
సాక్షి,కృష్ణాజిల్లా: మంత్రి కొల్లు రవీంద్రపై మచిలీపట్నం వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి పేర్ని కిట్టు మండిపడ్డారు. ‘ఉప్పాల హారికపై దాడి జరిగితే కొల్లు రవీంద్ర ఆ దాడిని సమర్ధించడం సిగ్గుచేటు. మంత్రి కొల్లు రవీంద్రను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు మీ కుటుంబ సభ్యులతో కారులో వెళుతుంటే ఎవరైనా దాడి చేస్తే మీరు ఇలాగే మాట్లాడతారా? తన భార్యను నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏ భర్త అయినా ఎలా స్పందిస్తాడో ఉప్పాల రాము కూడా అలాగే స్పందించాడు. హారిక కంట్లో కారిన ప్రతీ కన్నీటి చుక్కకు దేవుడు.. కాలమే సమాధానం చెబుతాడు. ఉప్పాల హారికకు ఏ కష్టం వచ్చినా మేం అండగా ఉంటాం. మమ్మల్ని దాటుకునే ఎవరైనా మీ వరకూ రావాలి’అని స్పష్టం చేశారు.