రట్టయిన గంజాయి గుట్టలు | - | Sakshi
Sakshi News home page

రట్టయిన గంజాయి గుట్టలు

Dec 5 2025 6:48 AM | Updated on Dec 5 2025 6:48 AM

రట్టయ

రట్టయిన గంజాయి గుట్టలు

బనశంకరి: రాజధానిలో భారీ మొత్తాల్లో డ్రగ్స్‌ దొరుకుతున్నాయి. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న మహిళ, మరొకరిని మహాలక్ష్మీ లేఔట్‌ పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.18 కోట్ల 60 లక్షల విలువచేసే 18.50 కేజీల హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ సీమంత్‌కుమార్‌ సింగ్‌ తెలిపారు. గురువారం డ్రగ్స్‌ను పరిశీలించి కేసు వివరాలను వెల్లడించారు. సారా సిమ్రాన్‌ అనే మహిళ, సైఫుద్దీన్‌ షేక్‌ అనే ఇద్దరు గంజాయి వ్యాపారం చేస్తున్నారు. రాణి అబ్బక్క మైదానం వద్ద కారులో హైడ్రో గంజాయి పెట్టుకుని అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. విదేశాల నుంచి గంజాయిని తెప్పించినట్లు చెప్పారు.

ఆర్‌ఎంసీ యార్డులో 8 కిలోలు గంజా స్వాధీనం

● ఆర్‌ఎంసీ యార్డు పోలీసులు ఓ గంజాయి విక్రేత ను అరెస్ట్‌ చేసి రూ.8.35 లక్షల విలువచేసే 8 కిలోలు 350 గ్రాముల గంజా స్వాధీనం చేసుకున్నారు.

● ఆర్‌టీ.నగర పోలీసులు ఓ వ్యక్తి సుల్తాన్‌పాళ్య పానీపురి మైదానంలో గంజాయిని అమ్ముతుండగా పట్టుకుని 5.4 కేజీల గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు.

● జేసీ నగరలో ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని అమ్ముతున్న విదేశీ పౌరున్ని పట్టుకున్నారు. 21 గ్రాముల ఎండీఎంఏను సీజ్‌ చేశారు.

● మల్లేశ్వరం పోలీసులు రూ.77 వేల విలువ చేసే 772 గ్రాముల గంజాయిని సీజ్‌ చేసి ఒకరిని అరెస్టు చేశారు.

బెంగళూరులో రూ.18 కోట్లకు పైగా విలువైన సరుకు సీజ్‌

జంట సహా పలువురు అరెస్టు

బెంగళూరులో ఎర్రచందనం

రూ.1కోటి 75 లక్షల దుంగలు స్వాధీనం

ముగ్గురు అరెస్టు

బనశంకరి: ఉద్యాననగరిలో ఎర్ర చందనం దొరికింది. రూ.1 కోటి 75 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను, నాలుగు వాహనాలసు స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్‌కమిషనర్‌ సీమంత్‌కుమార్‌సింగ్‌ గురువారం తెలిపారు. బన్నేరుఘట్ట రోడ్డు గొట్టిగెరె చెరువు వద్ద కారులో ఎర్రచందనం దుంగలు దాచిపెట్టారని తెలిసి హుళిమావు పోలీసులు దాడి చేసి, డ్రైవరు అహమ్మద్‌పాషాను అరెస్ట్‌ చేశారు. 95 కిలోలు ఎర్రచందనం దుంగలు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో కడప జిల్లాలో ఓ వ్యక్తి నుంచి తక్కువ ధరతో కొనుగోలుచేసి తమిళనాడు, కర్ణాటకలో విక్రయిస్తున్నట్లు తెలిపాడు. ఇతడు ఇచ్చిన సమాచారంతో తమిళనాడులో 1,143 కిలోల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఉల్లిగడ్డల లోడులో..

ఆర్‌టీ.నగర కేహెచ్‌ఎం బ్లాక్‌లో ఉల్లిగడ్డల బొలెరోలో 754 కేజీల ఎర్ర చందనం మొద్దులను పట్టుకున్నారు. ఏపీకి చెందిన రాజశేఖర్‌, వరప్రసాద్‌ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. వీరు ఏపీ వాసులు కాగా, డబ్బు సంపాదన కోసం మదనపల్లి, సంబేపల్లి ప్రాంతాల నుంచి ఎర్రచందనం తీసుకొచ్చి బెంగళూరులో విక్రయాలని ప్రయత్నిస్తూ దొరికారు.

రట్టయిన గంజాయి గుట్టలు 1
1/2

రట్టయిన గంజాయి గుట్టలు

రట్టయిన గంజాయి గుట్టలు 2
2/2

రట్టయిన గంజాయి గుట్టలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement