
బెంగుళూరు: ప్రమాదం ఏ రూపంలో ఎదురవుతుందో చెప్పలేం.. బెంగుళూరులో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపింది. గత నెల సెప్టెంబర్ 13న గణేష్ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాకు హాజరై తిరిగి వస్తుండగా.. ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి.. నగలు దోచుకున్నారు. నిందితులను ప్రవీణ్, యోగనందగా పోలీసులు గుర్తించారు. బైక్‌పై ఆ మహిళల వద్దకు వచ్చి వారి బంగారు గొలుసులను లాక్కోవడానికి ప్రయత్నించారు.
భయపడిన ఉష తన గొలుసును వారికి ఇచ్చేసింది. కానీ మరొక మహిళ వరలక్ష్మి, ప్రతిఘటించింది. దీంతో యోగానంద ఆమెపై కత్తితో క్రూరంగా దాడి చేసి.. రెండు వేళ్లను నరికాడు. ఆ తర్వాత నిందితులు 55 గ్రాముల బంగారు ఆభరణాలతో అక్కడి నుంచి పారిపోయారు. సెప్టెంబర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది.
ఈ ఘటనపై పోలీసులు వారాల తరబడి దర్యాప్తు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితులను అరెస్టు చేసింది. వారు దొంగిలించిన బంగారాన్ని, దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన జరిగిన తర్వాత యోగనంద పుదుచ్చేరి, ముంబై, గోవా వంటి నగరాలకు పారిపోయి.. ఆ తర్వాత కర్ణాటకలోని తన సొంత గ్రామానికి తిరిగి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. అతనికి గతంలో నేర చరిత్ర ఉందని, ఒక హత్య కేసులో కూడా ప్రమేయం ఉందని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు వరలక్ష్మి ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు.
On camera: Two men on a bike wielding machetes rob women in Bengaluru, chop off two fingers and snatch their gold chain. Arrested after a month, police have now recovered 74g of gold and the weapons.https://t.co/ymRnB0fF5t pic.twitter.com/ElKFdlFKH2
— Deepak Bopanna (@dpkBopanna) October 18, 2025