అర్ధరాత్రి మృత్యుఘంటిక
సాక్షి బళ్లారి/ దొడ్డబళ్లాపురం: బాగల్‌కోట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి నలుగురు యువకులు విగతజీవులయ్యారు. చెరకు ట్రాక్టర్‌ను వీరు ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. వివరాలు.. మంగళవారం అర్ధరాత్రి జిల్లాలోని జమఖండి తాలూకా సిద్దాపురం గ్రామానికి చెందిన విశ్వనాథ్ కంబార (17), ప్రవీణ్ (22), గణేష్ (20), ప్రజ్వల్ (18)లు కారులో షికారుకు బయల్దేరారు. కొంతదూరం వెళ్లారో లేదో.. బాగల్‌కోటె – విజయపుర రహదారిలో ఓ చక్కెర ఫ్యాక్టరీ సమీపంలో ముందు వెళ్తున్న చెరకు ట్రాక్టర్‌ను కారు వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురూ తీవ్ర గాయాలతో చనిపోయారు. మద్యం మత్తులో డ్రైవింగే కారణమని అనుమానాలున్నాయి. విషయం తెలియగానే తల్లిదండ్రులు పరుగున వచ్చి బోరున విలపించారు. స్థానికులు, పోలీసులు అతి కష్టమ్మీద కారును బయటకు తీసి మృతదేహాలను వెలికితీశారు. జమఖండి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
చెరకు ట్రాక్టర్‌కు వెనుక నుంచి కారు ఢీ
నలుగురు యువకుల మృతి
బాగల్‌కోట జిల్లాలో ఘోరం
అర్ధరాత్రి మృత్యుఘంటిక


