breaking news
Luggage
-
రైలులో లగేజీ మరింత 'భారం'
సాక్షి, విశాఖపట్నం: రైలు ప్రయాణం..అన్నీ సర్దేసుకుని పట్టేసుకుందాం. సీటు కింద బ్యాగులు ఇష్టం వచ్చినట్లు పెట్టేసుకుందాం అంటే కుదరదిక. మీ లగేజీ.. మీకు మరింత భారమవ్వనుంది. ఇకపై రైలులో ప్రయాణికుల లగేజీకి విమాన ప్రయాణంలో మాదిరిగా బాదుడు షురూ చెయ్యనున్నారు. ఎప్పటి నుంచే ఈ నిబంధనలున్నా.. ఇకపై తూ.చా. తప్పకుండా అమలు చెయ్యాలని నిర్ణయించారు. నిర్దేశించిన బరువు కంటే ఎక్కువ లగేజీ ఉంటే ఒకటిన్నర రెట్లు ఫైన్ పడనుంది. సీటు కంటే బ్యాగ్ సైజ్ పెద్దదైనా బాదుడు తప్పదని రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్యతరగతి ప్రయాణికులపైనే అధిక భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లో 70 కిలోల వరకూ అనుమతి ఉండగా సెకెండ్ క్లాస్ ప్రయాణికులకు కేవలం 40 కిలోల పరిమితికి మాత్రమే అనుమతించనున్నారు. విమానం ఎక్కేందుకు వెళ్లే ప్రయాణికుల లగేజీ బరువు కొలిచే పద్ధతి అమల్లో ఉంది. ఇప్పుడు రైలు ప్రయాణికులకూ అదే విధానం అమల్లోకి రాబోతోంది. ఇకపై లగేజీ కొలిచే విధానం రైల్వే స్టేషన్లలో కూడా ప్రారంభం కానుంది. కొత్త నిబంధనల ప్రకారం, ప్యాసింజర్లు తమ లగేజీని రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ఎల్రక్టానిక్ వెయింగ్ మెషిన్లలో తనిఖీ చేయించుకోవాలి. రైల్వే శాఖ ప్రతి కోచ్‌కు నిర్దిష్ట లగేజీ బరువు పరిమితులను నిర్ణయించింది. నిర్దేశించిన బరువు మించితే అదనపు చార్జీలు, జరిమానాలు చెల్లించాల్సిందేనంటూ ఇండియన్ రైల్వేస్ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. భారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు రైల్వే బోర్డు చెబుతున్నా.. ఈ నూతన నిబంధనలు.. ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టబోతున్నాయి. మధ్యతరగతిపైనే అధిక భారం ఈ నిబంధనలు గతంలో ఉన్నవే అయినా.. ఇకపై కచ్చితంగా అమలు చెయ్యాలని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రతి ప్రయాణికుడి లగేజీ బరువు రైల్వే కోచ్ ప్రకారం నిర్ణయించారు. ఇందులో మధ్యతరగతి ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే సెకెండ్‌క్లాస్, థర్డ్ ఏసీ పైనే భారం ఎక్కువగా ఉండనుంది. ప్రయాణికుల తరగతిని బట్టి ఉచిత లగేజీ పరిమితిని నిర్ణయించారు. దీని ప్రకారం, ఫస్ట్ ఏసీ ప్రయాణికులు 70 కిలోల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. సెకండ్ ఏసీ ప్రయాణికులు 50 కిలోలు, థర్డ్ ఏసీ ప్రయాణికులు 40 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు కూడా కేవలం 40 కిలోలు మాత్రమే పరిమితి విధించవచ్చు. జనరల్, సెకండ్ సిట్టింగ్ ప్రయాణికులకు కేవలం 35 కిలోల వరకు ఉచిత పరిమితి విధించారు. రైల్వే నిబంధనల ప్రకారం.. నిర్దేశించిన పరిమితి కంటే 10 నుంచి 15 కిలోల వరకు ఎక్కువ లగేజీని తీసుకెళ్లడంలో సడలింపు ఉంటుంది. కానీ బరువు అంతకంటే ఎక్కువగా ఉంటే, ప్రయాణికులు స్టేషన్‌కు వెళ్లి లగేజీని బుక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రయాణికుల్లో 5 నుంచి 12 ఏళ్ల వయసున్న వారు ఉన్నట్లైతే అనుమతించిన దానిలో సగం లగేజీని తీసుకెళ్లేందుకు అవకాశం ఉంది.బ్యాగ్ సైజ్ పెరిగినా వాత పడుద్ది నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువ తీసుకెళ్లినందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక ప్రయాణికుడు బుకింగ్ పరిమితి కంటే ఎక్కువ లగేజీని తీసుకెళ్తున్నట్లు తేలితే.. సాధారణం కంటే 1.5 రెట్లు అధికంగా జరిమానా విధిస్తారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం ప్రయాణ సమయంలో ప్రతి ప్రయాణికుడి లగేజీ బరువు మాత్రమే కాకుండా బ్యాగ్ పరిమాణంపైనా భారం పడనుంది. ప్రయాణికుల బ్యాగ్ చాలా పెద్దదిగా ఉండి, కోచ్‌లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తే, దానిపైనా జరిమానా విధించే అవకాశం ఉందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అంటే బరువు తక్కువగా ఉన్నప్పటికీ, పెద్ద సైజు బ్యాగ్ పట్టుకెళ్లినా భారం తప్పదన్న విషయం ప్రయాణికులు గుర్తుపెట్టుకోవాలి. అంటే బుకింగ్ లేకుండా పరిమితి కంటే ఎక్కువ బరువు తీసుకెళ్లడం ఇక జేబుకు చిల్లు పడటమేనని ప్రయాణికులు వాపోతున్నారు. కొందరు ప్రయాణికులు పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తుండటం వల్ల తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇకపై ఈ సమస్య లేకుండా ఉండేందుకే నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. వృద్ధుల చేతి కర్రలు, హ్యాండ్ బ్యాగులు, టిఫిన్ బాక్సులపై ఈ లగేజీ పరిమితి వర్తించదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు తొలుత ప్రయాగ్‌రాజ్ డివిజన్¯లోని ప్రధాన స్టేషన్లైన ప్రయాగ్‌రాజ్ జంక్షన్, కాన్పూర్ సెంట్రల్, అలీగఢ్ జంక్షన్ మొదలైన జంక్షన్లలో అమలుకు రంగం సిద్ధం చేశారు. త్వరలోనే మిగిలిన స్టేషన్లలో అమలు చేయనున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. -
లగేజ్‌తో రైలు ఎక్కుతున్నారా? ఇక కొత్త రూల్స్
ఇండియన్ రైల్వే ప్రయాణికుల లగేజీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రైళ్లలో సామానుపై ఉన్న నిబంధనలు సడలింపుగా ఉండటంతో, ప్రయాణికులు అధిక బరువు, పెద్ద పరిమాణం ఉన్న బ్యాగులతో ప్రయాణిస్తున్నారు. ఇది రైలు బోర్డింగ్ సమయంలో రద్దీ పెరగడానికి, ప్రయాణికుల అసౌకర్యానికి, భద్రతా సమస్యలకు దారితీస్తోంది.ఈ నేపథ్యంలో, విమానాశ్రయాల్లో అమలవుతున్న తరహాలోనే, రైల్వే కొన్ని ప్రధాన స్టేషన్లలో సామానుపై పరిమితులు ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రయాగ్‌రాజ్, మిర్జాపూర్, కాన్పూర్, అలీగఢ్ జంక్షన్ స్టేషన్లలో తొలుత ఈ నిబంధలను అమలు చేయనున్నారు. ఆయా స్టేషన్లలో ప్రయాణికులు తమ సామానును ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్ల ద్వారా తూకం చేయించాల్సి ఉంటుంది. ఉచిత పరిమితికి మించి బరువు ఉంటే, అదనపు చార్జీలు విధిస్తారు. పరిమాణం ఎక్కువగా ఉండి బరువు తక్కువగా ఉన్న బ్యాగులపై కూడా ప్రత్యేక ఫార్ములా ద్వారా చార్జీలు లెక్కించనున్నారు. ఉచిత సామాను పరిమితి ప్రయాణ తరగతిని బట్టి మారుతుంది. ఉచిత పరిమితికి మించి బరువు ఉంటే ‘ఎల్’ స్కేల్‌పై 1.5 రెట్లు చార్జీలు విధిస్తారు. కనీస చార్జీ రూ.30, కనీస బరువు 10 కిలోలు, కనీస దూరం 50 కిలోమీటర్లు. 5–12 ఏళ్ల పిల్లలకు ఉచిత లగేజీ పరిమితిలో సగం, గరిష్టంగా 50 కేజీల వరకూ అనుమతి ఉంటుంది. పెద్ద పరిమాణం ఉన్న బ్యాగులు, బోర్డింగ్ స్పేస్‌ను ఆక్రమించేలా ఉంటే జరిమానా విధిస్తారు. స్కూటర్లు, సైకిళ్లు వంటి వస్తువులకు ఉచిత పరిమితి వర్తించదు.ప్రయాణ తరగతుల వారీగా ఉచిత సామాను పరిమితిప్రయాణ తరగతిగరిష్ట పరిమితిఉచిత పరిమితిఅదనపు ఛార్జీతో అనుమతించేదిఏసీ ఫస్ట్ క్లాస్150 కిలోలు70 కిలోలు15 కిలోలుఏసీ 2-టయర్ / ఫస్ట్ క్లాస్100 కిలోలు50 కిలోలు10 కిలోలుఏసీ 3-టయర్ / చైర్ కార్40 కిలోలు40 కిలోలు10 కిలోలుస్లీపర్ క్లాస్ (ఎక్స్/ఆర్డినరీ)80 కిలోలు40 కిలోలు10 కిలోలుసెకండ్ క్లాస్ (ఎక్స్/ఆర్డినరీ)70 కిలోలు35 కిలోలు10 కిలోలురైళ్లలో లగేజీ పరిమితికి సంబంధించి నిబంధనలు ఇదివరకే ఉన్నాయని, అయితే వాటి అమలు విషయంలో రైల్వే కఠినంగా వ్యవహరించేది కాదని అధికారులు చెబుతున్నారు. “లగేజీ నిబంధనలు ఇప్పటికే ఉన్నాయి. వాటి అమలును పర్యవేక్షించేందుకు అధికారులకు సూచనలు ఇచ్చాం” అని రైల్వే అధికారులు తెలిపారు. రద్దీ తగ్గించటం, బోర్డింగ్ సౌలభ్యం పెంచటం, రైళ్లలో భద్రత మెరుగుపరచటం ఈ చర్యల లక్ష్యంగా పేర్కొన్నారు.ఇదీ చదవండి: రైలు టికెట్లు రయ్‌మని బుక్ అయ్యేలా.. కొత్త అప్‌గ్రేడ్ వస్తోంది -
రైలు ప్రయాణికులకు కీలక అప్డేట్
ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇక నుంచి ఎంతబడితే అంత బ్యాగేజీ తీసుకెళ్లడానికి కుదరదని తేల్చి చెప్పింది. ఎందుకంటే పరిమిత స్థాయిలోనే బ్యాగేజీని అనుమతించాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. విమానాశ్రయాలలో మాదిరిగానే, ఇప్పుడు ప్రధాన రైల్వే స్టేషన్లలో లగేజీని తూకం వేయనున్నట్టు ప్రకటించింది. నిర్దేశించిన పరిమితికి మించి ఎక్కువ లగేజీ ఉంటే అదనంగా చార్జీలు వసూలు చేస్తామని తెలిపింది. కాబట్టి ప్రయాణికులు రైలు ఎక్కేముందే తమ బ్యాగేజీ ఎంతుందో ఒకటికి రెండుసార్లు చూసుకోవాల్సి ఉంటుంది.ప్రతిరోజూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. రిజర్వేషన్ టికెట్‌తో దూర ప్రయాణాలు చేసే వారు అధికంగా బ్యాగేజీ తీసుకెళుతుంటారు. జనరల్ బోగీల్లో ప్రయాణించే వలస కూలీలు కూడా ఎక్కువ సామాన్లతో రైలు ఎక్కుతుంటారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని మెరుగుపరచడానికి బ్యాగేజీని పరిమితం చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఎయిర్‌పోర్టుల్లో మాదిరిగా రైల్వేస్టేషన్లలోనూ ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్లతో లగేజీ (Luggage) తూకం వేసేందుకు ఏర్పాట్లు చేసింది.బరువుతో పాటు సైజు కూడా..బ్యాగేజీ బరువు మాత్రమే కాకుండా పరిమాణాన్ని కూడా తనిఖీ చేస్తామని రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు. బ్యాగేజీ చాలా పెద్దదిగా ఉండి, కోచ్ లోపల అదనపు స్థలాన్ని ఆక్రమించేట్టు ఉంటే.. ప్రయాణికుడు జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంటే బ్యాగేజీ బరువు పరిమితికి లోబడి ఉన్నప్పటికీ సైజు పెద్దగా ఉంటే మాత్రం ఫైన్ (Fine) తప్పదు. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రయాగ్‌రాజ్ నార్త్ సెంట్రల్ రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ హిమాన్షు శుక్లా మీడియాతో చెప్పారు.ఫస్ట్ అక్కడ నుంచే..ప్రయాగ్‌రాజ్ డివిజన్లోని కీలక స్టేషన్ల నుంచి ఈ విధానాన్ని ప్రారంభించాలని నార్త్ సెంట్రల్ రైల్వే (North Central Railway) నిర్ణయించింది. వీటిలో ప్రయాగ్‌రాజ్ జంక్షన్, ప్రయాగ్‌రాజ్ ఛోకి, సుబేదార్‌గంజ్, కాన్పూర్ సెంట్రల్, మీర్జాపూర్, తుండ్లా, అలీఘర్ జంక్షన్, గోవింద్‌పురి, ఎటావా స్టేషన్లు ఉన్నాయి. త్వరలో ఎలక్ట్రానిక్ వేయింగ్ యంత్రాలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ప్లాట్ఫామ్లోకి ప్రవేశించే ముందు ప్రయాణికులు తమ బ్యాగుల బరువు చూసుకోవాలి. బ్యాగేజీ బరువు తక్కువగా ఉన్నా పరిమాణం(సైజు) పెద్దగా ఉంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.గరిష్టంగా 70 కిలోలు..రిజర్వేషన్ టికెట్ల ఆధారంగా బ్యాగేజీ పరిమితిని రైల్వే శాఖ ఖరారు చేసింది. దీని ప్రకారం ప్రయాణికులు గరిష్టంగా 70 కిలోల సామానుతో మాత్రమే రైలులో ప్రయాణించగలరు. కనిష్టంగా 35 కిలోల వరకు అనుమతిస్తారు. ఫస్ట్ ఏసీ ప్రయాణికులు 70 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లొచ్చు. సెకండ్ ఏసీ 50 కిలోలు, థర్డ్ ఏసీ- స్లీపర్ క్లాస్ 40 కిలోలు.. జనరల్/సెకండ్ సిట్టింగ్ ప్యాసింజర్లకు 35 కిలోలు వరకు బ్యాగేజీ అనుమతిస్తారు. పరిమితి కంటే 10 కిలోల వరకు ఎక్కువ తీసుకెళ్లడానికి అనుమతిస్తారు. దీనికి మించి లగేజీ ఉన్నట్లు తేలితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా సాధారణ లగేజీ రేటు కంటే 1.5 రెట్లు ఎక్కువ.అధికారులు ఏమంటున్నారు?రైళ్లల్లో ప్రయాణించేవారిలో చాలా మంది అధిక సామాను తీసుకెళుతుంటారు. దీనివల్ల తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలగడంతో పాటు భద్రతకు విఘాతం కలుగుతుంది. ప్రయాణికులకు పటిష్ట భద్రత, మెరుగైన సౌకర్యం కల్పించేందుకు లగేజీని నియంత్రించాలని నిర్ణయించినట్టు రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పండుగలు, వేసవి సెలవుల్లో రద్దీని మెరుగ్గా నియంత్రించడానికి ఈ చర్య దోహదపడుతుందని రైల్వేశాఖ భావిస్తోంది. ఇక నుంచి ట్రైన్ జర్నీ (Train Journey) చేసేవారందరూ బ్యాగేజీ బరువును చెక్ చేసుకోవాల్సిందే.చదవండి: రైలు టికెట్లు ఈజీగా బుక్ అయ్యేలా.. కొత్త అప్‌గ్రేడ్ వచ్చేస్తోంది -
దేశంలో అత్యంత ఖరీదైన మెట్రో.. ప్రయాణికులపై మరో వాత
బెంగళూరు: దేశంలో అత్యంత ఖరీదైన మెట్రోగా బెంగళూరు మెట్రో(నమ్మ మెట్రో) పేరుగాంచిది. ఇప్పుడు ఈ మెట్రో మరోమారు వార్తల్లో నిలిచింది. ప్రయాణికులకు అదనపు లగేజీ రుసుమును విధించగానే ప్రయాణికులు భగ్గుమంటున్నారు. కొందరు ఈ విషయంలో మెట్రోను సమర్థిస్తుండగా, మరికొందరు ఇది ప్రయాణికులకు ఇది ఎంతో భారమని వ్యాఖ్యానిస్తున్నారు.భారీ పరిమాణంలో ఉన్న తన లగేజీకి అదనంగా ఛార్జ్ చేసిన బెంగళూరు మెట్రోపై ఒక ప్రయాణికుడు అసహనం వ్యక్తం చేశాడు. ఆ ప్రయాణికుడు ‘ఎక్స్’లో చేసిన ఒక పోస్టులో ఇటువంటి రుసుము సమర్థనీయమా? అని అడగడం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. అవినాష్ చంచల్ అనే ఈ ప్రయాణికుడు తన ‘ఎక్స్’ పోస్టులో ఇలా రాశాడు. “ఈ బ్యాగ్ కోసం బెంగళూరు మెట్రోలో రూ.30 అదనంగా చెల్లించాల్సి రావడం ఆశ్చర్యంగా ఉంది. బెంగళూరు మెట్రో ఇప్పటికే దేశంలోనే అత్యంత ఖరీదైనది. ఇప్పుడు మరింత భారంగా మారనున్నది’ అని రాశారు. I am absolutely stunned that I had to pay 30rs in the Bangalore metro for this bag. The Bangalore metro is already the most expensive in the country, and this just adds to the burden.This is just another example of how the @OfficialBMRCL is excluding people from accessing metro. pic.twitter.com/syJX8elbhh— Avinash Chanchal (@avinashchanchl) August 16, 2025ఈ పోస్ట్ పలువురిని ప్రశ్నింపజేసింది. కొందరు చంచల్‌కు మద్దతు పలుకగా, మరికొందరు పెద్ద బ్యాగులు మరింత స్థలాన్ని ఆక్రమిస్తాయని కనుక, వాటిపై ఛార్జ్ వేయాలని వాదించారు. మరొక యూజర్.. బ్యాగ్ స్కానర్‌లో సరిపోయే దానికంటే పెద్దదిగా ఉంటేనే అదనపు రుసుము చెల్లించాలని సూచించారు. తాను సూట్‌కేస్, బ్యాక్‌ప్యాక్‌ను అనేకసార్లు ఛార్జ్ చేయకుండానే తీసుకెళ్లానని, అవి పరిమిత బరువుతోనే ఉన్నాయన్నారు. లగేజీకి ప్రత్యేక నిల్వ స్థలం ఉంటే రుసుము విధించినా అర్ధవంతంగా ఉంటుందని మరికొందరు అంటున్నారు. -
దవడ పగిలింది.. వెన్నెముక విరిగింది..!
