
బెంగళూరు: కర్ణాటకలో చేపట్టిన సామాజిక, విద్యా సర్వేను వ్యతిరేకించిన కారణంగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణమూర్తి, ఆయన భార్య సుధామూర్తిపై కర్ణాటక ప్రభుత్వ పెద్దలు విమర్శలు గుప్పిస్తున్నారు. వీరికి(నారాయణమూర్తి దంపతులకు) వెనుకబడిన వర్గాలన్నా, కుల గణన అన్నా చిత్తశుద్ధి లేదని మండిపడుతున్నారు. ఇదే వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం తన నోటికి పని చెప్పారు. వారికి అన్ని తెలుసంటూనే. వారికి మనం ఏం చెబుతామంటూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు.
‘ ఇది కేవలం సామాజిక మరియు విద్యా సర్వే. అంతే కానీ వెనుకబడిన వర్గాల సర్వే కానే కాదు.. ఇది జనాభా గణాంకాల కోసం నిర్వహించే సర్వే మాత్రమే. ఈ విఫయాన్ని చాలాసార్లు చెప్పాం కూడా. ఇప్పటి వరకూ కనీసం 20 సార్లు అయినా ఇది జనాభా లెక్కల సర్వే అని చెప్పాం. అయినా వారు వెనుకబడిన వర్గాల గణాంకాల సర్వే అనుకుని అందులో పాల్గొనమని చెప్పారు. అది వారికే వదిలేద్దాం. ఈ విసయాన్ని వారు అర్థం చేసుకోలేకపోతే మనం చేస్తాం. వారిది ఇన్ఫోసిన్.. వారికంతా తెలుసు’ అంటూ సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.
కాగా, కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ (KSCBC) చేపట్టిన సామాజిక సర్వే, కులగణన అక్టోబర్ 19 వరకు కొనసాగుతుంది. రూ. 420 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ సర్వేలో 60 ప్రశ్నలు ఉన్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి సర్వే నివేదిక అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదీ చదవండి:
మూర్తిగారూ.. ఇదేంటండీ?