
సాక్షి, కృష్ణా జిల్లా: మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మచిలీపట్నంలో పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. పెడనలో ‘‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి వెళ్లనీయకుండా పేర్ని నానిపై పోలీసులు ఆంక్షలు విధించారు. నిన్న(శనివారం) కూడా గుడివాడలో జరిగే కార్యక్రమంలో పాల్గొనివ్వకుండా పోలీసులు నిర్భంధం విధించారు. కూటమి నేతల ఒత్తిడితో వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు.
పెడన నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమంపై ఆంక్షలు విధించిన పోలీసులు.. పెడన ఇంఛార్జి ఉప్పాల రాముకి నోటీసులిచ్చారు. ఇతర నియోజకవర్గాల నాయకులు, బయటి వ్యక్తులు రాకూడదంటూ ఆంక్షలు పెట్టారు. సమావేశంలో ఎలాంటి ఆవేశపూరిత ప్రసంగాలు ఉండకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.