న్యూఢిల్లీ: పరిమితికి మించిన లగేజీతో వచ్చినందుకు అదనంగా ఫీజు చెల్లించాలని కోరిన స్పైస్‌జెట్ సిబ్బందిపై ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు చెలరేగిపోయారు. నలుగురు ఉద్యోగులను చితకబాదడంతో వెన్నెముక విరగడం, దవడ పగలడం వంటి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో జూలై 26వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. లెఫ్టినెంట్ కల్నల్ రితేశ్ కుమార్ సింగ్ గుల్మార్గ్లోని హై అల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ పనిచేస్తున్నారు. ఆయన జూలై 26వ తేదీన ఢిల్లీ వెళ్లే స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణించాల్సి ఉంది. క్యాబిన్లోకి ప్రయా ణికులు కేవలం 7 కిలోల బరువైన లగేజీని మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. కల్నల్ సింగ్ మాత్రం 16 కిలోల బరువున్న రెండు బ్యాగులతో వచ్చారు. అదనపు బరువుకు నిబంధనల ప్రకారం అదనంగా చార్జీ ఉంటుందని సిబ్బంది చెప్పగా చెల్లించేందుకు నిరాకరించిన సింగ్ ఆగ్రహంతో దుర్భాషలాడుతూ ఊగిపోయారు. వారిని నెట్టేసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై సైన్ బోర్డు స్టీల్ స్టాండుతో దాడికి దిగారు. SHOCKING “MURDEROUS” Assault on SpiceJet Staffers at Srinagar Airport Passenger attacks 4 SpiceJet Staffers with whatever he cud get hold off— 2 grievously injured. Jaw & Spine injured. July 26th incident, FIR Filed Pax - allegedly an army officer - put on NO FLY List 1/2 pic.twitter.com/g79eiuSy3P— Amit Bhardwaj (@tweets_amit) August 3, 2025ఒక ఉద్యోగి స్పృహ తప్పి పడిపోగా, ఆయన్ను కాలితో తన్నారు. ముఖంపై పంచ్ ఇవ్వడంతో మరో ఉద్యోగి దవడ ఎముక విరిగింది. ముక్కు నుంచి రక్తం వచ్చింది. మరో ఉద్యోగి వెన్నెముక చిట్లింది. సీఐఎస్ఎఫ్ అధికారి కలుగ జేసుకుని ఆయన్ను తిరిగి గేట్ వద్దకు తీసుకెళ్లారు. బాధిత నలుగురు ఉద్యోగులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, దర్యాప్తు చేపట్టామని ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. క్రమశిక్షణకు పెద్దపీట వేస్తామని పేర్కొంది. దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిబంధనల ప్రకారం..ఆ అధికారి పేరును నో ఫ్లై జాబితాలో చేరుస్తామని స్పైస్ జెట్ తెలిపింది. ఆ ప్రయాణికుడిపై తగు చర్యలు తీసుకోవాలని పౌరవిమానయాన శాఖకు లేఖ రాసింది. -
‘అతిథే కాదు లగేజీ దేవోభవ’.. 30 ఏళ్లలో ఒక్క బ్యాగూ మిస్సవని విమానాశ్రయం
టోక్యో: ప్రపంచంలోని ఏ విమానాశ్రయానికీ దక్కని ఘనతను జపాన్‌లోని ఆ విమానాశ్రయం సొంతం చేసుకుంది. అదే కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (కిక్స్). గడచిన 30 ఏళ్లలో ఈ విమానాశ్రయంలో ఒక్క లగేజీ కూడా మిస్ కాలేదంటే ఒక పట్టాన నమ్మలేం.. కానీ ఇది ముమ్మాటీకీ నిజం. 2024లో ఈ విమానాశ్రయం ప్రపంచంలోని ఉత్తమ లగేజీ డెలివరీ విమానాశ్రయంగా గుర్తింపు పొందుతూ మరోమారు ‘స్కైట్రాక్స్’ అవార్డును దక్కించుకుంది.ఒసాకాలోని ఈ కన్సాయ్ విమానాశ్రయం 1994లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటివరకు ఇది ఏటా మూడు కోట్ల ప్రయాణికులకు సేవలు అందిస్తూ వస్తోంది. ఇప్పటి వరకూ ఈ విమానాశ్రయం ఎనిమిది సార్లు ‘స్కైట్రాక్స్’ అవార్డును గెలుచుకుంది. లగేజీ పికప్‌కు ముందు వేచి ఉండే సమయం, లగేజీ డెలివరీ సామర్థ్యం, పోగొట్టుకున్న లగేజీల ఆధారంగా వివిధ గణాంకాలు సేకరించి, ఈ అవార్డును అందజేస్తారు. ఈ విమానాశ్రయం 2023 ఆర్థిక సంవత్సరంలో సుమారు కోటి లగేజీలను అందజేసింది.కిక్ విమానాశ్రయం ట్రాక్ రికార్డ్ ఇంత విజయవంతం కావడానికి కారణం ఇక్కడి ‘మల్టీలేయర్డ్ చెకింగ్ వర్క్’. ప్రతి బ్యాగేజీని పరిరక్షించేందుకు విమానాశ్రయ విభాగం ముగ్గురు సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించింది. తప్పులను, పొరపాట్లను నివారించేందుకు బహుళ సిబ్బంది సమాచారాన్ని పంచుకోవడం చాలా ముఖ్యమని లగేజీ కార్యకలాపాలను పర్యవేక్షించే సుయోషి హబుటా నిక్కీ తెలిపారు. విమానం వచ్చిన 15 నిమిషాలలోపు ప్రయాణికుల లగేజీలను వారికి అందించడం వారి లక్ష్యంగా ఈ విమాశ్రయ సిబ్బంది పనిచేస్తుంటారు. జపాన్ ప్రజలు అనుసరించే ఆతిథ్య కళ ‘ఓమోటేనాషి’ని ఇక్కడి సిబ్బంది ఆకళింపు చేసుకున్నారు. ప్రయాణికుల లగేజీని వారికి అందించడమనేది ఒక హామీ అని వారు నమ్ముతారు. ఇక్కడి ప్రతి సూట్‌కేస్‌ను ఇటు డిజిటల్ పద్దతిలో, అటు భౌతికంగానూ డ్యూయల్ ట్యాగింగ్ సిస్టమ్‌తో ట్రాక్ చేస్తారు. ఫలితంగా ఏ బ్యాగు కూడా మిస్సయ్యే అవకాశం ఉండదు. ఇక్కడి సిబ్బందికి లాజిస్టిక్స్‌లో మాత్రమే కాకుండా మానవ తప్పిదాలను ఊహించడంలోనూ శిక్షణ అందిస్తారు. బ్యాగేజీ విషయంలో అవకతవకలు జరిగితే, బ్యాగ్ విమానం నుండి బయటకు వెళ్లే ముందే హెచ్చరిక వ్యవస్థ అప్రమవుతుంది. పర్యాటకులు ఈ విమానాశ్రయాన్ని ‘ప్రయాణికులతో పాటు వారి లగేజీని కూడా గౌరవించే విమానాశ్రయం’ అని ప్రశంసిస్తుంటారు. -
రైల్లో ఎంత లగేజీ తీసుకెళ్లొచ్చు?
భారతీయ రైల్వే వివిధ తరగతుల్లోని ప్రయాణీకులకు లగేజీ నిబంధనలను సవరించింది. ఇవి ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రయాణీకులను నియంత్రించడం, భద్రతను మెరుగుపరచడం, రైలులో స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించేలా చూడటం దీని లక్ష్యమని అధికారులు తెలిపారు. మారిన నిబంధనల ప్రకారం ప్రయాణికులు ఎంత లగేజీని తీసుకెళ్లాలి..ఎలాంటి వస్తువులను తీసుకెళ్లాలో కింద తెలుసుకుందాం.ఎంత లగేజీని తీసుకెళ్లాలి?కొత్త మార్గదర్శకాల ప్రకారం ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే ప్రయాణికులు అదనపు ఛార్జీలు లేకుండా 70 కిలోల లగేజీని తీసుకెళ్లడానికి అనుమతి ఉంది.సెకండ్ క్లాస్ ఏసీలో ప్రయాణించే వారు 50 కిలోల వరకు తీసుకెళ్లవచ్చు.స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు ఉచిత అలవెన్స్‌లో భాగంగా 40 కిలోలను అనుమతిస్తారు.సెకండ్ క్లాస్ నాన్ ఏసీకి ఉచిత లగేజీ పరిమితిని 35 కిలోలుగా నిర్ణయించారు.ప్రయాణికులు రైల్వే అనుమతించిన బరువు కంటే అధికంగా లగేజీ తీసుకెళ్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందే. లగేజీ బరువుగా లేదా భారీగా ఉంటే దానిని కంపార్ట్మెంట్లోకి అనుమతించరు. బదులుగా ప్రత్యేక లగేజీ వ్యాన్‌లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ పరిమాణానికి సంబంధించి కూడా రైల్వే స్పష్టమైన వివరాలు వెల్లడించింది.లగేజీ కొలతలు ఇలా..లగేజీకి గరిష్టంగా అనుమతించిన కొలత (పొడవు + వెడల్పు +ఎత్తు) 160 సెం.మీ (62 అంగుళాలు) మించకూడదు. కెమెరాలు, గొడుగులు లేదా బ్రీఫ్‌కేస్ వంటి వ్యక్తిగత వస్తువులకు 185 సెం.మీ (72 అంగుళాలు) వరకు పరిమితి విధించారు. అలా ఉంటేనే లగేజీని సీట్ల కింద లేదా ఓవర్ హెడ్ ర్యాక్‌ల్లో సరిగ్గా స్టోర్ చేయవచ్చని రైల్వే తెలిపింది. రైలు దిగిన తర్వాత కూడా నిర్దిష్ట పరిమాణంలో లగేజీ ఉంటే నడక మార్గాల్లో ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: యాపిల్‌కు టారిఫ్‌ల దెబ్బ.. ధరల పెంపునకు అవకాశంనిషేధిత వస్తువులురైలు బోగీల్లో తీసుకెళ్లలేని నిషేధిత వస్తువులపై కూడా ప్రయాణికులు అవగాహన కలిగి ఉండాలి. పేలుడు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, తుపాకులు, లీకైన ద్రవాలు, ప్రమాదకరమైన లేదా అభ్యంతరకరమైన వస్తువులను తీసుకెళ్లడం నిషేధించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా లేదా రైలు నుంచి వెంటనే తొలగించవచ్చు. లగేజీ ప్యాకింగ్ చేయడానికి ముందు ప్రయాణికులందరూ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని లేదా స్టేషన్ అధికారులను సంప్రదించాలని భారతీయ రైల్వే సూచించింది. -
కొత్త హ్యాండ్‌బ్యాగేజ్ రూల్స్: విమానాల్లో..
విమానంలో ప్రయాణించే.. ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ తరుణంలో వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి, భద్రతను మెరుగుపరచడానికి 'బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ' (BCAS), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కొత్త హ్యాండ్‌బ్యాగేజ్ రూల్స్ పెట్టాయి.బీసీఏఎస్ రూల్స్ ప్రకారం.. ప్రయాణికులు ఇప్పుడు కేవలం ఒక హ్యాండ్‌బ్యాగ్ (Handbag) మాత్రమే తీసుకెళ్లడానికి అర్హులు. ఈ విధానం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లోనూ అమలు కానుంది. ఎయిర్‌పోర్టులలో పెరిగిపోతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని విమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.కొత్త నిబంధనల ప్రకారం.. ప్రయాణికుల వెంట ఇకపై ఒక హ్యాండ్‌బ్యాగ్ మాత్రమే ఉండాలి. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ తరగతుల్లో ప్రయాణించే వారు గరిష్టంగా 7 కేజీల బరువున్న హ్యాండ్‌బ్యాగ్.. ఫస్ట్ క్లాస్ లేదా బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే వారి హ్యాండ్‌బ్యాగ్ బరువు 10 కేజీల వరకు ఉండొచ్చు. అంతే కంటే ఎక్కువ లగేజ్ ఉంటే.. చెక్ ఇన్ కావాల్సిందే.హ్యాండ్‌బ్యాగ్ కొలతలుబ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కేవలం హ్యాండ్‌బ్యాగ్ బరువును మాత్రమే కాకుండా.. కొలతలను కూడా నిర్ణయించింది. కాబట్టి బ్యాగ్ పొడవు 40 సెంమీ, వెడల్పు 20 సెంమీ, ఎత్తు 55 సెంమీ మించకూడదు.కొత్త హ్యాండ్‌బ్యాగేజ్ రూల్స్ 2024 మే2 నుంచి అమలులోకి వస్తాయి. కాబట్టి అంతకంటే ముందే టికెట్ బుక్ చేసుకున్న వారికి పాత నిబంధనలే వర్తిస్తాయి.కొత్త నిబంధనలకు అనుగుణంగా, ఇండిగో & ఎయిర్ ఇండియా వంటి విమానయాన సంస్థలు కూడా తమ బ్యాగేజీ విధానాన్ని సవరించాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లోని ప్రయాణికులు ఒక క్యాబిన్ బ్యాగ్‌ని తీసుకురావచ్చు. దాని పొడవు 115 సెం.మీ మించకూడదు.. అది 7 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండకూడదు. అదనంగా.. ప్రయాణీకులు పర్స్, కాంపాక్ట్ ల్యాప్‌టాప్ బ్యాగ్ లేదా అలాంటి ఏదో ఒక వ్యక్తిగత వస్తువును 3 కిలోల బరువు వరకు తీసుకురావచ్చు. ఇండిగో ప్రయాణికులు కూడా ఒక క్యాబిన్ బ్యాగ్, ఒక వ్యక్తిగత వస్తువును తీసుకెళ్లడానికి అర్హులు. -
స్థిరమైన డిమాండ్ ఉండే పరిశ్రమ
ముంబై: లగేజీ ఉత్పత్తుల పరిశ్రమలో (సంఘటిత రంగం) డిమాండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో స్థిరంగా కొనసాగొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. పర్యాటకం, కార్పొరేట్ ప్రయాణాలకు డిమాండ్ కొనసాగుతుండడం ఇందుకు సానుకూలంగా పేర్కొంది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంఘటిత లగేజీ పరిశ్రమ ఆదాయం 8–10 శాతం క్షీణించొచ్చని అంచనా వేసింది. 2021–22 నుంచి 2023–24 మధ్య పరిశ్రమ పరిమాణం రెట్టింపు కావడం, అధిక బేస్ ఇందుకు కారణాలుగా పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2023–24) పరిశ్రమ 18 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ‘‘తయారీ దారుల మధ్య పోటీ పెరిగింది. కొత్త సంస్థలు ప్రవేశించాయి. నిల్వలు మోస్తరుగా పెరగడం వంటి అంశాలతో కంపెనీలు విక్రయ ధరలను పోటాపోటీగా మార్చేశాయి. దీంతో నికరంగా విక్రయ ధరలు, ముఖ్యంగా ఎకానమీ (బడ్జెట్) విభాగంలో తగ్గాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. 2023–24లో నిర్వహణ మార్జిన్లు 1.5 శాతం మేర తగ్గాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 0.50 శాతం వరకు క్షీణించి 13.5–14 శాతం వద్ద స్థిరపడొచ్చని అంచనా వేసింది. దేశ లగేజీ పరిశ్రమలో కేవలం కొన్ని పెద్ద సంస్థల ఆధిపత్యమే కొసాగుతున్నట్టు వివరించింది. ఇవి గత కొన్ని సంవత్సరాల్లో స్థానికంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకున్నట్టు తెలిపింది. మరోవైపు అసంఘటిత లగేజీ పరిశ్రమ ప్రధానంగా చైనా నుంచి దిగుమతులపైనే ఆధారపడినట్టు వివరించింది. స్థానిక తయారీ.. హార్డ్ లగేజీ ఉత్పత్తుల తయారీని స్థానికంగానే చేపడుతుండడం గత ఐదేళ్లలో వీటి దిగుమతులు తగ్గుతూ వస్తున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ‘‘హార్డ్ లగేజీకి ప్రాధాన్యం పెరుగుతుండడం, , పోటీ ధరలకే నాణ్యమైన ఉత్పత్తుల లభ్యత అన్నవి సంఘటిత రంగంలోని కంపెనీలకు అనుకూలం. ఫలితంగా దేశ లగేజీ పరిశ్రమలో సంఘటిత రంగ కంపెనీల వాటా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరకు 45 శాతానికి చేరుకుంటుంది. అదే సమయంలో రిస్‌్కలు సైతం పెరుగుతున్నాయి. వరుసగా మూడేళ్ల పాటు డబుల్ డిజిట్ వృద్ధిని పరిశ్రమ చూసింది. అది ఇప్పుడు క్షీణిస్తోంది. కొత్త సంస్థల ప్రవేశంతో పోటీ పెరిగింది. ఇది ప్రచారంపై వ్యయాలను పెంచింది. దీంతో మార్జిన్లు మోస్తరు స్థాయికి చేరుకున్నాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ హిమాంక్ శర్మ వివరించారు. డిమాండ్ మోస్తరు స్థాయికి దిగి రావడంతో 2024లో లగేజీ నిల్వలు 114రోజులకు (విక్రయాలకు సరిపడా) చేరాయని, ఆర్థిక సంవత్సరం చివరికి 100–105 రోజులకు పరిమితం కావొచ్చని అంచనా వేసింది. కంపెనీల బ్యాలన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం, పూర్తి సామర్థ్య వినియోగం నేపథ్యంలో సంఘటిత రంగ సంస్థలు హార్డ్ లగేజీ తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించొచ్చని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ‘‘సామర్థ్యం 25 శాతం మేర పెరగొచ్చు. ఇందుకు రూ.500–550 కోట్ల వరకు వ్యయం చేయాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని అంతర్గత వనరుల నుంచే కంపెనీలు సమకూర్చుకోవచ్చు. రుణ భారాన్ని పరిగణనలోకి తీసుకుని చూసినా వడ్డీ కవరేజీ రేషియో, నెట్‌వర్త్ పరంగా కంపెనీలు సౌకర్యంగానే ఉన్నాయి’’అని క్రిసిల్ రేటింగ్స్ అసోసియేట్ డైరెక్టర్ రుషబ్ బోర్కార్ తెలిపారు. -
అంబానీ పెళ్లి వేడుక : టిక్ టాకర్ లగేజీ గాయబ్..చివరికి!
View this post on Instagram A post shared by jewelswithjules • julia hackman chafé (@juliachafe)అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహ వేడుకలు సోషల్ మీడియాలో ట్రెండిగ్‌లో నిలుస్తున్నాయి. ఈ వేడుకలకు హాజరయ్యేందుకు దేశ విదేశాలకు చెందిన సెలబ్రిటీలు, కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్రమంలో అనంత్, రాధిక ప్రీవెడ్డింగ్ వేడులకు ఉత్సాహంగా పయనమైన యుఎస్ టిక్‌టాకర్, కంటెంట్ క్రియేటర్ జూలియా చాఫ్కు వింత అనుభవం ఎదురైంది. బిలియనీర్ అంబానీ కుటుంబంపై నెలల తరబడి వీడియోలు చేసిన ఆమెకు అంబానీ ఇంట పెళ్లి సందడికి హాజరవ్వాలనేది డ్రీమ్. కానీ ఊహించని పరిస్థితి ఎదురైంది.. స్టోరీ ఏంటంటే..అంబానీ ఫ్యామిలీనుంచి అందిన ఆహ్వానం నేపథ్యంలో జూలియా చాఫ్ ఉత్సాహంగా సోమవారం ఇండియాకు బయలుదేరింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇంతలో ఏజియన్ ఎయిర్‌లైన్స్ లో నాలుగు బ్యాగుల లగేజీ మొత్తాన్ని పోగొట్టుకుంది. ఏథెన్స్లో చిక్కుకుపోయింది. దీంతో సంబంధిత ఎయిర్‌లైన్ ట్యాగ్ చేస్తూ మరో పోస్ట్ పెట్టింది. మొత్తానికి లగేజీ తిరిగి దొరకడంతో తన కలను సాకారం చేసుకుంది. అంబానీ ఇంట జరిగిన వేడుకలకు హాజరైంది. ఈ వీడియోపై ఇంటర్నెట్ సంచలనం ఓరీ స్పందించాడు. View this post on Instagram A post shared by jewelswithjules • julia hackman chafé (@juliachafe) కాగా జూలియా చాఫ్తో జెమ్ డీలర్ కూడా. అంబానీ కుటుంబానికి చెందిన డైమండ్, లగ్జరీ ఆభరణాల గురించి ఈమెకు తెలిసినంతగా ఇండియన్ మీడియాకు కూడా తెలియదట. దీనికి సంబంధించిన కంటెంట్‌తోనే జూలియా బాగా పాపులర్ అయింది. -
సిద్ధార్థ్ ప్రేయసికి చేదు అనుభవం.. ఏకంగా ఆరుగంటలకు పైగా!
ఇటీవలే హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్‌తో అభిమానులను మెప్పించిన బ్యూటీ ఆదితి రావు హైదరీ. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరెకెక్కించిన ఈ సిరీస్‌కు విశేషమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈనెల 23న ముంబయిలో జరిగిన సోనాక్షి సిన్హా పెళ్లికి హాజరయ్యాడు. తనకు కాబోయే భర్త సిద్దార్థ్‌తో కలిసి రిసెప్షన్లో పాల్గొన్నారు.అయితే తాజాగా ఆదితి రావు హైదరీకి ఇంగ్లాండ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆ దేశంలోని హీత్రో ఎయిర్‌పోర్ట్‌లో లగేజీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. తన లగేజీ కోసం ఆరు గంటలకు పైగా విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇదొక 'చెత్త ఎయిర్పోర్ట్ అని కామెంట్ చేసింది. అక్కడి ఎయిర్పోర్ట్ సిబ్బంది తనకు సాయం చేయకుండా.. లగేజీ కోసం ఎయిర్‌లైన్ సంస్థను సంప్రదించమని సలహా ఇచ్చారని వివరించింది. దాదాపు ఆరు గంటల తర్వాత కూడా తన లగేజీ అందలేదని అదితి వెల్లడించింది.కాగా.. ఆదితి రావు హైదరీ ఢిల్లీ- 6 మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. సోనమ్ కపూర్, అభిషేక్ బచ్చన్ నటించిన ఈ చిత్రంలో సహాయక పాత్రలో కనిపించింది. ఆ తరువాత లండన్, పారిస్, న్యూయార్క్, మర్డర్ 3, వజీర్, పద్మావత్ లాంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆదితి లయనెస్, గాంధీ టాక్స్ చిత్రాలలో కనిపించనుంది. అయితే వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఈ ఏడాది హీరో సిద్ధార్థ్‌తో ఆదితిరావు ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. -
రైల్వే స్టేషన్లో చీకట్లు... లగేజీలు చోరీ, పడిపోయిన ప్రయాణికులు!
అది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ రైల్వేస్టేషన్.. తాము ఎక్కబోయే రైలు కోసం ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా స్టేషన్లో కరెంట్ పోయింది. ప్రయాణికులకు మొదట ఏమీ అర్థం కాలేదు. చాలా సేపు ఇదే పరిస్థితి నెలకొనడంతో స్టేషన్లో గందరగోళం ఏర్పడింది. జబల్పూర్ ప్రధాన స్టేషన్‌లోని విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలడంతో ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్ నుంచి ప్లాట్‌ఫామ్ ఆరు వరకు స్టేషన్ ఆవరణ అంతా అంధకారమయం అయ్యింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో టికెట్ కౌంటర్ కూడా మూతపడింది. ఇది చూసిన ప్రయాణికులు నానా హంగామా చేశారు. ఈ ఘటన జరిగి రెండు రోజులైనా దీనికి బాధ్యులెవరనేది అధికారులు తేల్చలేదు. స్టేషన్ మొత్తంమీద గంటల తరబడి విద్యుత్ లేకపోవడంతో చాలా మంది ప్రయాణికుల సామాను చోరీకి గురయ్యింది. చీకటిమాటున దొంగలు రెచ్చిపోయారు. చీకటిలో ఎదుట ఏమున్నదో తెలియక పలువురు ప్రయాణికులు నడిచేటప్పుడు పడిపోయారు. ఈ ఘటన అనంతరం సంబంధిత శాఖ ఇంజినీర్లు మరమ్మతులు చేపట్టారు. గంట తరువాత తిరిగి విద్యుత్ పునరుద్ధరణ జరిగింది. స్టేషన్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్యానెల్లో లోపం కారణంగా, ప్లాట్‌ఫారమ్‌తో సహా మొత్తం స్టేషన్ ప్రాంగణం, వివిధ రైల్వే విభాగాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్‌ను ఉపయోగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు ప్యానల్‌కు మరమ్మతులు చేసిన తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరిగింది. ఇది కూడా చదవండి: ఒడిశా, బీహార్ గుణపాఠాల తర్వాత రైల్వేశాఖ ఏం చేస్తున్నదంటే.. -
వేగంగా, సులభంగా భక్తుల లగేజీ నిర్వహణ
తిరుమల: శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తమ లగేజీని, సెల్ఫోన్లను డిపాజిట్ చేసి తిరిగి తీసుకునే ప్రక్రియను మరింత వేగంగా, సులభంగా మార్చేందుకు.. బాలాజీ బ్యాగేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో మంగళవారం సీవీఎస్వో నరసింహ కిశోర్‌తో కలిసి ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. నూతన విధానంలో లగేజీ, సెల్ఫోన్లు, ఇతర ఎల్రక్టానిక్ వస్తువులను డిపాజిట్ చేస్తే.. ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా సులభంగా పొందవచ్చన్నారు. భక్తులు కౌంటర్ వద్ద లగేజీ ఇవ్వగానే.. వారి వద్ద ఉన్న దర్శన టికెట్‌ను స్కాన్ చేసి వాటి వివరాలను ఎల్రక్టానిక్ డివైస్‌లో నిక్షిప్తం చేస్తామన్నారు. దర్శన టికెట్ లేని భక్తులకు వారి వివరాలు, పేరు నమోదు చేసుకుని బ్యాగ్‌కు ఆర్‌ఎఫ్‌ఐడీతో కూడిన ట్యాగ్ జతపరిచి క్యూఆర్ కోడ్ రసీదు ఇస్తామని చెప్పారు. ఫోన్ డిపాజిట్ కోసం దర్శన టికెట్‌తో పాటు భక్తుల వివరాలు సేకరిస్తామని తెలిపారు. భక్తులకు వారి లగేజీ గురించిన సమాచారం మెసేజ్ రూపంలో అందుతుందన్నారు. భక్తుల రసీదును ఎల్రక్టానిక్ డివైస్‌తో స్కాన్ చేసిన వెంటనే వారి మొబైల్, లగేజీ భద్రపరిచిన ర్యాక్ నంబర్ తెలుస్తుందని.. తద్వారా సులభంగా లగేజీ తిరిగి పొందే అవకాశం లభించిందన్నారు. తిరుమలలో 16 కేంద్రాల ద్వారా 44 కౌంటర్లలో ఈ ప్రక్రియ జరుగుతోందన్నారు. నూతన విధానం కోసం చెన్నైకి చెందిన చార్లెస్ మార్టిన్ రూ.2 కోట్లు, బెంగళూరుకు చెందిన వేణుగోపాల్ రూ.కోటి, హైదరాబాద్‌కు చెందిన ట్రాక్ ఇట్ సంస్థ సీఈవో వేదాంతం సోమశేఖర్ రూ.17 లక్షలు విరాళంగా ఇచ్చారని నరసింహ కిశోర్ తెలిపారు. సమావేశంలో అధికారులు బాలిరెడ్డి, గిరిధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
లక్ అంటే ఇదే: ఖరీదైన బ్యాగ్‌ను ఎయిర్‌ట్యాగ్ పట్టిచ్చింది!
డెన్వర్‌కు చెందిన తల్లీ కూతుళ్లు లాక్రోస్ టో టోర్నమెంట్‌కి వెళ్లి వస్తూ తమ లగేజీని కోల్పోయారు. బాల్టిమోర్ నుండి చికాగో మీదుగా విమానం వస్తూ డెన్వర్‌కు పయన మయ్యారు. విమానాశ్రయంలో లగేజీ బెల్ట్‌లో తమ బ్యాగ్ కనిపించలేదు. దీంతో వారు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దాదాపు ఇక దొరకదు అనుకున్న ఖరీదైన బ్యాగును టెక్నాలజీ సాయంతో దక్కించుకున్న వైనం విశేషంగా నిలిచింది. (బంగారం,వెండి ధరలు: ఎలా ఉన్నాయంటే..!) సీఎన్ఎన్ రిపోర్ట్ ప్రకారం సాండ్రా షుస్టర్ , ఆమె 15 ఏళ్ల కుమార్తె రూబీ లాక్రోస్ ప్లేయర్. టోర్నమెంట్ నుంచి జూలై 17న చికాగో ఓ'హేర్ విమానాశ్రయం వద్ద, లాక్రోస్ కిట్ చెకిన్ బ్యాగ్‌గా ఉంచుకుని, మిగిలిన బ్యాగేజీని విమానాశ్రయంలో లగేజీ కౌంటర్లో ఇచ్చారు. అయితే బెల్ట్‌పై వారి లగేజీ మిస్ అయింది. దీంతో అధికారులకు ఫిర్యాదు చేయగా వస్తుందని చెప్పారు. కానీ రాలేదు. మళ్లీ కాల్ చేస్తే మీ బ్యాగ్ ఇంకా బాల్టిమోర్‌లో ఉంది అనే సమాధానం వచ్చింది. అంతేకాదు మీ బ్యాగును ఎవరో కొట్టేశారని కూడా చెప్పారు. రూబీ బ్యాగులో ఖరీదైన 2,000 డాలర్ల కిట్ ఉంది. అంతకుమించి తన ఆటకు బాగా అలవాటైన లాక్రోస్ గేమ్ స్టిక్ ఉంది. దాన్ని వదులుకోవడం అంటే చాలా నష్టం. మరోవైపు మరో టోర్నమెంట్ కోసం శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లాలి. దీంతో తమ రిఫరెన్స్ నంబర్‌తో డెన్వర్‌లోని పోయిన లగేజ్ డెస్క్ వద్ద ఆగి, చికాగోలో ఎయిర్‌ట్యాగ్ ఇప్పటికీ ట్రాక్ చేస్తూనే ఉందని గట్టిగా వాదించారు. యాపిల్ ఎయిర్ ట్యాగ్ ద్వారా తన బ్యాగ్ బాల్టిమోర్‌లో లేదని షుస్టర్కి అర్థమవుతోంది. టెక్నాలజీ సాయంతో పరిశీలించగా, చికాగోలోని టెర్మినల్-1, బ్యాక్ ఆఫీసులో బ్యాగ్ ఉన్నట్లు ఎయిర్‌ట్యాగ్ చూపించింది. ఇదే విషయాన్ని వారికి వివరించి అక్కడి వారిని విచారించమని అడిగితే తమకు అనుమతి లేదని సమాధానం ఇచ్చారు సిబ్బంది. అయితే సిస్టమ్‌లో నోట్ పెడతామని, బ్యాగేజీ బృందం పర్యవేక్షిస్తుందని తెలిపింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ టీంని ట్విటర్ ద్వారా సంప్రదించారు. అయితే ట్యాగ్ వివరాలు తప్పుగా ఉన్నాయని చెప్పడంతో మళ్లీ నిరాశ తప్పలేదు. బ్యాగ్, క్లెయిమ్ టిక్కెట్, లొకేషన్ వివరాలను వారికి పంపించారు. చివరికి మరో అరగంటలో ఫోన్ చేసి బ్యాగ్ దొరికిందని, పంపిస్తామని చెప్పారు. కానీ వాళ్ల మీద ఉన్న అపనమ్మకంతో నెక్ట్స్ ఫ్లైట్‌లోనే చిగాగో వెళ్లి అక్కడ కేవలం 30 సెకన్లలో తన బ్యాగును గుర్తించి, తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషాయన్ని సాండ్రా షుస్టర్, రూబీ మీడియాతో పంచుకున్నారు. విమానయా సంస్థల సేవలు అధ్వాన్నంగామారుతున్నాయి.ఫలితంగా ఖరీదైన వస్తువులు,బ్యాగులు పోగొట్టుకుంటున్నాం. అందుకే ఎయర్ట్యాగ్ని కొనుగోలు చేసానని సాండ్రా షుస్టర్ వెల్లడించారు. అంతేకాదు ఈ టెక్ యుగంలో టెక్నాలజీ ఎలా వాడుకోవాలో వారికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. యాపిల్ ఎయిర్‌ట్యాగ్ యాపిల్ ఎయిర్‌ట్యాగ్ ఒక ట్రాకింగ్ డివైస్. మిస్ అయిన వ్యక్తులు వ్యక్తిగత వస్తువులను కనుగొనడంలో ఎయిర్‌ట్యాగ్ కీ ఫైండర్‌గా పని చేస్తుంది. ఎయిర్‌ట్యాగ్ క్రౌడ్సోర్స్డ్ ఫైండ్ మై నెట్వర్క్,బ్లూటూత్ సిగ్నల్స్ సాయంతో కీలు, బ్యాగ్‌లు, దుస్తులు, చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, వాహనాలు తదితర పోగొట్టుకున్న వస్తువులను గుర్తించవచ్చు. -
చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పాము కలకలం..ఏకంగా 22 పాములు..
చైన్నై ఎయిర్ పోర్ట్‌లో ఒకటి రెండుకాదు ఏకంగా 22 పామలు తీవ్ర కలకలం రేపాయి. దీంతో చెన్నై ఎయిర్పోర్ట్ వార్తల్లో నిలించింది. ఓ మహిళా ప్రయాణికురాలి లగేజ్ బ్యాగ్‌ని తనిఖీలో భాగంగా సోదా చేస్తుండగా.. ఓ పారద్శక ప్లాస్టిక్ కంటైనర్‌లో సర్పాలు ఉండటాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ పాములను రాడ్‌తో తీస్తుండగా.. మరికొన్ని పాములు పెట్టెల్లోంచి బయట నేలపైకి వచ్చేయడం జరిగింది. ఆ లగేజ్ బ్యాగ్‌లో ఊసరవెల్లిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సదరు మహిళ ఏప్రిల్ 28న కౌలాంలంపూర్ నుంచి ఏకే13 విమానంలో చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి వచ్చింది. అక్కడ కస్టమ్స్ అధికారులు ఆమెను అడ్డుకుని తనిఖీలు నిర్వహించగా ఈ విషయం వెలుగు చూసింది. కస్టమ్స్ అధికారులు ఆమెపై వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ట్వీట్ చేశారు. Woman who smuggles snakes 🐍 A woman was held at Chennai Airport with 22 snakes She arrived from Kuala Lumpur by Flight No. AK13 On examination of her checked-in baggage, 22 Snakes of various species and a Chameleon were found & seized pic.twitter.com/TI39llr72O — Atulkrishan (@iAtulKrishan) April 29, 2023 (చదవండి: సైన్యాధికారిణిగా గల్వాన్ అమరుని అర్ధాంగి) -
లగేజీ రుసుము వివాదం.. వదిలేసి విమానం ఎక్కిన విద్యార్థి.. ట్విస్ట్ ఏంటంటే!
బెంగళూరు (దొడ్డబళ్లాపురం): లగేజీకి విధించిన అధిక రుసుము చెల్లించలేని ఒక విద్యార్థి వాటిని ఎయిర్‌పోర్టులోనే వదిలి మలేషియాకు వెళ్లిపోయిన సంఘటన కెంపేగౌడ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. బెళగావికి చెందిన సూరజ్ పాటిల్ అనే ఈ విద్యార్థి బెంగళూరు నుంచి మలేషియాకు వెళ్లాల్సి ఉంది. అక్కడ అతడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఎయిర్ ఏషియా వెబ్సైట్లో ప్రతి కేజీ అదనపు లగేజీకి రూ.500 రుసుము వసూలు చేస్తామని పేర్కొన్నారు. కానీ ఆ సంస్థ గ్రౌండ్ సిబ్బంది మాత్రం కేజీ లగేజీకి విద్యార్థికి రూ.2000 చెల్లించాలని డిమాండు చేసారు. దీంతో విద్యార్థి అంత డబ్బు తన వద్ద లేదని ఆహారం, దుస్తుల లగేజీని ఎయిర్‌పోర్టులో వదిలి మలేషియాకు వెళ్లిపోయాడు. అక్కడకు వెళ్లాక ఆన్లైన్ ద్వారా సదరు సంస్థపై ఫిర్యాదు చేశాడు. కాగా తమ సిబ్బంది తప్పేమీ లేదని సంస్థ చెప్పడం గమనార్హం. చదవండి ఏనుగమ్మా ఏనుగు.. విశ్వవేదికపై ఘీంకారం.. ఇంతకూ మన దేశంలో ఏనుగుల పరిస్థితి ఏమిటి ? -
ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు...దెబ్బకు ఎయిర్పోర్ట్ క్లోజ్
సాధారణంగా విమానంలో ఏ ప్రయాణికుడి వద్దనైన విమానాశ్రయానికి తీసుకురాని వస్తువులు దొరికితే అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరుగుతుంది. అంతేగానీ ఎయిర్ పోర్ట్‌ని క్లోజ్ చేయరు. కానీ ఇక్కడొక ప్రయాణకుడి లగేజ్ బ్యాగ్‌లో అనుమానాస్పద వస్తువు కారణంగా....మొత్తం ఎయిర్‌పోర్ట్‌నే క్లోజ్ చేశారు. వివరాల్లోకెళ్తే...స్కాట్లాండ్లోని విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి బ్యాగ్‌లో అనుమానాస్పద ప్యాకేజీ కనిపించింది. దీంతో వందలాదిమంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ డెస్క్ వద్ద క్యూలో నిలబడి ఉన్నారు. దీంతో విమానాల్లో వెళ్లాల్సిన మరికొంతమంది ప్రయాణికులు కార్ పార్కింగ్‌లోనే నిలబడిపోయి ఉండాల్సి వచ్చింది. విమానాశ్రయంలో సిబ్బంది లగేజీలపై దర్యాప్తు చేస్తున్నందున ఆలస్యమవుతుందని ఎయిర్పోర్ట్ అధికారి తెలిపారు. ఐతే ప్రయాణికుడి లగేజీలో అనుమానాస్పద వస్తువు కారణంగానే.. సిబ్బంది అప్రమత్తమైనట్లు తెలిపారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడంతో మరింతమంది ప్రయాణికులు క్యూలో పడిగాపులు పడాల్సి వచ్చింది. మరోవైపు విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణకుల రద్దీ ఎక్కువ అవ్వడంతో తనిఖీలు చేయడం మరింత ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. అందువల్లే తాము ముందు జాగ్రత్తగా టెర్మినల్ భవనాన్ని మూసివేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. అంతేగానీ ఎయిర్‌పోర్ట్‌ని మొత్తం ఖాళీ చేయించలేదని చెప్పారు. (చదవండి: కరోనా విషయమై అగ్రరాజ్యం గుట్టు బట్టబయలు..వెలుగులోకి షాకింగ్ నిజాలు) -
రానా లగేజ్ మిస్సింగ్.. క్షమాపణలు చెప్పిన ఇండిగో ఎయిర్‌లైన్స్
ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై హీరో రానా దగ్గుబాటి చేసిన ట్వీట్‌పై ఆ కంపెనీ స్పందించింది. జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. మీ లగేజీని వీలైనంత త్వరగా మీకు చేరేలా చూసేందుకు మా సిబ్బంది పనిచేస్తున్నారు అంటూ రిప్లయ్ ఇచ్చింది. కాగా ఇండిగో ఏయిర్ లైన్స్ సేవలపై రానా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన రానాకు అక్కడ చెక్ ఇన్ అయ్యాక ఫైట్ ఆలస్యమంటూ, మరో విమానంలో వెళ్లాల్సిందిగా సూచించారు. అయితే బెంగళూరు చేరుకున్నాక లగేజ్ రాకపోవడంతో రానా అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా వారి దగ్గర్నుంచి సరైన సమాధానం రాలేదు. దీనిపై అసహం వ్యక్తం చేస్తూ.. ఇండియాలో ఇండిగో(IndiGo) అంత చెత్త విమాన ప్రయాణం చేయలేదు. విమానం టైమింగ్స్ గురించి ఎవరికీ తెలీదు. కనిపించకుండా పోయిన లగేజ్ గురించి తెలియదు. సిబ్బందికి ఎలాంటి సమాచారం తెలీదు. ఇంత కన్నా చెత్తగా సర్వీస్ ఏదైనా ఉంటుందా అంటూ ఫైర్ అయ్యారు. Sir, we understand the discomfort when the bag doesn't arrive with you. While we apologise for the inconvenience caused in the meantime, please be assured, our team is actively working to get your luggage delivered to you at the earliest. (1/2) — IndiGo (@IndiGo6E) December 4, 2022 -
Telangana: బస్సుల్లో లగేజీ చార్జీలను భారీఎత్తున పెంచిన ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ప్రయాణికుల లగేజీపై దృష్టి సారించింది. బస్సుల్లో తరలించే సామగ్రిపై విధించే చార్జీలను భారీఎత్తున పెంచేసింది. పల్లె వెలుగు బస్సుల్లో 25 కి.మీ. దూరానికి ఇప్పటివరకు ఉన్న రూపాయి చార్జీని ఏకంగా రూ.20కి పెంచింది. ఎక్స్‌ప్రెస్, ఆపై కేటగిరీ బస్సుల్లో ఇదే దూరానికి ఉన్న రూ.2 చార్జీని రూ.50కి పెంచింది. సిటీ బస్సుల్ని కూడా వదలకుండా పాత చార్జీలతో పోల్చుకుంటే పెద్దమొత్తంలో చార్జీలు వసూలు చేయనుంది. కొత్త చార్జీలను ఈ నెల 22 నుంచే అమలులోకి తీసుకురావాలని నిర్ణయించింది. 2002 నాటి చార్జీలే ఇప్పటివరకు.. బస్సుల్లో లగేజీ చార్జీలు 2002లో ఖరారు చేసినవే ఇప్పటికీ అమలవుతున్నాయి. అప్పటి నామమాత్రపు రుసుములే కొనసాగుతున్నాయి. 2002 తర్వాత పలుమార్లు టికెట్ చార్జీలు పెరిగినా లగేజీ చార్జీలను మాత్రం సవరించలేదు. ఇటీవల నష్టాలను పూడ్చుకునేందుకు డీజిల్ సెస్ విధింపు, ఆ వెంటనే దాని సవరింపుతో టికెట్ రూపంలో ఆదాయాన్ని భారీగా పెంచుకున్న ఆర్టీసీ..తాజాగా లగేజీ చార్జీలను పెంచడంతో పాటు పకడ్బందీగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఇంతకాలం ఇవి రూపాయి, రెండు రూపాయలు.. ఇలా మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆర్టీసీ సరుకు రవాణా (కార్గో) చార్జీలకు దాదాపు సమంగా పెంచేసింది. ఒక్కో బస్సులో గరిష్ట లగేజీ పరిమితి ఇలా.. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ 750 కిలోలు సూపర్ లగ్జరీ 1,000 కిలోలు 50 కిలోలు మించితే బాదుడే.. ఒక్కో ప్రయాణికుడు/ప్రయాణికురాలు తమ వెంట 50 కిలోల బరువుండే సామగ్రిని ఉచితంగా తీసుకెళ్లొచ్చు. అంతకంటే మించి ఉండే సామగ్రిపై చార్జీలు విధిస్తారు. 25 కిలోల వరకు బరువును ఓ యూనిట్‌గా పరిగణిస్తారు. అంటే ఉచిత పరిమితికి మించి ఒక కిలో ఎక్కువున్నా సరే, దాన్ని ఒక యూనిట్‌గానే పరిగణించి చార్జీ వడ్డిస్తారు. 25 కిలోల కంటే ఒక కిలో ఎక్కువున్నా..దాన్ని రెండో యూనిట్‌గా పరిగణించి చార్జీ విధిస్తారు. ఆ మేరకు చార్జీలు నిర్ధారించారు. పల్లె వెలుగులో అయితే ప్రతి 25 కి.మీ చొప్పున, ఎక్స్‌ప్రెస్, ఆ పై కేటగిరీలో ప్రతి 50 కి.మీ చొప్పున చార్జీ మారుతుంది. మూడు ప్యాకెట్లు మించకూడదు! ►ప్రయాణికుడు ఉచితంగా తీసుకెళ్లే 50 కిలోల బరువు కూడా మూడు ప్యాకెట్ల (బ్యాగులు, సూట్‌కేసులు వగైరా)కు మించి ఉండకూడదు. ►ప్రతి ప్యాకెట్ 20 కిలోల బరువు మించి ఉండకూడదు. ఒకవేళ ఉచిత పరిమితిలోపు ఉండే బరువు మూడు ప్యాక్‌లకు మించితే అదనపు ప్యాక్‌లపై చార్జీ విధిస్తారు. ►ఒక్కో ప్రయాణికుడు వంద కిలోలకు మించిన బరువును తీసుకెళ్లరాదు. వంద కిలోల్లో 50 ఉచితం కాగా, మిగతాది చార్జీ పరిధిలోకి వస్తుంది. ►చార్జీ విధించే 50 కిలోల బరువు రెండు ప్యాకెట్లలో మాత్రమే ఉండాలి. మూడో ప్యాక్ ఉంటే దాన్ని అదనపు యూనిట్‌గా భావించి అదనపు చార్జీ విధిస్తారు. ►100 కిలోలకు మించి బరువు ఉంటే ప్రయాణికుల బస్సుల్లో అనుమతించరు. కార్గో బస్సుల్లోనే తరలించాలి. జంతువుల తరలింపు అనుమతించరు ►బస్సుల్లో నిషేధిత వస్తువులు, అగ్ని ప్రమాదాలకు కారణమయ్యేవి, అటవీ సంబంధిత వస్తువులు, పెంపుడు జంతువులు సహా ఏ జంతువులనూ అనుమతించరు. ►భారీ వస్తువులు, పాడయ్యే వస్తువులకు రెట్టింపు చార్జీ విధిస్తారు. ట్రక్ టైర్‌ను మూడు యూనిట్లుగా పరిగణిస్తారు. టీవీ, రిఫ్రిజరేటర్, సైకిల్, ఫిల్మ్ బాక్స్ (ప్యాక్డ్), వాషింగ్ మెషీన్, కార్ టైర్.. వీటిని రెండు యూనిట్లుగా పరిగణిస్తారు. ►చాలాచోట్ల కూరగాయలు, పాలు, పండ్లను ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్నారు. ఇప్పుడు అలాంటి రైతులు భారీగా చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. దుర్వినియోగం అరికట్టేందుకు.. ఆర్టీసీకి సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా కార్గో బస్సులున్నాయి. కానీ కొంతమంది కార్గో చార్జీలను తప్పించుకునేందుకు సరుకును ప్రయాణికుల బస్సుల్లో తరలిస్తున్నారు. వీటి చార్జీ నామమాత్రంగా ఉండటంతో, డ్రైవర్/కండక్టర్లకు కొంత మొత్తం ముట్టచెప్పి సరుకు తరలిస్తున్నారు. దీంతో ఆర్టీసీ నష్టపోతోంది. దీన్ని నివారించేందుకు ఈ చార్జీలను పెంచినట్టు ఆర్టీసీ పేర్కొంటోంది. -
టెక్నాలజీ వేసిన బాట.. ట్రావెలర్స్‌కి వరాల మూట..
