లెట్స్ మెట్రో ఫర్‌ సీబీఎన్‌ పేరిట టీడీపీ ఐటీ వింగ్‌ హంగామా | Babu Skill Case: TDP OverAction At Hyderabad Metro station | Sakshi
Sakshi News home page

లెట్స్ మెట్రో ఫర్‌ సీబీఎన్‌ పేరిట టీడీపీ హంగామా.. ప్రయాణికుల ఇబ్బందులు

Oct 14 2023 12:22 PM | Updated on Oct 14 2023 1:42 PM

Babu Skill Case: TDP OverAction At Hyderabad Metro station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్‌పై హంగామా సృష్టించేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. లెట్స్ మెట్రో ఫర్‌ సీబీఎన్‌ పేరిట  టీడీపీ ఐటీ వింగ్‌ పేరుతో కొందనే మెట్రో రైలులో హడావుడి చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. వారికి మెట్రో ప్రయాణీకులే షాకిచ్చారు.

సీబీఎన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తున్న వారిని అడ్డుకున్న ఓ మధ్య వయస్కుడు మాట్లాడుతూ... ‘ఎక్కడ చేయాలో అక్కడ చేయండి. ఏం చేయాలో అది చేయండి. అంతేకానీ ఊరికే అరచి ఏం ఉపయోగం’’ అని ప్రశ్నించడంతో వారు ఖంగు తిన్నారు. అయితే టీడీపీ వర్గం వారు అక్కడితో ఆగిపోలేదు.. ‘‘ఏం చేయమంటారు’’ అని ఎదురు ప్రశ్నించారు. దీనికి కూడా  అతడు ఓపికగా బదులిచ్చాడు. ‘‘న్యాయపోరాటం ఒకటి నడుస్తోంది కదా...’’ అని సమాధానమిచ్చారు. 

టీడీపీ ఐటీ వింగ్‌ పేరుతో కొంతమంది మియాపూర్నుం నుంచి ఎల్బీనగర్ వరకు  మెట్రోరైలులో ప్రయాణిఒంచారు. దారిపొడవునా నినాదాలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్శించాలన్నది వారి ఉద్దేశం. మియాపూర్‌లో మెట్రోరైలు ఎక్కే సమయంలోనూ టీడీపీ కార్యకర్తలు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అందరినీ ఒకేసారి వదలడం లేదంటూ పేచీ పెట్టారు. అయితే టీడీపీ కార్యకర్తలను మాత్రమే లోనికి వదిలే క్రమంలో ఇతరులు పలువురు ఇబ్బందులకు గురయ్యారు. 

మెట్రో స్టేషన్‌లోకి వెళ్లేందుకు మెట్ల వద్ద ఉన్న డోర్‌ను కాసేపు క్లోజ్‌ చేయడంతో.. చిన్నపిల్లలతో అరగంటపాటు మహిళలు, ఇతర ప్రయాణికులు మెట్లపై నిల్చునున్నారు. దీంతో అసహనానికి గురైన  కొందరు మహిళా ప్రయాణికులు ఇదేంటి అంటూ పోలీసులను నిలదీశారు. ఇక ప్లకార్డులతో మెట్రో కింద ఫోటోలకు ఫోజులిచ్చిన కొంతమంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు వెంటనే అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement