స్కూటీ నడిపి.. చిక్కుల్లో పడ్డ డీకే.. అసలేంటీ వివాదం? | Bike Dcm Dk Shivakumar Rode Has Rs 18 5k In Traffic Penalties | Sakshi
Sakshi News home page

స్కూటీ నడిపి.. చిక్కుల్లో పడ్డ డీకే.. అసలేంటీ వివాదం?

Aug 7 2025 8:55 PM | Updated on Aug 7 2025 9:37 PM

Bike Dcm Dk Shivakumar Rode Has Rs 18 5k In Traffic Penalties

బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. అసలేం జరిగిందంటే.. మంగళవారం ఆయన హెబ్బాళ ఫ్లైఓవర్‌ పనులను పరిశీలించారు. ఈ సమయంలో కొత్త వంతెనపై స్కూటీలో వెళ్లారు. అయితే ఆ స్కూటర్‌పై 34 చలానాలు, రూ.18,500 జరిమానా ఉందని తేలింది. ఆ స్కూటీని డీసీఎం ఉపయోగించడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్ష నేతలు సైతం ఆయన ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారంటూ దుమ్మెతిపోశారు.

..దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా.. ఈ వీడియో కొద్దిసేపటికే వివాదాస్పదమైంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ఆ స్కూటిపై ఇప్పటికే 34 చలాన్లు ఉన్నట్లు తేల్చారు. డీసీఎం నడిపిన స్కూటీపై (నంబర్ KA 04 JZ 2087) పలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ స్కూటీపై ట్రాఫిక్ పోలీసులు 34కి పైగా జరిమానాలు విధించగా.. రూ.18,500 వరకూ చెల్లించాల్సి ఉంది.

డీకే శివకుమార్‌ వీడియోపై సోషల్‌ మీడియాలో రచ్చరచ్చ అవుతోంది. ప్రతిపక్షాలు.. డీకేపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ పోస్ట్‌లతో హోరెత్తిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పబ్లిసిటీ కోసం రీల్స్‌పై దృష్టి పెట్టకుండా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలంటూ ప్రతిపక్ష నేతలు హితవు పలుకుతున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement