ఇల్లు కట్టుకోబోతే.. ప్రాణమే తీశారు
దొడ్డబళ్లాపురం: బెంగళూరు నగరంలో విషాద సంఘటన జరిగింది. పాలికె అధికారులు, దంపతుల బ్లాక్‌మెయిల్‌ను తట్టుకోలేని టెక్కీ డెత్‌నోట్ రాసి ఉరివేసుకున్న ఘటన వైట్‌ఫీల్డ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బ్రూక్ బాంగ్ లేఔట్ నివాసి మురళి గోవిందరాజు (45) ఆత్మహత్య చేసుకున్నాడు. మురళి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు కారణమైన శశి నంబియార్ (64), ఉషా నంబియార్ (57) దంపతులను అరెస్టు చేశారు. మరో నిందితుడు వరుణ్ నంబియార్ పరారీలో ఉన్నాడు.
వివాదం సృష్టించి.. డబ్బు డిమాండ్
ఐటీపీఎల్‌లోని ప్రైవేటు కంపెనీలో పని చేసే మురళి బుధవారంనాడు నల్లూరహళ్లి వద్ద నిర్మాణ దశలో ఉన్న సొంత భవనంలో ఆత్మహత్య చేసుకున్నాడు. డెత్‌నోట్‌లో వివరాలు రాశాడు. మురళి... నంబియార్ దంపతుల బంధువు వద్ద స్థలాన్ని కొని ఈ భవంతిని నిర్మిస్తున్నాడు. అయితే శశి, ఉష తరచూ వచ్చి ఈ స్థలం మాది అని, రూ.20 లక్షలు ఇస్తే సరి, లేదంటే నీ సంగతి తేలుస్తామని వేధించేవారు. వారు ఫిర్యాదు చేశారని స్థానిక పాలికె అధికారులు కూడా తరచూ మురళికి నోటీసులు ఇచ్చి సతాయించేవారు.
నా కల తీరలేదని డెత్‌నోట్
తనను శశి, ఉష, వరుణ్ ముగ్గురూ చాలా వేధించారని, జీవితంలో ఎన్నడూ పోలీస్‌స్టేషన్, కోర్టు మొహం చూడని తనను స్టేషన్, కోర్టు చుట్టూ తిరిగేలా చేశారని, జీవితాంతం సంపాదించిన సొమ్మంతా పెట్టి ఇల్లు కట్టుకోవాలని కలలు కన్నానని, అయితే తన కలలు నెరవేరకుండానే వెళ్లిపోతున్నానని డెత్‌నోట్‌లో పేర్కొన్నాడు. శశి నంబియార్, ఉష నంబియార్, వరుణ్ ముగ్గురూ ఈ ప్రాంతంలో ఎక్కడ లేఔట్‌లు వేసినా, ఇళ్లు నిర్మిస్తున్నా అక్కడకు వెళ్లి గొడవ చేసి డబ్బులు వసూలు చేసేవారని పోలీసుల విచారణలో తెలిసింది.
దంపతుల బెదిరింపులు, పాలికె నోటీసులు
బాధతో అదే భవనంలో
ఉరివేసుకున్న టెక్కీ
రాజధానిలో ఘోరం
ఇల్లు కట్టుకోబోతే.. ప్రాణమే తీశారు


