
ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు: ఓవైపు దేశరాజధానిలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు వస్తున్న వేళ.. ఇటు నగరంలోనూ ఒక్కసారిగా కలకలం రేగింది. బెంగళూరు ఈ ఉదయం ఒకేసారి 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
నగరంలోని రాజరాజేశ్వరీనగర్, కెంగేరి తదితర ప్రాంతాల్లోని పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులను ఇళ్లకు పంపించి వేశారు. నగర పోలీసులు బృందాలుగా విడిపోయి ఆయా విద్యాసంస్థల్లో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్ టీమ్‌లు అక్కడికి చేరుకొని పరిశీలిస్తున్నాయి.
ఇటు.. ఢిల్లీలో 20 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అక్కడ కూడా పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఇటీవల దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపు కాల్స్ , ఈమెయిల్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది, ముఖ్యంగా విమానాశ్రయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు లక్ష్యంగా మారాయి.

40 Bengaluru schools receive bomb threats via emails, bomb squads and police team are at the spot #Bengaluru #Schools #BombThreats pic.twitter.com/3t9NMeZRpQ
— News18 (@CNNnews18) July 18, 2025