గాంధీబజార్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణల నేలమట్టం
బెంగళూరు గాంధీబజార్‌లో ఫుట్‌పాత్ మార్గంలోని అంగళ్లను తొలగిస్తున్న పాలికె అధికారులు
బనశంకరి: బెంగళూరు నగరంలో చిక్కపేటే పరిధిలోని గాంధీబజార్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు చేపట్టారు. కేంద్రనగరపాలికె కమిషనర్ రాజేంద్ర చోళన్ ఆదేశాలతో బుధవారం కార్యాచరణను నిర్వహించారు. అన్ని ఆక్రమణలు నేలమట్టం చేయాలని సూచించారు. గాంధీబజార్‌లో వీధివ్యాపారుల కోసం 120 దుకాణాలకు స్థలాలను గుర్తించి అక్కడే వ్యాపారం చేపట్టాలని సూచించారు. కానీ ఫుట్‌పాత్‌లను ఆక్రమించడంతో ప్రజలకు సమస్యలు వస్తున్నాయని తెలిపారు. దీంతో రెండు జేసీబీ యంత్రాలు, 7 ట్రాక్టర్లు, 3 లారీలు, 40 మంది సిబ్బందితో అంగళ్లను కూల్చివేసి పక్కకు తీసివేశారు. 5 షాపులను కూడా తొలగించారు. ఇక పై వీధి వ్యాపారులకు కేటాయించినచోటే వ్యాపారం చేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్రమణలు తొలగింపు సమయంలో ఇంజనీర్లు ప్రదీప్, డీజీఎం లోహిత్, అసిస్టెంట్ ఇంజనీర్లు, పాలికె మార్షల్స్ పాల్గొన్నారు.
గాంధీబజార్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణల నేలమట్టం
గాంధీబజార్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణల నేలమట్టం
గాంధీబజార్‌లో ఫుట్‌పాత్ ఆక్రమణల నేలమట్టం


