనా ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమాంతంగా నిర్వహిస్తూ ప్రజలను ప్రగతిపథంవైపు నడిపిస్తున్న జగన్ ప్రభుత్వం మళ్లీ కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ నిర్దేశించిన టార్గెట్ 175 సాధించి తీరే వరకు ఐటీ సైన్యం విశ్రాంతి లేకుండా కృషి చేయాలని కోరారు. ఐటీ ప్రొఫెషనల్స్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకించి దృష్టి సారిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆయన ఐటీ ప్రొఫెషనల్స్‌తో మాటా మంతి నిర్వహించి పార్టీ బలోపేతానికి వారి నుంచీ విలువైన సలహాలు, సూచనలు స్వీకరించారు. -
HYD: జూన్ 3న వైఎస్సార్సీపీ ఐటీ విభాగ సదస్సు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఐటీ విభాగం జూన్ 3వ తేదీ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్‌తో ఒక భారీ సదస్సును నిర్వహిస్తోంది. హైటెక్ సిటీలోని బుట్టా కన్వెన్షన్ హాలులో ఉదయం 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఈ సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సమావేశానికి హైదరాబాద్ నగరంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో ఆహ్వానిస్తున్నారు. వైస్సార్సీపీ ఐటీ విభాగం అధ్యక్షులు సునీల్ కుమార్ రెడ్డి పోసింరెడ్డి అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో వైస్సార్సీపీ పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహం గురించి, ఐటీ ఉద్యోగుల సమస్యలపైన సమగ్రంగా చర్చిస్తారు. ఈ సదస్సుకు వైస్సార్సీపీని అభిమానించే ఐటీ ఉద్యోగులందరూ తప్పకుండా హాజరై సదస్సును విజయవంతం చేయాలని సునీల్ కుమార్ రెడ్డి కోరారు. సదస్సుకు హాజరు కాదలచినవారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 7829922666, 7032597980 నెంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. ఇది కూడా చదవండి: పేదల తరుపున ప్రభుత్వం పోరాడింది.. ఇక అమరావతి అందరిది: వెంకటపాలెం సభలో సీఎం జగన్ -
హోదా కోసం డిజిటల్ మీడియాలోనూ ప్రచారం
-
‘సీఆర్డీఏ ఐటీ’కి స్మార్ట్ గవర్నెన్స్ అవార్డు
తుళ్లూరు : తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో ఐటీ విభాగానికి స్మార్ట్ గవర్నెన్స్ అవార్డు దక్కినట్లు సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఆర్డీఏ పరిధిలో ఐటీ విభాగానికి సంబంధించి బాధ్యతలు నిర్వహించిన ఐటీ విభాగ అధికారి నక్కల ప్రభాకర్‌రెడ్డికి ఈ అవార్డు దక్కినట్లు వివరించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హాలులో స్కాచ్ సంస్థ 45వ జాతీయోత్సవంలో భాగంగా ఈ అవార్డు ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలో, అతి తక్కువ సిబ్బందితో ఐటీ టెక్నాలజీ ఉపయోగించి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినందుకుగాను ఈ అవార్డు లభించిందని అవార్డు అందుకున్న ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. -
YSRCP ఐటి వింగ్ సభ్యుడు హర్షతో వేదిక