
బెంగళూరు: దేశంలో అత్యంత ఖరీదైన మెట్రోగా బెంగళూరు మెట్రో(నమ్మ మెట్రో) పేరుగాంచిది. ఇప్పుడు ఈ మెట్రో మరోమారు వార్తల్లో నిలిచింది. ప్రయాణికులకు అదనపు లగేజీ రుసుమును విధించగానే ప్రయాణికులు భగ్గుమంటున్నారు. కొందరు ఈ విషయంలో మెట్రోను సమర్థిస్తుండగా, మరికొందరు ఇది ప్రయాణికులకు ఇది ఎంతో భారమని వ్యాఖ్యానిస్తున్నారు.
భారీ పరిమాణంలో ఉన్న తన లగేజీకి అదనంగా ఛార్జ్ చేసిన బెంగళూరు మెట్రోపై ఒక ప్రయాణికుడు అసహనం వ్యక్తం చేశాడు. ఆ ప్రయాణికుడు ‘ఎక్స్’లో చేసిన ఒక పోస్టులో ఇటువంటి రుసుము సమర్థనీయమా? అని అడగడం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. అవినాష్ చంచల్ అనే ఈ ప్రయాణికుడు తన ‘ఎక్స్’ పోస్టులో ఇలా రాశాడు. “ఈ బ్యాగ్ కోసం బెంగళూరు మెట్రోలో రూ.30 అదనంగా చెల్లించాల్సి రావడం ఆశ్చర్యంగా ఉంది. బెంగళూరు మెట్రో ఇప్పటికే దేశంలోనే అత్యంత ఖరీదైనది. ఇప్పుడు మరింత భారంగా మారనున్నది’ అని రాశారు.
I am absolutely stunned that I had to pay 30rs in the Bangalore metro for this bag. The Bangalore metro is already the most expensive in the country, and this just adds to the burden.
This is just another example of how the @OfficialBMRCL is excluding people from accessing metro. pic.twitter.com/syJX8elbhh— Avinash Chanchal (@avinashchanchl) August 16, 2025
ఈ పోస్ట్ పలువురిని ప్రశ్నింపజేసింది. కొందరు చంచల్‌కు మద్దతు పలుకగా, మరికొందరు పెద్ద బ్యాగులు మరింత స్థలాన్ని ఆక్రమిస్తాయని కనుక, వాటిపై ఛార్జ్ వేయాలని వాదించారు. మరొక యూజర్.. బ్యాగ్ స్కానర్‌లో సరిపోయే దానికంటే పెద్దదిగా ఉంటేనే అదనపు రుసుము చెల్లించాలని సూచించారు. తాను సూట్‌కేస్, బ్యాక్‌ప్యాక్‌ను అనేకసార్లు ఛార్జ్ చేయకుండానే తీసుకెళ్లానని, అవి పరిమిత బరువుతోనే ఉన్నాయన్నారు. లగేజీకి ప్రత్యేక నిల్వ స్థలం ఉంటే రుసుము విధించినా అర్ధవంతంగా ఉంటుందని మరికొందరు అంటున్నారు.