చిన్న బౌల్లో ఉల్లి పేస్ట్.. చిన్న బాటిల్లో కాఫీ.. చిన్న బకెట్లో వాషింగ్ మెషిన్.. చిన్న బాక్స్‌లో వంట.. ఇదేం చిన్నపిల్లలు ఆడుకునే లక్కపిడతల ఆట కాదు.. టెక్నాలజీ వేసిన బాట.. ట్రావెలర్స్‌కి వరాల మూట.. కొత్త ప్రదేశాలను చూడటమంటే మనసుకి ఎప్పుడూ ఆహ్లాదమే. ఒత్తిడికి దూరంగా రిలాక్స్ అవ్వడం కోసం... రిఫ్రెష్ కావడం కోసం... పరుగుతీసే విహారయాత్రల్లో అలసటకి, ఆకలికి తావు లేదంటోంది టెక్నాలజీ. ప్రయాణికులకు లైట్ లగేజ్ పాలసీని చూపిస్తోంది. ఊళ్లు, రాష్ట్రాలు దాటి వెళ్లినా ఇంట్లో ఉన్నంత దర్జాగా గడపమంటోంది. కంఫర్టబుల్ ట్రావెల్‌ని పరిచయం చేస్తోంది. పిల్లల తల్లులైనా, పండు ముసలి అయినా.. ఈ మినీ గాడ్జెట్స్‌ని వెంట పెట్టుకుని ప్రయాణిస్తే.. తిరుగే లేదు. రీచార్జబుల్ చాపర్ వంట అనగానే ఉల్లిపాయ ముక్కల దగ్గర నుంచి.. అల్లం, కొత్తమీర తురుము వరకూ ప్రతీది అవసరమే. ఇంట్లో అయితే తీరిగ్గా చాకు తీసుకుని కట్ చేయడమో, మిక్సీ పట్టుకోవడమో చేస్తుంటాం. కానీ క్యాంపింగ్‌లో అవన్నీ సాధ్యం కాదుlకదా! అందుకే ఈ మినీ చాపర్. ఇందులో అల్లం, వెల్లుల్లి వేసినా.. క్యారెట్, బీట్రూట్ వేసినా.. చకచకా తరిగేస్తుంది. కచ్చాపచ్చా చేసేస్తుంది. ఉల్లిపాయలు, కూరగాయలు, చికెన్, మటన్ ఇలా వేటినైనా సరే.. నచ్చిన విధంగా, వంటకానికి కావాల్సిన విధంగా తరిగిపెడుతుంది. వీటిలో ముందే చార్జింగ్ పెట్టుకుని వాడుకునేవి అందుబాటులో ఉన్నాయి. మూడు గంటలు చార్జింగ్ పెడితే 35 సార్ల వరకు ఉపయోగించుకోవచ్చు. ఫోన్, పవర్ బ్యాంక్‌తో కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఐదేళ్లలోపు పిల్లలకు ఆపిల్, బనానా వంటివి నిమిషాల్లో పేస్ట్ చేసి, అదే బౌల్లో తినిపించొచ్చు. దీన్ని క్లీన్ చేయడం చాలా సులభం. యూనివర్సల్ కార్ రైస్ కుకర్ ఈ ప్రత్యేకమైన డివైజ్.. కారులో ప్రయాణించేవారికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కారులోనే భోజనం సిద్ధం చేసుకోవచ్చు. దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. రైస్ కుకర్ లోపలి భాగంలో నాన్–స్టిక్ కోటింగ్‌తో సులభంగా శుభ్రమయ్యే విధంగా ఉంటుంది. ఈ మల్టీఫంక్షనల్ స్మార్ట్ రైస్ కుకర్ అన్నం వండటమే కాకుండా.. ఓట్ మీల్, సూప్‌తో పాటు గుడ్లు, కూరగాయలు, చికెన్, మటన్ వంటివి ఉడికించడం ఇలా చాలానే చేస్తుంది. పైగా తినేంత వరకూ ఆహారాన్ని వేడిగానే ఉంచుతుంది. ఇది నీటి లీకేజ్నూ నివారిస్తుంది. ఫోల్డబుల్ బెడ్–చైర్స్–స్టూల్స్ దూర ప్రయాణాల్లో ఫోల్డబుల్ బెడ్స్, ఫోల్డింగ్ చైర్స్, ఫోల్డింగ్ స్టూల్స్ లగేజ్‌లో భాగం చేసుకోవడం చాలా మంచిది. దారిలో.. ఖాళీ స్థలాల్లో ఆగి విశ్రాంతి తీసుకునేప్పుడు బాగా ఉపయోగపడతాయి. వృద్ధులు, పిల్లలు కాస్త నడుము వాల్చడానికీ.. రెస్ట్‌గా ఉండటానికీ కంఫర్టబుల్‌గా ఉంటాయి. పైగా అవి ఫోల్డ్ చేసుకునే వీలు ఉండటంతో లగేజ్‌లో ఎక్కువ స్థలం ఆక్రమించవు. తేలికగా కూడా ఉంటాయి. మల్టీఫంక్షన్ జ్యూసర్ భీకరమైన ఆకలిని సైతం ఒక గ్లాసు జ్యూస్ తీర్చేస్తుంది. అందుకే నీరసం వచ్చినా.. ఆకలేసినా, దాహం వేసినా ముందుగా జ్యూస్ కార్నర్ దగ్గరకు పరుగుతీస్తాం. ప్రయాణాల్లో ఈ మినీ జ్యూసర్‌ని లగేజ్‌లో ప్యాక్ చేసుకుంటే చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు నచ్చిన జ్యూస్ సిద్ధం చేసుకోవచ్చు. డివైజ్ ముందువైపు ఉన్న బటన్ ప్రెస్ చేస్తే.. లోపలున్న బ్లేడ్స్ గిర్రున తిరుగుతూ హెల్దీ జ్యూస్‌ని తయారుచేస్తాయి. వాటర్ బాటిల్లా ఉన్న ఈ డివైజ్‌లో ట్రాన్స్పరెంట్ గ్లాస్ బౌల్లో పండ్లు లేదా కూరగాయల ముక్కలు, పాలు లేదా నీళ్లు, పంచదార లేదా తేనె జోడించి మిక్సీ పట్టుకోవాలి. అదే గ్లాస్ బౌల్లో జ్యూస్ తాగెయ్యొచ్చు. దీనికి ముందుగానే చార్జింగ్ పెట్టుకుంటే.. పవర్ కనెక్షన్‌తో అవసరం లేకుండానే పని చేస్తుంది. క్యాంపింగ్ కుక్వేర్ కిట్ వంట అనగానే చాలా పాత్రలు అవసరం అవుతాయి. కానీ ప్రయాణాల్లో అన్ని పాత్రలు పెట్టుకోవడం అసాధ్యం. అవుట్‌డోర్‌లో అవసరానికి తగ్గట్టు రూపొందిన కిట్ ఇది. చూడటానికి చిన్న సైజ్ హాట్ బాక్స్లా ఉంది కదూ. కానీ దీన్ని ఓపెన్ చేస్తే.. రెండు పెద్ద పెద్ద పాత్రలు, రెండు చిన్న పాత్రలు, బౌల్స్, గరిటెలు ఇలా అవసరమైనవన్నీ ఇందులో ఉంటాయి. పైగా ఈ బాక్స్ క్లోజ్ చేయడానికి క్లిప్స్లా ఉపయోగపడే గ్రీన్ కలర్ ఫోల్డబుల్ స్టిక్స్.. బాక్సులు ఓపెన్ చేశాక వాటిని హ్యాండిల్స్‌లా మార్చుకోవచ్చు. దాంతో ఈ పాత్రల్లో ఏది వండుకున్నా సర్వ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. చిన్న గ్యాస్ సిలిండర్‌పైన లేదా కట్టెలపైనా చాలా సులభంగా వంట చేసుకోవచ్చు. ఈ కుక్వేర్ మొత్తాన్ని పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన బ్యాగ్ కూడా లభిస్తుంది. కాస్మెటిక్ స్టోరేజ్ బాక్స్ సాధారణంగా టూర్ అనగానే.. ఆడవారికి అందంపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. వ్యాక్సింగ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, ఫేషియల్ వంటివన్నీ చేయించుకుని సిద్ధంగానే ఉంటారు. అయితే ఇంటికి దూరంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు డ్రెస్‌కి తగ్గ జ్యూయెలరీ, లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్ వంటి చిన్నచిన్నవన్నీ చాలా ముఖ్యం. వాటిని లగేజ్‌లో ఏదో మూల వేసుకునే కంటే.. అన్నీ ఒకే బాక్స్‌లో స్టోర్ చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకు సహకరిస్తుంది చిత్రంలోని ఈ స్టోరేజ్ బాక్స్. ఇందులో అద్దంతో పాటు నాలుగు అరలు ఉంటాయి. అద్దం బాక్స్ మూతలా కూడా పని చేస్తుంది. ఒక్కో అరలో ఒక్కో వెరైటీ చొప్పున జ్యూయెలరీ, మేకప్ కిట్, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ వంటివి ఉంచుకుంటే సరిపోతుంది. ఈ బాక్స్‌లోని అరలు 360 డిగ్రీలు తిరుగుతూ రెడీ అవడానికి అనువుగా ఉంటాయి. ఫోల్డింగ్ బార్బెక్యూ గ్రిల్ చిత్రంలోని ఈ గ్రిల్ ఫోల్డ్ చేస్తే కాస్త పొడవాటి పుస్తకంలా కనిపిస్తుంది. దీనిలో రెండు గ్రిల్స్ ఉంటాయి. ఒకటి బొగ్గులు వేసుకునేందుకు.. మరొకటి ఆహారాన్ని గ్రిల్ చేసేందుకు ఉపయోగపడతాయి. బొగ్గులు లేదా చెక్క ముక్కలతో నిప్పు రాజేసి.. పైన చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, కూరగాయల ముక్కలు ఇలా వేటినైనా సరే రుచికరంగా గ్రిల్ చేసుకోవచ్చు. ౖహె క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందిన ఈ మేకర్ని సులభంగా వెంట తీసుకుని వెళ్లొచ్చు. అవసరం లేనప్పుడు ఫోల్డ్ చేసి లాక్ చేసుకునే వీలుంటుంది. డివైజ్‌తో పాటు రోస్టింగ్ స్టిక్ కూడా లభిస్తుంది. లంచ్ అండ్ డిన్నర్ బాక్స్ ప్రయాణాల్లో ఎంతో కొంత సర్దుబాటు ఉంటుంది. ఇవే తినాలి.. ఇలానే తినాలి అని కాకుండా, దొరికినది ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవాలనే ప్రయత్నిస్తారు. అలాంటి వారికి ఈ బాక్స్ భలే చక్కగా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా మొత్తం ఈ బాక్స్‌లోనే కానిచ్చేయొచ్చు. అడుగున నీళ్లు పోసుకుని.. పై రెండు బాక్సుల్లో గుడ్లు, చిలగడ దుంపలు, జొన్న కండెలు, కూరగాయ ముక్కలు, చికెన్ లేదా మటన్ ముక్కలు.. ఇలా అన్నింటినీ ఆవిరిపై ఉడికించుకోవచ్చు. రకరకాల రైస్ ఐటమ్స్‌ని ఇందులో సిద్ధం చేసుకోవచ్చు. కావాల్సిన రెసిపీని ముందే బాల్స్‌లో వేసుకుని తినడానికి ఓ అరగంట ముందు పవర్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. డార్మెటరీల్లో, హోటల్ రూమ్స్‌లో ఉండాల్సి వచ్చినప్పుడు ఇలాంటి బాక్స్ బాగా ఉపయోగపడుతుంది. కాఫీ మేకర్ కాఫీ లేకుంటే పూట గడవని వారు.. ప్రయాణాల్లో ఉన్నప్పుడు కాఫీని మిస్ అవ్వాల్సిన పనిలేదు. చిత్రంలోని ఈ బాటిల్ 80–120 సెకన్లలో టేస్టీ కాఫీని అందిస్తుంది. ఈ డివైజ్ కింద వైపున్న మినీ వాటర్ ట్యాంక్‌లో నీళ్లు లేదా పాలు నింపుకుని, డివైజ్లోపల కాఫీ పౌడర్ వేసుకుంటే.. వేడివేడి కాఫీ రెడీ అయిపోతుంది. ఇది చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. హాట్ కాఫీ కావాలా లేక కోల్డ్ కాఫీ కావాలా అనేది మన అభిరుచిని బట్టి ఉంటుంది. ఫోల్డబుల్ వాషింగ్ మెషిన్ సాధారణంగా టూర్స్‌కి వెళ్లినప్పుడు ఆహారంతో పాటు దుస్తులు సమస్యగా మారతాయి. ఒక్క రోజు గడిస్తే చాలు.. మంచి బట్టలు, విడిచిన బట్టలు అంటూ వేరువేరుగా పెట్టడం, మోసుకొచ్చి తిరిగి ఇంట్లో ఉతుక్కోవడం అంతా పెద్ద పని. అయితే ఈ హై–ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఆటోమేటిక్ అల్ట్రాసోనిక్ ఎలక్ట్రిక్ వాషింగ్ మెషిన్.. ఎక్కువ రోజులు క్యాంపింగ్‌కి వెళ్లినప్పుడు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది తువ్వాళ్లు, లోదుస్తులు, సాక్స్, టీ–షర్టులు, ప్యాంట్స్ ఇలా అన్నింటినీ శుభ్రంగా ఉతికి పెడుతుంది. అంతే కాదు బొమ్మలు లేదా ఇతర చిన్నచిన్న వస్తువులు, నగలు, పండ్లు, కూరగాయలు.. ఇలా అన్నింటినీ క్లీన్ చేస్తుంది. ఈ డివైజ్‌ని వినియోగించడం చాలా సులభం. దీన్ని పూర్తిగా ఓపెన్ చేస్తే.. బకెట్ మాదిరి పెద్దగా మారి, మాసిన దుస్తుల్ని నింపుకుంటుంది. వాషింగ్ పూర్తి అయిన తర్వాత మళ్లీ ఫోల్డ్ చేసుకుని, కవర్లో పెట్టుకుని సూట్ కేస్‌లో పెట్టేసుకోవచ్చు. కేవలం 13 నిమిషాల సమయంలో ఈ మెషిన్ దుస్తుల్ని శుభ్రంగా, సువాసనభరితంగా ఉతికేస్తుంది. దీనికి ప్రత్యేకమైన హ్యాండిల్ ఉంటుంది. ఇది వెంట ఉంటే.. ఎక్కువ దుస్తులతో పనిలేదు. అవసరానికి ఉతికి ఆరేసుకునే కంఫ్టబుల్ దుస్తులు రెండు మూడు జతలు పెట్టుకుంటే సరిపోతుంది. ట్రావెల్ ఫ్రిజ్ వండిపెట్టే గాడ్జెట్స్ అన్నీ చక్కగానే ఉన్నాయి కానీ.. కూరగాయలు, పండ్లు, పాలు ఇవన్నీ నిలువ ఉండాలి కదా? అందుకే ఈ ట్రావెల్ ఫ్రిజ్. 