ట్రాఫిక్ సిగ్నల్స్ ముందే చూపించే ఫీచర్ | Now See Bangalore Traffic Signal Countdown On Your Phone | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ సిగ్నల్స్ ముందే చూపించే ఫీచర్: మొదటిసారి బెంగళూరులో..

Oct 13 2025 4:59 PM | Updated on Oct 13 2025 5:18 PM

Now See Bangalore Traffic Signal Countdown On Your Phone

బెంగళూరు వంటి నగరాల్లో ట్రాఫిక్ అనేది చాలా పెద్ద సమస్య. ఈ సమస్యకు పూర్తిగా నివారించడం కష్టం, కానీ కొంత వరకు పరిష్కరించవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకునే.. లైవ్ ట్రాఫిక్ సిగ్నల్ కౌంట్‌డౌన్‌ను ట్రాక్ చేయడంలో సహాయపడే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఫీచర్ ప్రస్తుతం బెంగళూరు(Bengaluru)కు మాత్రమే పరిమితమైంది. రాబోయే రోజుల్లో ఇది ఇతర నగరాలకు కూడా విస్తరించనున్నట్లు సమాచారం.

నావిగేషన్ సంస్థ మ్యాప్‌మైఇండియా సహకారమతో.. ఈ కొత్త ఫీచర్స్ రూపొందించారు. మ్యాప్ల్స్ (Mappls) యాప్‌లో లైవ్ ట్రాఫిక్ సిగ్నల్ టైమ్ చూడవచ్చు. మ్యాప్‌మైఇండియా డైరెక్టర్ రోహన్ వర్మ పేర్కొన్నారు. భారతదేశంలో మొదటిసారి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇది మ్యాజికల్, హెల్ప్‌ఫుల్ అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

రైల్వేలు, సమాచార & ప్రసారాలు, ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక శాఖ మంత్రి 'అశ్విని వైష్ణవ్' కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో తాను ఈ ఫీచర్‌ను ఉపయోగిస్తున్న వీడియోను పోస్ట్ చేసి, "స్వదేశీ 'మాప్ల్స్' బై మ్యాప్‌మైఇండియా. మంచి ఫీచర్లు...తప్పక ప్రయత్నించాలి!" అని పేర్కొన్నారు.

కొత్త ఫీచర్ ఉపయోగాలు
మ్యాప్ల్స్ యాప్ ఇప్పుడు బెంగళూరులోని ట్రాఫిక్ సిగ్నెల్ టైమింగ్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కొత్త ఫీచర్ ప్రస్తుతం వెహికల్ యాక్చుయేటెడ్ కంట్రోల్ (VAC) సిగ్నల్‌లను ఉపయోగించే 169 జంక్షన్‌లలో అందుబాటులో ఉంది. Mappls ఇంటిగ్రేషన్‌తో, సిగ్నల్ స్తంభాలపై కనిపించే అదే కౌంట్‌డౌన్ ఇప్పుడు మొబైల్ స్క్రీన్‌లలో చూడవచ్చు.

VAC సిగ్నల్స్ గురించి ప్రధాన ఫిర్యాదులలో ఒకటైన ఊహించలేని వెయిటింగ్ పీరియడ్‌లను పరిష్కరించడమే ఈ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం అని అధికారులు తెలిపారు. జంక్షన్లకు ముందుగా టైమర్‌లను చూపించడం ద్వారా, ప్రయాణికులు ఆలస్యాన్ని ఊహించవచ్చు, అనవసరమైన హారన్ మోగించడం లేదా లేన్ మార్పులను నివారించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement