
కర్ణాటక రాజధాని నగరంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది జరిగింది. ఓ యువతిని వెనక నుంచి వచ్చిన ఓ యువకుడు గొంతుకోసి పరారయ్యాడు. ఈ ఘటనలో.. గిలగిలా కొట్టుకుంటూ ఆ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం మధ్యాహ్నాం శ్రీరాంపుర ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హోస్కెరెహళ్లి ಹೊಸಕೆರೆಹಳ್ಳಿలో యామిని ప్రియ(20) కుటుంబం నివాసం ఉంటోంది. స్థానికంగా బీఫార్మసీ చదువుతున్న ఆమె గురువారం పరీక్ష కోసమని ఉదయం 7.గంకే ఇంటి నుంచి బయల్దేరింది. అయితే.. మధ్యాహ్నాం 3గం. సమయంలో మంత్రిమాల్ వద్ద శ్రీరాంపుర రైల్వే ట్రాక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఆమెపై ఓ యువకుడు దాడి చేశాడు. వెనుక నుంచి వచ్చి గొంతు కోసి పరారయ్యాడు.
రక్తపు మడుగులో యామిని ప్రియ కుప్పకూలిపోగా.. ఊహించని ఆ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. విషయం తెలిసి పెద్దసంఖ్యలో జనం పోగయ్యారు. శ్రీరాంపుర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.
ప్రియా యామిని ఆ నిందితుడి బైక్ మీదే వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో ప్రేమ కోణం ఉందనే చర్చ నడుస్తోంది. పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
A 20 year old college student, Yamini Priya,was murdered by a known individual who slit her throat near the railway tracks in Srirampura,#Bengaluru.The victim was returning from college when she was attacked.Police have launched a manhunt to apprehend the accused..@DCPNorthBCP pic.twitter.com/3zMrcVEx1s
— Yasir Mushtaq (@path2shah) October 16, 2025
ఇదీ చూశారా?.. యువకుడి టైమింగ్‌తో తల్లీబిడ్డా సేఫ్!