
= చెల్లింపునకు నగరవాసుల పరుగు
కర్ణాటక: బెంగళూరు నగరంలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు విధించిన జరిమానాలపై 50 శాతం డిస్కౌంట్ ఇచ్చారు. దీంతో దీర్ఘకాలంగా ఉన్న చలానాలను కట్టేందుకు వాహనదారులు త్వరపడుతున్నారు. ఆదివారం ఒక్కరోజున 1.03 లక్షల కేసుల్లో రూ.3.01 కోట్ల జరిమానా చెల్లించడం గమనార్హం. వచ్చే నెల 19 వరకు రాయితీ కొనసాగుతుంది. మొదటి రోజు శనివారం 1.48 లక్షల చలాన్ల ద్వారా రూ.4.18 కోట్లు వసూలైది. వాహనదారుల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు కబ్బన్‌పార్క్ పోలీసులు తెలిపారు.
టెక్కీకి మోసం
ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వాహనదారులపై సైబర్ మోసగాళ్లు కన్నేశారు. ఓ టెక్కీని ఇలాగే బురిడీ వేశారు. మీ చలానాలపై 50 శాతం తగ్గింపు ఉందని ఏపీకే ఫైల్ వాట్సాప్‌కు వచ్చింది. ఏపీకే ఫైల్‌ను ఓపెన్ చేసిన కొంతసేపటికే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.2.65 లక్షలు పోయింది. కొడిగేహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో ఈ మోసం జరిగింది.