
సాక్షి, ఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మా మద్దతు ఎవరికీ అనేది ఇప్పటికే మా హైకమాండ్ స్పష్టం చేసిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి అన్నారు. కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన వైఎస్సార్‌సీపీ ఐటీ వింగ్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఎంపీ మిథున్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకుంటారని.. ఓటు అంశంలో ఇప్పటికే కోర్టును ఆశ్రయించారని గురుమూర్తి తెలిపారు. ఢిల్లీలో నాలుగు దశాబ్దాలుగా వైఎస్సార్‌కు ఆప్తులు ఉన్నారు. జగన్‌కు ఫాలోవర్స్ ఉన్నారు. ఢిల్లీలో ఉన్న వాళ్లందరినీ కలుపుకు పోయేలా ఐటీ వింగ్ పనిచేసింది. జగనన్న ఆదేశాల మేరకు అందరూ యాక్టివ్‌గా పని చెయ్యాలి’’ అని గురుమూర్తి పిలుపునిచ్చారు.
‘‘చంద్రబాబు హయాంలో ప్రచారానికే ఐటీనీ పరిమితం చేశారు. ఒక మాటను పదే పదే చెప్పి నిజమని నమ్మిస్తున్నారు. ఐటీ టవర్స్‌కు నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. చంద్రబాబు మేమే కట్టామని ప్రచారం చేశారు. వైఎస్సార్ అధికారంలో ఉన్నపుడు.. హ్యూమన్ రిసోర్స్ పై ఫోకస్ పెట్టారు. ఫీజు రియంబర్స్ ద్వారా లక్షల మందికి విద్యార్థులకు ఇంజరినింగ్ విద్య అందించారు. దాంతో ఎందరికో ఐటీ ఉద్యోగాలు వచ్చాయి.
..వైఎస్సార్ కుటుంబం ప్రచారానికి దూరంగా.. ప్రజలకు దగ్గర ఉన్నాం. చంద్రబాబు సర్కార్ కొన్ని సంస్థలను ప్రైవేట్‌కు అమ్మే ప్రయత్నం చేస్తోంది. జగనన్నపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మేధావుల మౌనం సమాజానికి చేటు. నిజం వైపు నిలబడదాం.. అబద్ధాలను తిప్పికొడదాం’’ అంటూ గురుమూర్తి పిలుపునిచ్చారు.