22 లీటర్ల కెపాసిటీతో రూపొందిన ఈ డివైజ్‌లో కావాల్సిన ఆహారం, కూల్ డ్రింక్స్ వంటివన్నీ నిలువ చేస్తుంది. వాతావరణాన్ని బట్టి కూలర్‌గా, వార్మర్గా పని చేస్తుంది. ఇందులో పండ్లు, కూరగాయలు వంటివి నిలువ ఉంచుకోవడంతో పాటు.. కాఫీ, టీలను వేడిగా కూడా పెట్టుకోవచ్చు. ఇది పవర్ సేవింగ్ మోడ్‌ను కలిగి ఉంటుంది. ఇక ఇంట్లో పవర్ సాకెట్‌కి ఒక అడాప్టర్, కారులో ఒక అడాప్టర్ ఉండటంతో ట్రావెలింగ్‌కి ఇది కంఫర్టబుల్ డివైజ్‌గా నిలుస్తోంది. లాండ్రీ ఫోల్డింగ్ బోర్డ్ బట్టలు ఉతకడం ఆరవేయడం ఒక పనైతే.. వాటిని మడతపెట్టడం మరోపని. అది కూడా టూర్స్‌లో బట్టలు మడతపెట్టడం మహా కష్టం. నిజానికి సరైన పద్ధతితో మడతపెడితే.. ఇస్త్రీ కూడా అవసరం ఉండవు కొన్ని దుస్తులకు. ఈ చిత్రంలోని బోర్డ్.. బట్టల్ని చకచకా మడతపెట్టడానికి సహకరిస్తుంది. పైగా పని కాగానే ఫోల్డ్ చేస్తే.. అల్మరా సొరుగులో లేదా బ్యాగ్‌లో పెట్టుకునేంత చిన్నదిగా మారిపోతుంది. ఇలాంటి బోర్డ్‌ని కూడా క్యాంపింగ్‌లో వెంట పెట్టుకుంటే.. ప్రయాణానికి బయలుదేరినప్పుడు ఎంత చక్కగా బ్యాగ్ సర్దుకున్నామో.. వచ్చేప్పుడు కూడా అంతే నీట్ ప్యాక్‌తో రావచ్చు. బట్టలు ఉతకడం, ఆరబెట్టడమే కాదు.. ఉతికిన దుస్తుల్ని ఇస్త్రీ చేయడానికి మినీ ఐరన్ బాక్స్ ఉంటేబాగుండు అనిపిస్తుంది కదూ? ఉంది. కానీ ఇది ఐరన్ బాక్స్ కాదు, హ్యాండ్‌హెల్డ్ గార్మెంట్ స్టీమర్. చిత్రంలోని ఈ డివైజ్ సులభంగా, శ్రమ లేకుండా నిమిషాల్లో దుస్తుల్ని ప్రెస్ చేస్తుంది. ఇందులోని 70ఎమ్ఎల్ డిటాచబుల్ వాటర్ ట్యాంక్‌లో నీళ్లు నింపుకుంటే.. నిమిషానికి 22 గ్రామ్స్ ఆవిరితో 99.99% బ్యాక్టీరియాను చంపుతుంది. నలిగిన దుస్తుల్ని నిటారుగా తగిలించి, లేదా అడ్డంగా వాల్చి.. స్టీమ్ చేసుకోవచ్చు. 2.5 మీటర్స్ పవర్ కనెక్టర్‌తో రూపొందిన ఈ స్టీమర్‌ని వినియోగించడం చాలా సులభం. ఫోల్డింగ్ బేబీ బెడ్ ప్రయాణాల్లో పిల్లల నిద్రే పిల్ల తల్లులకు పెద్ద సమస్య. తిని, ఆడుకుంటున్నంత సేపు ఎలా అయినా మేనేజ్ చేయొచ్చు కానీ.. నిద్రపోతే మాత్రం వాళ్లకి కంఫర్టబుల్‌గా ఉండాల్సిందే. లేదంటే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అందుకోసమే రూపొందింది ఈ బేబీ బ్యాగ్. హై క్వాలిటీ–లార్జ్ కెపాసిటీ కలిగిన ఈ బ్యాగ్‌ని.. కేవలం పిల్లల వస్తువుల్ని స్టోర్ చేయడానికి ఉపయోగించుకోవడంతో పాటు.. వాళ్లకి నిద్ర వస్తే బెడ్‌లా మార్చుకోవచ్చు. తల భాగంలో ఎత్తు ఉండేలా పిల్లలకు అనుకూలంగా ఈ బ్యాగ్ రూపొందింది. పిల్లలకు కావాల్సిన టవల్స్, దుప్పట్లు, దుస్తులు, పాల డబ్బాలు, వాటర్ బాటిల్స్ అన్నీ ఈ బ్యాగ్‌లోనే పెట్టుకోవచ్చు. స్టాప్ స్లీప్ రింగ్ వాహనం నడుపుతున్నప్పుడు డ్రైవర్ అర సెకన్ రెప్ప వాలిస్తే ఎంత ప్రమాదమో చెప్పనవసరం లేదు. అలా నిద్రపోనివ్వదు ఈ పరికరం. రెండు వేళ్లకు కలిపి దీన్ని పెట్టుకుని, బటన్ ఆన్ చేసుకుంటే చాలు. డ్రైవర్ నిద్రపోయే అవకాశమే లేదు. ఒకవేళ అప్రయత్నంగా నిద్రలోకి జారుకున్నా తట్టి తట్టి లేపుతుంది. ప్రమాదం నుంచి కాపాడుతుంది. ‘ది నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్’ ఈ పరికరాన్ని పరీక్షించి, డ్రైవ్ చేసేవాళ్లు దీన్ని వాడటం సురక్షితమని నిర్ధారించింది. నిద్ర ఆవహించే ఐదు నిమిషాల ముందే ఈ పరికరం కనిపెట్టి.. చేతిని వైబ్రేట్ చేస్తుంది. అందుకు సహకరించే అత్యాధునిక టెక్నాలజీ (స్లీపింగ్ మూడ్‌ని గుర్తించే సెన్సర్) ఇందులో ఉంది. ప్రమాదాన్ని సూచిస్తుంది. ఈ పరికరానికి వేగంగా చార్జింగ్ ఎక్కుతుంది. పైగా అధిక సమయం నిలబడుతుంది. దాంతో దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. నెక్ ఫ్యాన్ వర్షం పడితే తప్ప ఉక్కపోతలకు ఏ కాలమైనా ఒకేలా ఉంటుంది. ఉంటే ఏసీలో ఉండాలి లేదంటే ఫ్యాన్ కింద కూర్చోవాల్సిన పరిస్థితి. ప్రయాణమంతా ఏసీ కారులోనే అయితే బాగానే ఉంటుంది. కానీ లాంగ్ డ్రైవ్‌లో ఎన్నో చోట్ల దిగాల్సి ఉంటుంది. ఎన్నో ప్రదేశాలు చూడాల్సి ఉంటుంది. దిగిన ప్రతిసారి వేడికి అల్లాడిపోవడం తప్పదు. ముఖం జిడ్డు పట్టకుండా ఫ్రెష్‌గా ఉండాలన్నా.. అలసట అనేది తెలియకుండా ఉండాలన్నా ఈ నెక్ ఫ్యాన్ ఒకటి మెడలో వేసుకుంటే సరిపోతుంది. దీనికి రెండు ఫ్యాన్స్ ఉంటాయి. మెడలో వేసుకోగానే రెండు వైపుల నుంచి ముఖానికి చల్లటి గాలి తగులుతుంది. ఆ రెండు ఫ్యాన్స్‌ను.. 360 డిగ్రీల యాంగిల్లో ఫోల్డ్ చేసుకోవచ్చు. దాంతో దీన్ని ఈజీగా హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోవచ్చు. దీని చార్జర్ మొబైల్ కనెక్టర్లా ఉండటం వల్ల.. పవర్ సాకెట్, ల్యాప్‌టాప్, పవర్ బ్యాంక్, కార్ చార్జర్ ఇలా దేనికైనా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్యాన్‌కి మధ్యలో ఉన్న చిన్న క్యాప్ ఓపెన్ చేసుకుని పెర్ఫ్యూమ్ వేసుకుంటే ఆ సుగంధాన్ని ఆస్వాదించవచ్చు. చార్జి్జంగ్ ఎక్కుతున్న సమయంలో రెడ్ లైట్, చార్జింగ్ ఫుల్ అయిన తర్వాత బ్లూ లైట్ వెలుగుతుంటాయి. డ్రైయర్ బ్యాగ్ తడిగా ఉన్న వస్తువుల్ని, దుస్తుల్ని పొడిగా మార్చడం సమయంతో కూడిన పని. క్యాంపింగ్ సమయంలో అంత సమయం ఉండదు. పైగా బయట ప్రయాణాల్లో వైరస్, బ్యాక్టీరియా భయాలూ ఎక్కువే. అందుకు సహకరిస్తుంది ఈ డ్రైయర్ బ్యాగ్. సన్నగా లంచ్ బాక్స్లా కనిపిస్తున్న ఈ డివైజ్‌ని ఓపెన్ చేస్తే చాలా పెద్ద బ్యాగ్‌లా మారిపోతుంది. ఇది వాటర్ ప్రూఫ్ గాడ్జెట్. ఇందులో మొబైల్స్, వాచెస్, కళ్లజోడు, తాళం చెవి, మాస్క్, బేబీ బాటిల్ లేదా బొమ్మలు, బ్రష్‌లను కేవలం 10 నిమిషాల్లో తడి లేకుండా పొడిబారేలా చేయడంతో పాటు.. వాసననూ తొలగిస్తుంది. 99 శాతం బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేస్తుంది. బేబీ క్లాత్స్, అండర్‌వేర్స్, ఇన్నర్ వేర్స్, సాక్స్‌లు, టవల్స్, ఇతర దుస్తులను వేడి గాలిలో ఆర బెడుతుంది. బీచ్‌లో ఆడిన లేదా సిమ్మింగ్ పూల్‌లో తడిచిన బట్టలన్నీ ఈ బ్యాగ్‌లో వేస్తే చాలు. పది నిమిషాల్లో పనైపోతుంది. దీనిలోని హీటింగ్ మోటర్ని బయటికి తీసి కూడా ఉపయోగించొచ్చు. సోఫాలు, పిల్లోస్, బెడ్స్, సింక్స్ వంటివెన్నో తడి లేకుండా పొడిబారేలా చేయొచ్చు. ఇవే కాక.. సుదూర ప్రయాణాలకు ఇంకా ఫోల్డబుల్ వాటర్ బాటిల్స్, నాయిస్ బ్లాకర్ హెడ్ ఫోన్స్ (నిద్రపోయేవారికి), పోర్టబుల్ మినీ మ్యూజిక్ బాక్స్, ఎలక్ట్రిక్ టీ కెటిల్, గ్యాస్ అండ్ చార్కోల్ గ్రిల్.. ఇలా చాలానే లగేజ్‌లో భాగం చేసుకోవచ్చు. ప్రయాణాన్ని సుఖవంతంగా మార్చుకోవచ్చు. ∙సంహిత నిమ్మన ఛదవండి:మైండ్ హెల్త్: పల్లె మహిళే మెరుగు.. -
రైలు ప్రయాణంలో ఎక్కువ లగేజీ తీసుకురావొద్దు!
రైల్వేశాఖ తాజాగా జారీ చేసిన ఓ ప్రకటన ప్రయాణికులను ఆయోమయానికి గురి చేసింది. అంతేకాదు అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన ప్రకటన రైల్వేపై విమర్శలకు తావిచ్చింది. దీంతో అప్రమత్తమైన రైల్వేశాఖ నష్టనివారణ చర్యలకు దిగింది. ఎక్కువ లగేజీ వద్దు ఇటీవల రైల్వేశాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వినూత్న ప్రచారానికి తెర లేపింది. రైలు ప్రయాణంలో అవసరానికి మించి లగేజీ తెచ్చుకోవద్దంటూ సూచించింది. లగేజీ ఎక్కువైతే ప్రయాణంలో ఆనందం ఆవిరవుతుందంటూ వివరించింది. లగేజీ పరిమిత స్థాయికి మించి ఉంటే రైల్వే పార్శిల్ సర్వీసును ఉపయోగించుకోవాలంటూ కోరింది. अगर सामान होगा ज्यादा, तो सफर का आनंद होगा आधा! अधिक सामान ले कर रेल यात्रा ना करें। सामान अधिक होने पर पार्सल कार्यालय जा कर लगेज बुक कराएं। pic.twitter.com/gUuishbqr5 — Ministry of Railways (@RailMinIndia) May 29, 2022 లగేజీకి ఛార్జ్? కేంద్రం ఇప్పటికే ప్రైవేటీకరణ బాట పట్టడం. రైల్వేలో కూడా ప్రైవేటీకరణ మొదలవడంతో తాజా ప్రచారం అనేక సందేహాలకు తావిచ్చింది. దీనికి తోడు కోవిడ్ సమయంలో రద్దు చేసిన పలు రాయితీలు, ప్యాసింజర్ రైళ్లను ఇప్పటికీ రైల్వేశాఖ పునరుద్ధరించ లేదు. దీంతో విమాన సర్వీసుల తరహాలో లగేజీ ఎక్కువగా ఉంటే అదనపు ఛార్జ్ చేస్తారనే అపోహలు ప్రజల్లో ఏర్పాడ్డాయి. రైల్వే ప్రకటనపై పలు మీడియా సంస్థలు కూడా ఇదే తరహాలో వార్తలు ప్రచురించాయి. పాత పద్దతే రైలు ప్రయాణంలో లగేజీకి కూడా ఛార్జ్ వసూలు చేయాలనే ఆలోచన బాగాలేదంటూ రైల్వేపై విమర్శలు పెరిగాయి. దీంతో తమ ప్రచార యత్నం పట్టాలు తప్పిందని రైల్వేశాఖ గ్రహించింది. వెంటనే తామేమీ కొత్త విధానాలను అమలు చేయడం లేదని. గత పదేళ్ల నుంచి అమల్లోఉన్న పద్దతులనే ప్రజలకు తెలియజేశామంటూ మరో వివరణ ఇచ్చింది. News item covered on some social media/digital news platforms that the luggage policy of railways has recently been changed, is incorrect. It is hereby clarified that no change has been made in the recent past and the existing luggage policy is enforced for more than 10 years. — Ministry of Railways (@RailMinIndia) June 6, 2022 చదవండి: ఎవ్వరినీ వదలం.. రాయితీలు ఇవ్వం.. లాభాలే ముఖ్యం -
లగేజీ తక్కువుంటే ధర కూడా తక్కువే
న్యూఢిల్లీ :మీకు ఎక్కువగా లగేజీ లేదా ? చిన్న బ్యాగుతోనే విమానంలో ప్రయాణించాలనుకుం టున్నారా ? అయితే మీ టిక్కెట్ ధర మరింత చౌకగా లభించనుంది. కేవలం కేబిన్ లగేజీ మాత్రమే ఉన్నవారికి దేశీయ విమానాల్లోని టిక్కెట్ ధరల్లో డిస్కౌంట్ ఇవ్వడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం విమాన ప్రయాణికులు కేబిన్ లగేజీ కింద 7 కేజీలు, చెక్ ఇన్ లగేజీ కింద 15 కేజీలు తీసుకువెళ్లవచ్చు. అంతకంటే ఎక్కువ బరువున్న సామాన్లు తీసుకువెళితే అదనపు చార్జీలు ఉంటాయి. అయితే ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రయాణికులు టిక్కెట్ బుకింగ్ సమయంలోనే తాము ఎంత బరువైన లగేజీ తీసుకువెళతారో స్పష్టం చేయాల్సి ఉంటుంది. అప్పుడే తక్కువ లగేజీ ఉన్నవారికి టిక్కెట్ డిస్కౌంట్ ధరకి వస్తుందని తెలిపింది. ప్రత్యేకంగా ఒక సీటు కావాలన్నా, భోజనం, స్నాక్స్, డ్రింక్స్ అడిగినా, మ్యూజిక్ వినాలనుకున్నా విమానయాన సంస్థలు అదనపు చార్జీలను వసూలు చేస్తున్నాయి. ఈ సర్వీసులు అవసరం లేని ప్రయాణికుల వాటిని ఎంచుకోకపోతే టిక్కెట్« ధర తగ్గుతుంది. అదే విధంగా లగేజీ లేకపోతే టిక్కెట్ ధర తక్కువకి వచ్చే సదుపాయాన్ని డీజీసీఏ ప్రయాణికులకు కల్పించింది. విమానయాన సంస్థలను నష్టాల నుంచి బయటపడేయడానికి కేంద్రం విమాన చార్జీలను 10–30శాతం వరకు పెంచాలని నిర్ణయించింది. ప్రయాణికులకు కూడా ఊరట కల్పించడానికి ఈ విధానాన్ని తీసుకువచ్చింది. -
రైళ్లను కబ్జా చేస్తున్న బ్యాగులు!
