breaking news
kollui ravindra
-
కొల్లు రవీంద్రకి పేర్ని కిట్టు స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి,కృష్ణాజిల్లా: మంత్రి కొల్లు రవీంద్రపై మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జి పేర్ని కిట్టు మండిపడ్డారు. ‘ఉప్పాల హారికపై దాడి జరిగితే కొల్లు రవీంద్ర ఆ దాడిని సమర్ధించడం సిగ్గుచేటు. మంత్రి కొల్లు రవీంద్రను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు మీ కుటుంబ సభ్యులతో కారులో వెళుతుంటే ఎవరైనా దాడి చేస్తే మీరు ఇలాగే మాట్లాడతారా? తన భార్యను నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏ భర్త అయినా ఎలా స్పందిస్తాడో ఉప్పాల రాము కూడా అలాగే స్పందించాడు. హారిక కంట్లో కారిన ప్రతీ కన్నీటి చుక్కకు దేవుడు.. కాలమే సమాధానం చెబుతాడు. ఉప్పాల హారికకు ఏ కష్టం వచ్చినా మేం అండగా ఉంటాం. మమ్మల్ని దాటుకునే ఎవరైనా మీ వరకూ రావాలి’అని స్పష్టం చేశారు. -
నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం కల్పించి నిరుద్యోగ యువతకు శిక్షణతో పాటు ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక నోవాటెల్ హోటల్లో బుధవారం జరిగిన ‘ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ స్కీమ్ ఇన్ ఏపీ’ సదస్సులో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. అ ప్రెంటిస్‌షిప్ విధానంపై పరిశ్రమల్లో ఉన్న అపోహలను తొలగించడమే సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా పరిశ్రమలు న్నా.. మెజారిటీ వాటిల్లో ఈ విధానాన్ని అమలు చేయడం లేదన్నారు. ఏదైనా పరిశ్రమ ఇది అమలుచేస్తే వారికిచ్చే శిక్షణలో 25శాతాన్ని ప్రభుత్వం తిరిగి ఆ కంపెనీకి చెల్లిస్తుందని తెలిపారు. దీని ద్వారా నెలకు ఒక్కో విద్యార్థికి రూ.1500 స్టైఫండ్ అందిస్తారన్నారు. కేంద్రం రూ.10 వేల కోట్ల కేటాయింపు.. దేశవ్యాప్తంగా 50 లక్షల మంది నిరుద్యోగులకు శిక్షణనివ్వాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు కేటాయించిందని, నేటికి రూ.200 కోట్లు మాత్రమే ఖర్చుచేశామన్నారు. త్వరలో 10 లక్షల నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భృతి ఇవ్వనుందని, వారికి అప్రెంటిస్ షిప్‌ను అనుసంధానించాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. సర్వీస్ సెక్టార్లు అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, సెరికల్చ ర్లో 5 లక్షల వరకూ ఉపాధి అవకాశాలున్నాయని, ఈ తరహా శిక్షణ అందించి ఉపాధి కల్పించనున్నామన్నారు. దేశంలోనే ‘ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఏపీ ప్రథమ స్థానంలో నిలించిదని కొనియాడారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ కె.సాంబశివరావు మాట్లాడుతూ అప్రెంటిస్‌షిప్ విధానంపై అపోహలు తొలగించేందుకు ట్రైనింగ్ పార్టనర్లతో ఈ సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ స్కీమ్ ఉద్యోగం కాదని, భవిష్యత్తులో ఉపాధి పొందడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జె.ఎస్.వి ప్రసాద్, యూత్ ఎఫైర్స్ చీఫ్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం, ఏపీఎస్డీసీ డైరక్టర్ కె.లక్ష్మీనారాయణ, సీఐఐ మాజీ చైర్మన్ జి.ఎస్.శివకుమార్, పలు పరిశ్రమల ప్రతినిధులు, ట్రైనింగ్ పార్టనర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. -
నెలలోపే రుణాలు మాఫీ: కొల్లు రవీంద్ర
ధర్మవరం టౌన్ (అనంతపురం): చేనేత కార్మికుల రుణాలను నెలలోపే మాఫీ చేస్తామని చేనేత, జౌళి శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శనివారం అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నేత కార్మికులు ఇళ్లు నిర్మించుకునేందుకు ఒక్కొక్కరికీ రూ.2.9 లక్షలు అందిస్తామని చెప్పారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను వినియోగించనున్నట్టు తెలిపారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సిగ్గు లేకుండా అనంతపురం జిల్లాలో పర్యటించారని విమర్శించారు. రాష్ట్ర విభజన చేసి చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారణమైన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ఆత్మహత్య చేసుకున్న ఐదుగురు చేనేత కార్మికుల కుటుంబాలకు ఈ సందర్భంగా మంత్రి పరిహారం అందజేశారు.