దత్త కుటీరంలో వేడుకలు
మండ్య: దత్త జయంతి వేడుకల సందర్భంగా మండ్య నగరానికి సమీపంలోని నిరంజనదత్త కుటీరంలో గురువారం భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. గత నెల 28వ తేదీన ప్రారంభమైన వేడుకలు సమాప్తమయ్యాయి. వేకువ నుంచి పూజలు, భజనలు నిర్వహించారు. వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.
దత్త జయంతి పూజలు
మైసూరు: మైసూరులోని దేవరాజ అరసు రోడ్డులోని బిసిలు మారెమ్మ దేవస్థానంలో దత్తాత్రేయ బళగ ఆధ్వర్యంలో దత్తాత్రేయ జయంతిని జరిపారు. ఉదయం నుంచే దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు, భజనలు, హోమాలు, ప్రత్యేక హారతి వేడుకలు సాగాయి. స్థానిక ప్రముఖులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
దత్త కుటీరంలో వేడుకలు