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో లోపలికి దూరేందుకు స్థలం లభించకపోవడానికి ప్రధాన కారణం ప్రయాణికులు తమ భుజాలకు వేసుకున్న బ్యాగులేనని ఓ రైల్వే అధికారి వెల్లడించారు. భుజానికి వెనక వేలాడుతున్న ఒక్కో బ్యాగు ఒక ప్రయాణికుడి స్థలం ఆక్రమించుకుంటోందని అధ్యయనంలో తేలిందని ఆయన స్పష్టంచేశారు. సుమారు 200 మంది నిలబడే చోట బ్యాగుల కారణంగా వంద మంది నిలబడి ప్రయాణిస్తున్నారని తెలిపారు. దీంతో రద్దీ సమయంలో లోపలికెళ్లేందుకు స్థలం లేక బయటే వేలాడాల్సి వస్తోందని అన్నారు. మరణాలకూ దారితీస్తోంది! లోకల్ రైళ్లలో రద్దీ కారణంగా డోరు దగ్గర వేలాడుతున్న వారిలో ప్రతీ రోజు సగటున ముగ్గురు కింద పడి మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకు కారణం లోపలికేందుకు చోటు లభించకపోవడమే. సాధారణంగా ఒక్కో లోకల్ రైలులో రెండు వేల మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. కానీ, ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ఈ సంఖ్య ఆరు వేల నుంచి ఏడు వేల వరకు ఉంటుంది. నడిచే రైలులోంచి కిందపడి మృతి చెందుతున్న వారి సంఖ్య ఈ సమయంలోనే అధికంగా ఉంటుంది. ప్రయాణికుల భుజాలకు బ్యాగులు వేసుకోవడంవల్ల అదనంగా స్థలం ఆక్రమించుకుంటుందని అధికారులు నిర్ధరణకు వచ్చారు. దీంతో ప్రయాణికులు తమ బ్యాగులు భుజాలకు వేలాడదీయకుండా లగేజీ ర్యాక్‌పై పెట్టాలని తరుచూ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రయాణికుల్లో మార్పు రావడం లేదు. సీట్లపై కూర్చుండేవారు ర్యాక్‌పై బ్యాగులు పెట్టడంవల్ల ర్యాక్‌లు ఫుల్ అవుతున్నాయి. ఇక నిలబడిన ప్రయాణికులు భుజాలపై బ్యాగులు ఉంచుకోక తప్పడం లేదు. దీంతో అదనంగా స్థలం ఆక్రమించుకుంటుంది. సీటు కింద కూడా ఖాళీ స్థలం ఉంటుంది. కానీ, అక్కడ పెట్టడానికి ముఖం చాటేస్తారు. బ్యాగులు భుజాలకు వేసుకోవద్దని, ర్యాక్‌పై పెట్టాలని, సాధ్యమైనంత వరకు చిన్న బ్యాగులు వెంట తెచ్చుకోవాలని తరుచూ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. కానీ, ముంబైకి వివిధ పనుల నిమిత్తం వచ్చే సామాన్య జనాలతోపాటు ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థుల్లో అధిక శాతం దూరప్రాంతాల నుంచి వచ్చేవారుంటారు. రెండున్నర నుంచి మూడున్నర గంటలు ప్రయాణ సమయం పడుతుంది. దీంతో ఆ బ్యాగుల్లో లంచ్ బాక్స్, సాయంత్రానికి అల్పహార బాక్స్, వాటర్ బాటిళ్లు, ల్యాప్‌టాప్, ఇతర కీలకమైన పత్రాలు, వర్షా కాలంలో గొడుగు తదితరాలుంటాయి. దీంతో బ్యాగు వెంట తెచ్చుకోవడం మినహా మరో ప్రత్నామ్నాయ మార్గం లేదు. సెంట్రల్, హార్బర్, పశి్చమ మార్గంలోని లోకల్ రైళ్లలో నిత్యం రాకపోకలు సాగించే వారిలో దాదాపు వంద మందిలో 90 శాతం ప్రయాణికుల వద్ద బ్యాగులుంటాయి. ఈ బ్యాగుల కారణంగా రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ వెంట తీసుకురాక తప్పడం లేదని ప్రయాణికులు అంటున్నారు. దొంగతనాలకు ఆస్కారం.. లోకల్ రైల్వే హద్దులో గడచిన ఆరేళ్లలో ప్రయాణికుల నుంచి రూ.8.28 కోట్లు విలువచేసే సొత్తు చోరీకి గురైందని పోలీస్ రికార్డుల్లో నమోదైన కేసులను బట్టి తెలిసింది. రైల్వే స్టేషన్లు, రైలు బోగీల్లో రద్దీగా ఉంటుండటంతో దొంగలు కూడా చోరీలు సులువుగా చేస్తున్నారు. ప్రయాణికుల భద్రత కోసం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ చోరీ సంఘటనలు చోటుచేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. షకీల్ అహ్మద్ షేక్ అనే సామాజిక కార్యకర్త 2013 నుంచి 2018 కాలం వరకు లోకల్ రైల్వే హద్దులో ఎన్ని చైన్ స్నాచింగ్, చోరీ కేసులు నమోదయ్యాయో వివరాలు వెల్లడించాలని రైల్వే పోలీసులను కోరారు. వారి రికార్డుల్లో నమోదైన కేసుల్లో మొత్తం రూ.8,28,24,860 విలువచేసే సొత్తు చోరీకి గురైందని పోలీసులు వెల్లడించారు. ఆరేళ్లలో మొత్తం 2643 కేసులు నమోదుకాగా అందులో 860 పరిష్కరించారు. అదేవిధంగా రైల్వే పోలీసులు నేరస్తుల నుంచి రూ.3,32,39,921 విలువచేసే సొత్తు రికవరీ చేసుకున్నారు. ప్రయాణికుల భద్రతలో భాగంగా రైల్వే బోర్డు ప్లాట్‌ఫారాలపై, స్టేషన్ ఆవరణలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆరీ్పఎఫ్), గవర్నమెంట్ రైల్వే పోలీసు (జీఆరీ్ప) ఇలా వివిధ పోలీసు దళాలలను మోహరించింది. అయినప్పటికీ నేరాలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. కాగా, రైల్వేలో రద్దీ తగ్గితే దొంగతనాలకు చెక్పడే అవకాశం సైతం ఉంది. డోరువద్ద వేలాడుతు మరణించిన వారి సంఖ్య.. (జనవరి నుంచి జూన్ వరకు) సెంట్రల్ రైల్వే మార్గంలో–202 మృతి చెందగా అందులో 184 పురుషులు, 18 మహిళలున్నారు. పశ్చిమ మార్గంలో–302 మృతి చెందగా 278 మంది పురుషులుండగా 24 మంది మహిళలున్నారు. -
ఇండిగో మరో నిర్వాకం, ప్రయాణికుల గగ్గోలు
సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో మరో నిర్వాకం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులోకి నెట్టింది. ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్‌కు వెళుతున్న ప్రయాణికులకు సంబంధించిన మొత్తం లగేజీని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే వదిలేసి వెళ్లపోయింది. తీరా విమానం ఇస్తాంబుల్‌కు చేరుకున్నాక సామానుకోసం బెల్ట్ దగ్గర ఎదురు చూస్తున్న వారికి ఒక కాగితం వెక్కిరించింది. సామాన్లు మొత్తం లోడ్ చేయలేదు, క్షమించండి అన్న ఆ సందేశాన్ని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా విభ్రాంతికి గురయ్యారు. ఒక్కరు కాదు..ఇద్దరుకాదు..మొత్తం ప్రమాణికుల లగేజీని ఎలా మర్చిపోతారంటూ విస్తుపోయారు. 6ఇ11 విమానంలో ఆదివారం ఈ ఉదంతం వెలుగు చూసింది. దీంతో ఇండిగో తీరుపై ఇంటర్నెట్లో పెద్ద దుమారమే రేగింది. షేమ్ ఆన్ఇండిగో హ్యాష్‌టాగ్ విపరీతంగా ట్రెండవుతోంది. క్షమాపణ నోట్ఫోటోతో పాటు ప్రయాణీకులు తమ భయంకరమైన, అయోమయ పరిస్థితిపై ట్వీటర్ ద్వారా మండిపడుతున్నారు. మా నాన్నకు సుగర్. ఆయనకుఅవసరమైన మందులు అందులో వున్నాయ్..మరికొంతమందికి కనెక్టింగ్ ఫ్లైట్‌కు వెళ్లాలి..వారి పరిస్థితి ఏంటి అంటూ ఒక యూజర్ వాపోయారు. అటు ఈ వ్యవహరంపై నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. ఐశ్వర్య గడ్కరీ మరో ప్రయాణికురాలు ట్వీట్ చేస్తూ.. మూర్ఛవ్యాధితో బాధపడుతున్న సోదరుడికివ్వాల్సిన మందులు లగేజీలో ఉండిపోయాయనీ, సమయానికి ఆ మందు తీసుకోకపోతే...మళ్లీ ఫిట్స్ వచ్చి అతను చనిపోయే అవకాశం కూడా వుందంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇండిగో స్పందించడం లేదని, తక్షణమే సహాయం చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేసింది. దీంతో స్పందించిన ఇండిగో తప్పును సరిదిద్దుకునే పనిలో పడింది. ప్రయాణికుల లగేజీని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయ్నతిస్తున్నామని ట్వీట్ చేసింది. Just flew in on @IndiGo6E flight 6E 11 from Delhi to Istanbul last evening. We received this piece of paper when we were waiting for our luggage at the belt. The airline did not load the luggage of the ENTIRE FLIGHT. Not a single passenger got their luggage (1/n) #shameonindigo pic.twitter.com/7KF2VT0f2O — Chinmay Dabke (@chinmaydabke) September 16, 2019 @narendramodi urgent help landed frm Delhi to Istanbul by indigo flght 6E-11 my brother is epileptic medication was in luggage it has not boarded if he doesn't get it seizures will start may result in death . Please help indigo is not replying — Aishwarya Gadkari (@AishwaryaGadka5) September 16, 2019 Pls investigate in indigo airlines turkey flight# they do not load luggage to save fuel and send next day by turkish Airlines#customers stranded at Istanbul# unethical way of making money#flight 6E11#happening daily@DGCAIndia pic.twitter.com/ljcXebARYo — Starfish On Feni (@blissOnFeni) September 16, 2019 They are doing this for all 6E11 flights. We went through the same ordeal on 14 Sep and we are yet to hear anything other than we will get back. We are with 11 month old kid with all his clothes, food, medicines with Indigo! Shameful @DGCAIndia this is fraud!! We are stranded! — Varun (@guptavarun13) September 16, 2019 -
40 కేజీల లగేజీ తీసుకెళ్లొచ్చు!
దుబాయ్: ఎయిరిండియా సంస్థకు చెందిన విమానాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లే ప్రయాణికులు ఇప్పుడు 40 కేజీల లగేజీని తమ వెంట తీసుకెళ్లొచ్చు. బ్యాగేజీ పరిమితిని ఎయిరిండియా మరో 10 కేజీలు పెంచడంతో 40 కేజీల వరకు తీసుకెళ్లే వెసులుబాటు కలిగింది. టికెట్లు బుక్ చేసుకున్న వారికి కూడా లగేజీ పరిమితి పెంపు వర్తిస్తుందని ఎయిరిండియా చైర్మన్, సీఎండీ అశ్విని లొహానీ వెల్లడించారు. సాధారణంగా ప్రయాణికుడి వెంట ఉంచుకుని తీసుకెళ్లే 7 కేజీల లగేజీకి అదనంగా 40 కేజీలు విమానంలో తీసుకెళ్లే అవకాశం కలగనుంది. ఇండోర్–దుబాయ్, కోలకతా–దుబాయ్ విమాన సేవల ప్రారంభం సందర్భంగా దుబాయ్‌లోని ఇండియా క్లబ్లో నీలగిరి ట్రేడింగ్ కంపెనీ సీఈవో చంద్రశేఖర్ భాటియా అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అశ్విని లొహానీ మాట్లాడుతూ.. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు బ్యాగేజీ పరిమితిని పెంచినట్టు వెల్లడించారు. ఈ నిర్ణయంపై విమాన ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘బ్యాగేజీ పరిమితిని 30 నుంచి 40 కేజీల పెంచడం చాలా సంతోషంగా ఉంది. విమానాశ్రయంలో ప్రతిసారి అధికంగా ఉన్న లగేజీ తీసేస్తుంటే ఎంతో బాధ కలిగేది. సాధారణంగా విదేశాల్లో ఉండేవారు. రెండుమూడేళ్లకు ఒకసారి స్వదేశానికి వస్తుంటారు కాబట్టి వెళ్లేటప్పుడు బ్యాగేజీ కాస్త ఎక్కువగానే ఉంటుంది. నా వరకు చూస్తే దుబాయ్ నుంచి వెళ్లేటప్పుడు ఇక నుంచి ఎక్కువ డ్రైఫ్రూట్స్ తీసుకెళ్తాను. వచ్చేటప్పుడు మా అమ్మ చేసిన స్వీట్లు ఈసారి ఎక్కువగా తెచ్చుకుంటాన’ని ముంబైకి చెందిన అతిథి చందన్ అన్నారు. -
దేశీయ విమానాల బ్యాగేజీకి ఛార్జీల మోత
-
రైళ్లలోనూ లగేజి చార్జీలు!
