
తండ్రీ కూతురి అకృత్యం
కర్ణాటక: డబ్బుతిరిగి ఇవ్వాలన్నందుకు చిత్రహింసలకు గురిచేశారు, ఈ ఘటన బెంగళూరు కోరమంగల ఠాణా పరిధిలో జరిగింది. వివరాలు.. తండ్రికి కిడ్నీలు దెబ్బతిన్నాయి, వైద్యంచేయించాలని సగాయ్‌రాజ్ నుంచి అనందకుమార్, అతని కూతురు ఐశ్వర్య రూ. 3 లక్షలు తీసుకున్నారు. ఇంటిని విక్రయించి డబ్బు ఇస్తానని ఆనంద్‌కుమార్ చెప్పగా, తనకే అమ్మాలని సగాయ్‌రాజ్ కోరాడు. అగ్రిమెంట్ కు ముందు కోటి రూపాయలు ఇవ్వగా మిగిలిన డబ్బు తరువాత ఇస్తానని మాట్లాడుకున్నారు.
డబ్బు తీసుకున్న ఆనందకుమార్ ఇంటిని రాసివ్వలేదు, డబ్బు కూడా వెనక్కి ఇవ్వలేదు. దీంతో డబ్బు ఇవ్వాలని సగాయ్‌రాజ్ ఒత్తిడి చేయసాగాడు. ఈ నేపథ్యంలో సగాయ్‌రాజ్‌ని తండ్రీ కూతురు, మరో వ్యక్తి ఆశీష్‌లు కలిసి కిడ్నాప్ చేశారు, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి చేతులు కాళ్లుకట్టి వేసి మర్మాంగానికి సిగరేట్‌తో కాల్చి, ఇంజెక్షన్ వేసి చిత్రహింసలకు గురిచేశారు. అంతేగాక వీడియో తీసి బెదిరించారు. కారులో రాత్రంతా నగరంలో తిప్పి వేధించారు. ఉదయం సమయంలో సగాయ్‌రాజ్ కాపాడండి అంటూ గట్టిగా కేకలు వేసి స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డానని చెప్పాడు. ఈ మేరకు కోరమంగల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.