పేర్ని నానిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు | Vendetta Politics By AP Govt Cases Filed On Perni Nani | Sakshi
Sakshi News home page

పేర్ని నానిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు

Jul 13 2025 3:28 PM | Updated on Jul 13 2025 4:30 PM

Vendetta Politics By AP Govt Cases Filed On Perni Nani

కృష్ణాజిల్లా:   మాజీ మంత్రి , వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నానిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. టీడీపీ నేతల ఫిర్యాదులతో పేర్ని నానిపై అక్రమ కేసులు నమోదు చేశారు. ఈ మేరకు మచిలీపట్నం ఆర్‌ పేట పోలీస్‌ స్టేషన్‌లో పేర్ని నానిపై కేసులు నమోదు చేశారు.

టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు పేర్ని నానిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. జీరో ఎఫ్‌ఐఆర్‌ కింద పేర్ని నానిపై 353(2), 196(1) సెక్షన్ల కింద కేసులు ఫైల్‌ చేశారు.

అంతకుముందు పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. పెడనలో ‘‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి వెళ్లనీయకుండా పేర్ని నానిపై పోలీసులు ఆంక్షలు విధించారు. నిన్న(శనివారం) కూడా గుడివాడలో జరిగే కార్యక్రమంలో పాల్గొనివ్వకుండా పోలీసులు నిర్భంధం విధించారు. కూటమి నేతల ఒత్తిడితో వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు.

పెడన నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమంపై ఆంక్షలు విధించిన పోలీసులు.. పెడన ఇంఛార్జి ఉప్పాల రాముకి నోటీసులిచ్చారు. ఇతర నియోజకవర్గాల నాయకులు, బయటి వ్యక్తులు రాకూడదంటూ ఆంక్షలు పెట్టారు. 

పేర్ని నానిపై అక్రమ కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement