దివ్యాంగుల సత్తా ఆదర్శం
మైసూరు: దివ్యాంగులు ఇతరుల కంటే జీవితంలో ఎక్కువగా సాధిస్తూ చాలా మంది స్ఫూర్తిగా నిలుస్తున్నారని జిల్లా కలెక్టరు డాక్టర్ పి.శివరాజు అన్నారు. బుధవారం నగరంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. అవయవలోపాల కారణంగా ఏమి సాధించలేరన్నది అవాస్తవమని, అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న వారికంటే కూడా ఎక్కువ విజయాలు సాధించిన ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయని తెలిపారు. దివ్యాంగులు సామర్థ్యాన్ని చాటుకుంటూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది దివ్యాంగులు, విద్యార్థులు పాల్గొన్నారు.


