రూ.12 వేల కోట్ల భూముల కబ్జా
● బీజేపీ నేత ఆరోపణ
బనశంకరి: బెంగళూరు దక్షిణలోని తావరెకెరె సమీపంలో వందలాదికోట్లు విలువచేసే 500 ఎకరాల ప్రభుత్వభూమి కబ్జాకు గురైందని బీజేపీ నేత ఎన్‌ఆర్.రమేశ్ ఈడీ, లోకాయుక్త, బెంగళూరునగర జిల్లా కలెక్టర్ కు 1,67,751 పేజీల సుదీర్ఘమైన ఆధారాలతో గురువారం ఫిర్యాదు చేశారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. బీబీఎంపీ మాజీ డిప్యూటీ మేయర్ పుట్టరాజు, భార్య మాలా తదితరులతో పాటు కొందరు అధికారులు కుమ్మకై ్క కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. కేఏఎస్ అధికారులు, రెవెన్యూ అధికారులతో పాటు ఓ ఎమ్మెల్యే కుటుంబంపై ఈడీ కి ఫిర్యాదు చేశానన్నారు. కబ్జాదారుల పాలైన ప్రభుత్వ భూమిని సర్కారు చేసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ కుంభకోణంలో 2006 నుంచి ఇప్పటివరకు అన్ని రికార్డులు నకిలీవని, మాగడి నియోజకవర్గం వారి పేర్లతో భూ లావాదేవీలు జరిపారని చెప్పారు. తావరెకెరె హొబళి పరిధిలోని గ్రామాల్లో ఈ కబ్జాలు జరిగాయని, నేటి మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ. 12 వేల కోట్లకు పైగా విలువ చేస్తుందని చెప్పారు. కొందరు నాయకులు, అధికారులు నకిలీ రికార్డులు సృష్టించి కబ్జాలకు పాల్పడడం పెరిగిపోయిందని చెప్పారు.
ఎయిర్‌పోర్టులో
ప్రయాణికులకు చుక్కలు
● ఇండిగో విమానాల రద్దుతో నరకయాతన
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో గందరగోళం కొనసాగింది. గురువారం కూడా ప్రయాణికులు ఇండిగో విమానాల దెబ్బకు రభస చేశారు. రెండు రోజుల్లో ఏకంగా 200 విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ఇండిగో కౌంటర్‌లో సిబ్బందితో గొడవపడి ఆ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 1వ టెర్మినల్‌లో కొందరు ధర్నాకు దిగారు. ఇండిగో సిబ్బంది కారణాలు చెప్పకుండా మౌనం వహించడంతో మండిపడ్డారు. తమకు ఇండిగో సంస్థ వసతి, భోజనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రయాణికులు పట్టుబట్టారు.
అన్నీ కోల్పోయాం
దేశ, విదేశాల నుంచి ఇక్కడికి రావాల్సిన, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన 200పైగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులకు దిక్కుతోచడం లేదు. అత్యవసర పనులన్నీ వృథా అయినట్లు వాపోయారు. తమ జీవితాలను ఇండిగో సంస్థ అంధకారంలో పడేసిందని పలువురు ఆవేదన చెందారు. హోటల్ బుకింగ్‌లు, అధికారిక సమావేశాలు, విదేశీ టూర్లు, పరీక్షలు, వీసా ఇంటర్వూలు, శుభ కార్యాలు ఇలా అనేకం మిస్సయినట్లు తెలిపారు.
రూ.12 వేల కోట్ల భూముల కబ్జా