న్యూఢిల్లీ: విమానాల్లోలాగే రైళ్లలోనూ అదనపు లగేజీకి అదనంగా చార్జ్ చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. అడ్డూఅదుపు లేకుండా కంపార్ట్ మెంట్లను సామానుతో నింపేస్తుండడంతో, ప్రయాణి కుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మూడు దశాబ్దాలుగా ఉన్న నిబంధనలను ఇకపై కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. దీనిప్రకారం పరిమితికి మించి లగేజీ కలిగిఉన్న ప్రయాణికులు ఆరు రెట్లు ఎక్కువగా జరిమానా చెల్లించాల్సి రావచ్చని ఓ రైల్వే అధికారి తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం స్లీపర్ క్లాస్, లేదా రెండవ తరగతి ప్రయాణికుడు 40 కేజీల వరకు రుసుము చెల్లించకుండా తమతోపాటే లగేజీ తీసుకెళ్లవచ్చు. అంతకుమించితే 80 కిలోల వరకు తగిన రుసుము చెల్లించాలి. అయితే అదనపు లగేజీని సంబంధిత లగేజీ వ్యాగన్లోనే పెట్టాల్సి ఉంటుంది. ‘ఈ నిబంధనలు ఎప్పటినుంచో ఉన్నవే... పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాం. లగేజీకి సరిపడ రుసుము చెల్లించకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తే ఆరు రెట్లు జరిమానా విధించే అవకాశం ఉంది’ అని రైల్వే శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ వేదప్రకాశ్ చెప్పారు. ‘ఉదాహరణకు ఒక ప్రయాణికుడు 80 కిలోల లగేజీతో 500 కి.మీ. ప్రయాణిస్తే.. 40 కిలోల వరకు చార్జీ ఉండదు. అదనపు 40 కిలోల లగేజీకోసం రూ.109 చెల్లిస్తే సరిపోతుంది. తనిఖీలలో అదనపు లగేజీతో పట్టుబడితే రూ.654 జరిమానా చెల్లించాలి. ఏసీ ఫస్ట్‌క్లాస్ ప్రయాణికులు 70 కిలోల వరకు ఉచితంగా లగేజీ తీసుకెళ్లొచ్చు. 150 కిలోల లగేజీ ఉంటే మిగిలిన 80 కిలోలకు చెల్లించాలి. ఏసీ టూ టైర్ ప్రయాణీకులకు 50 కిలోల వరకు చార్జీ ఉండదు. ప్రయాణీకుల సూట్‌కేసులు, ట్రంకు పెట్టెలకు నిర్ణీత పరిమాణాన్ని సూచిస్తున్నాం’ అని వేదప్రకాశ్ చెప్పారు. -
రైల్వే షాక్.. అదనపు లగేజ్ పై ఇక బాదుడే
న్యూఢిలీ : భారత రైల్వే సంస్థ ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ప్రయాణికుల లగేజ్‌పై చూసిచుడనట్టు వ్యవహరించిన రైల్వేశాఖ ఇకపై భారాన్ని మోపనుంది. ఇందులో భాగంగా 30 ఏళ్ల నుంచి వస్తున్న లగేజ్ నిబంధనల స్థానంలో కొత్తవి తీసుకువచ్చింది. కొంతమంది పరిమితికి మించి లగేజ్‌తో ప్రయాణిస్తున్నారని తోటివారి నుంచి భారీగా ఫిర్యాదులు రావడంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొత్త నిబంధనలు : ప్రయాణం లగేజ్ పరిమితి(కేజీలలో) రుసుంతో లగేజ్ పరిమితి(కేజీలలో) స్లిపర్ క్లాస్ 40 80 సెకండ్ క్లాస్ 35 70 ఏసీ టూ టైర్ 50 100 ఏసీ ఫస్ట్ క్లాస్ 70 150 పరిమితి కన్నా ఎక్కువగా లగేజ్ ఉన్నట్టయితే పార్సిల్ కౌంటర్లో రుసుం చెల్లించి.. లగేజ్‌వ్యాన్‌లో అదనపు లగేజ్‌ని ఉంచాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నిబంధనలు ఉన్నాయని.. వాటిని కఠినంగా అమలు చేయడమే తర్వాయి అని రైల్వే అధికారులు పేర్కొన్నారు. అదనపు లగేజ్‌కు రుసుం చెల్లించకుండా పట్టుబడితే.. ఆ మొత్తానికి వసూలు చేసే రుసుంపై ఆరు రెట్లు జరిమానా విధించనున్నట్టు తెలిపారు. -
మూటలు మోస్తూ.. పాఠాలు వింటూ!
న్యూఢిల్లీ: ఇతర కూలీల మాదిరిగానే తానూ మూటలు మోస్తాడు. చెవిలో ఉన్న ఇయర్ ఫోన్లను చూసి అతను పాటలు వింటున్నాడని అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న అతను స్టడీ మెటీరియల్‌ను వింటుంటాడు. అందుకోసం రైల్వే స్టేషన్లో అందుబాటులో ఉన్న ఉచిత వైఫై సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. కేరళలోని ఎర్నాకులం రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేస్తున్న కె.శ్రీనాథ్ గురించే ఈ ఉపోద్ఘాతమంతా. సహచర కూలీలకు భిన్నంగా శ్రీనాథ్ ఓ వైపు లగేజీని బ్యాలెన్స్ చేస్తూనే మొబైల్ ఫోన్ లో పాఠాలను నేర్చుకుంటున్నాడు. అంటే పని చేస్తూనే నేర్చుకుంటున్నాడన్న మాట. 20 – 40 ఎంబీపీఎస్ స్పీడు కలిగిన ఉచిత వైఫై సాయంతో తాను మెటీరియల్‌ను డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు, ఆన్లైన్ పరీక్షలూ రాస్తూ ఉంటా నని చెబుతున్నాడు. హైస్కూల్ వరకే చదివిన శ్రీనాథ్ ఇప్పటికే కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఓ రాత పరీక్షలో అర్హత సాధించాడు. -
రైల్వే ప్రయాణీకులపై ఆ చార్జీల బాదుడు: ప్రతీ ఏడాది
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులపై త్వరలో చార్జీల భారం పడనుంది. రైల్వే స్టేషనల్లో ప్రయాణికుల సామానులను, బ్యాగులకు ఉంచుకునేందుకు అందుబాటులో ఉన్న క్లాక్ రూమ్స్, లాకర్ చార్జీలను పెంచాలని రైల్వే బోర్డు సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ చార్జీల పెంపుపై డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం క్లాక్‌రూమ్, లాకర్ సేవలను ఆధునికీకరించడంతోపాటు కంప్యూటరైజ్డ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు త్వరలో బిడ్లను ఆహ్వానించనుది. ఇలా బిడ్లను దక్కించుకున్న వారు ప్రతి ఏడాది ఈ రేట్లను పెంచడానికి వీరికి అనుమతినివ్వనుంది. అధిక పర్యాటక కేంద్రాలు, డిమాండ్ బాగా ఉన్న కొన్ని స్టేషన్లలో ఈ ఛార్జీ ఎంత వసూలు చేయాలనేది సంబంధిత అధికారి నిర్ణయిస్తారని సీనియర్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు. తాజా నిర్ణయం ప్రకారం రైల్వే ప్రయాణికులు 24గంటల వరకు లాకర్‌ను వినియోగించుకుంటే ఇకపై రూ. 20 వసూలు చేయనుంది. ఇప్పటి వరకు లాకర్‌ను 24 గంటలపాటు వాడుకుంటే రూ.15 వసూలు చేస్తోంది. అదనంగా మరో 24 గంటలు వాడుకుంటే వినియోగదారుడు రూ.30 చార్జ్ చెల్లించాలి. ఇక క్లాక్ రూమ్ రెంట్ ను 24 గంటలకు రూ.15గా నిర్ణయించారు. 2000వ సంవత్సరంలో ఇది ఏడు రూపాయలు ఉండగా అదనంగా మరో 24 గంటలు వాడుకుంటే 20 వసూలు చేసేవారు. అయితే 2013లో వీటిని సవరించి తొలి 24 గంటలకు రూ. 10 తర్వాతి 24 గంటలకు రూ.15లుగా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఎలా కొట్టేశాడో చూడండి!
విమానాశ్రయంలో తమ సామాగ్రిని కన్వేయర్ బెల్ట్ మీద విడిచిపెట్టిన తర్వాత విమానం ఎక్కడానికి ప్రయాణికులు వెళుతుంటారు. అయితే విమాన ప్రయాణికులు తమ సామాగ్రి విషయంలో పునరాలోచించుకోవాల్సిందే. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బిరేన్ సింగ్ ట్విటర్లో షేర్ చేసిన మూడు వీడియోలను చూస్తే అందరూ ఇదే మాట అంటారు. థాయలాండ్లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్‌కు వెళ్లాల్సిన జెట్‌స్టార్ విమానంలో సామాగ్రిని తరలించే ఉద్యోగి చేతివాటం ఈ వీడియోల్లో రికార్డైంది. ఇది బయటకు రావడంతో థర్డ్‌పార్టీ కంపెనీకి చెందిన 27 ఏళ్ల ఉద్యోగిని థాయ్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బ్లుటూత్ స్పీకర్ దొంగిలించినట్టు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయాల్లో జరుగుతున్న దొంగతనాలను నివారించేందుకు జరిపిన రహస్య శోధనలో భాగంగా వీడియోలు చిత్రీకరించినట్టు సమాచారం. అయితే నిందితుడు తాళాలు పగులగొట్టి దొంగతనం చేశాడా, లేదా అనేది స్పష్టం కాలేదు. Our luggage in the flights are save or not pls see .@Shubhrastha @RajatSethi86 @RepubIicofIndia pic.twitter.com/7yBvEYnKBt — N Biren Singh (@NBirenSingh) 16 October 2017 Our luggage in the flights are safe or not pls see . pic.twitter.com/hIc5irvPba — N Biren Singh (@NBirenSingh) 16 October 2017 Our luggage in the flights are safe or not ? Pls see @Shubhrastha @RajatSethi86 @RepubIicofIndia @NeliveIn pic.twitter.com/YfOQIUgjNM — N Biren Singh (@NBirenSingh) 16 October 2017 -
ప్రమాదం ముంచుకొస్తుంటే లగేజీల గొడవెందుకు?
దుబాయ్: దూకండి... దూకండి... బయటకు దూకండి! లగేజీని వదిలేయండి...ముందు మీరు బయటపడండి, బయటకు జారిపోండి! తిరువనంతపురం నుంచి దూబాయ్‌కి చేరుకున్న ఎమిరేట్స్ విమానం బుధవారం విమానాశ్రయంలో క్రాష్ ల్యాండ్ అయినప్పుడు ఫ్లైట్ అటెండెంట్ ప్రయాణికులను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు ఇవి. ఓ పక్క ప్రమాదం ముంచుకొస్తున్నా ప్రయాణికులు మాత్రం తమ లగేజీలను వెంట తీసుకెళ్లేందుకే ప్రయత్నించిన విషయం తెల్సిందే. కొంత మంది తమ ఖరీదైన లాప్టాప్ల గురించి వెతుక్కోవడం కూడా ఓ వీడియో ఫుటేజ్‌లో కనిపించింది. ఇలాంటి విపత్కర సమయాల్లో 90 సెకండ్లలో విమానం నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించడం విమానం సిబ్బంది బాధ్యత. ఎందుకు ఇలా 90 సెకండ్లలోనే ఖాళీ చేయించాల్సి ఉంటుందంటే. ఆ తర్వాత విమానంలో మంటలు తీవ్రమవుతాయనే విషయాన్ని పలు అధ్యయనాల ద్వారా వెల్లడైనట్లు వైమానిక నిపుణుడు ఆశ్లీ న్యూన్స్ తెలిపారు. అందుకనే ఎమిరేట్స్ విమాన సిబ్బంది నిర్దేశిత సమయంలో ప్రయాణికులను ఖాళీ చేయించేందుకు అవసరమైన హెచ్చరికలు చేస్తూ వచ్చారు. చివరకు తమ లగేజీలను తీసుకొని ప్రయాణికులు విమానాన్ని ఖాళీ చేశారు. అందుకు నిమిషంపైనే పట్టింది. రన్‌వేపై జారిపోతున్న విమానం ఇంజన్ నుంచి మంటలు చెలరేగడం కూడా 1.23 సెకండ్ల వీడియో ఫుటేజ్‌లో కనిపించింది. అంటే అర నిమిషం లేటైనా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలేసేవే. ఇలా ప్రాణం మీదకు వచ్చినప్పుడు కూడా మానవులు తమ బ్యాగ్‌లు, లాప్‌ట్యాప్‌లు, పాస్‌పోర్టులు, పర్సులు, ఇంటి తాళం చేతుల కోసం ఎందుకు వెతుకుతారు? ప్రాణంకన్నా వస్తువులపై మమకారం ఎక్కువా? ఒక్క ఎమిరేట్స్ విమానం విషయంలోనే ఇది జరగలేదు. గతేడాది సెప్టెంబర్ నెలలో బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన విమానం లాస్ వెగాస్ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు కూడా ప్రయాణికులు ఇలాగే వ్యవహరించారు. 2013, జూలై నెలలో ఆసియాన విమానం శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో క్రాష్ ల్యాండింగ్‌కు గురైనప్పుడు కూడా ప్రయాణికులు తమ లగేజ్ల కోసం ఇలాగే వెంపర్లాడడం కనిపించింది. మానవుడి నైజమే ఇంత! అని ఒక్కమాటలో సమాధానం చెప్పవచ్చునేమోగానీ ఈ విషయంలో మానవ మేథస్సుపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితులను కంప్యూటర్ ద్వారా విశ్లేషించడం సాధ్యం కాదు. ఎందుకంటే జీవన్మరణ సమస్యను అందులో సృష్టించలేం. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఎమిరేట్స్ విమానం ఫుటేజ్ వైమానిక సిబ్బంది ‘సేఫ్టీ డ్రిల్స్’కు ఎంతో ఉపయోగపడగలదు. ఇక ముందు ప్రయాణికులకు కూడా ఎలాంటి శిక్షణ ఇవ్వాలో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. -
ప్రమాదం ముంచుకొస్తుంటే లగేజీల గొడవెందుకు?
-
లగేజ్ బాధ లేకుండా ప్రయాణం..
పర్సనల్ లగేజ్.. ప్రయాణంలో తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిన ఈ బరువును మోయడానికి లేదా లాక్కెళ్లడానికి(వీల్స్ బ్యాగ్) జనం నానా ఇబ్బందులు పడుతుంటారు. బస్లాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు.. ఒక్కసారి పరిశీలనగా చూస్తే మనతో సహా అందరూ లగేజ్ బాధితుల్లాగే అనిపిస్తారు. చిన్న ఐడియా జీవితాన్ని మార్చేస్తుందన్నట్లు.. లగేజ్ బ్యాగ్ లకు చక్రాలు, హ్యాండిల్స్ బిగింపుతో ప్రయాణం కొద్దిగా సౌకర్యవంతంగా మారినా.. ఇంకా ఏదో లోటు..! ఆ లోటును పూడ్చగలిగిన అతి చిన్న వస్తువే ఈ 'మై హిచ్' ఏడెనిమిది అంగుళాల పొడవుండే ఈ ప్లాస్టిక్ కొక్కేన్ని ప్యాంట్ లోకి జొప్పించి, రెండో కొక్కేనికి బ్యాగ్ తగిలించుకొని మొబైల్ వినియోగించుకుంటూ హాయిగా నడవొచ్చు. మియామి(అమెరికా)కి చెందిన రాబర్ట్ లియాన్ అనే వ్యక్తి రూపొందించిన ఈ మై హిచ్ ధర కేవలం 18 డాలర్లు. -
సిటీలో సచిన్
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిటీకి వచ్చిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో సందడి చేశారు. లగేజీని ఆయనే స్వయంగా కారులో సర్దుకున్నారు. ఈ సమయంలో సచిన్‌తో ఫొటోలు దిగేందుకు అభిమానులు, ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎగబడ్డారు. - శంషాబాద్ -
విమానాశ్రయంలో హీరోయిన్ సూట్‌కేస్ చోరీ
జైపూర్: బాలీవుడ్ నటి, 'అతిథి' హీరోయిన్ అమృతారావు విలువైన సూట్‌కేస్ జైపూర్ విమానాశ్రయంలో చోరికి గురైంది. ఒక నగల యాడ్ షూటింగ్ నిమిత్తం ఆమె పింక్ సిటీకి వచ్చింది. ఈ క్రమంలో తాను తెచ్చుకున్న మూడు లగేజీ బ్యాగ్స్‌లో ఒకటి మిస్సయిన విషయాన్ని గమనించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో సుమారు లక్ష రూపాయల విలువైన వస్తువులున్నాయని తెలిపింది. మరోవైపు తమ విమానాశ్రయంలో ఇలాంటి సంఘటన ఇంతకుముందు జరగలేని ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పారు. తమ సిబ్బంది చాలా సిన్సియర్‌గా, జాగ్రత్తగా విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. దీనిపై త్వరిత గతిన విచారణ జరిపి పోయిన సూట్ కేసును ఆమెకు అందజేస్తామన్నారు. మరోవైపు పింక్ సిటీ లో షూటింగ్ అంటూ చాలా ఉత్సాహంగా ఉందని అమృతారావు పేర్కొంది. పెద్ద నగరాల్లో ఇలాంటి చిన్న చిన్న ఘటనలు మామూలేనని, విమానాశ్రయ అధికారులు తన సూట్ కేసును తిరిగి అందజేస్తారన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేసింది. తెలుగులో మహేశ్ బాబు సరసన 'అతిథి' సినిమాలో అమృత నటించిన సంగతి తెలిసిందే. -
తిరుమలలో భక్తుల ఆందోళన
రోడ్డుపై బైఠాయించి ధర్నా సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చిన భక్తులు శుక్రవారం తిరుమలలో ఆందోళనకు పూనుకున్నారు. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో ఉదయం 7 గంటలకు తమ లగేజీ డిపాజిట్ చేసినా సాయంత్రం వరకు తిరుమలకు చేరలేదని ఆరోపిస్తూ భక్తులు ఇక్కడి జీఎన్సీ టోల్గేట్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని భక్తులను పక్కకు లాగేశారు. దీంతో భక్తులకు, భద్రతా సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. తమ లగేజీ ఇవ్వకపోగా భద్రతా సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని భక్తులు ఆరోపించారు. భక్తుల ఆందోళనతో అరగంటపాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. -
కూలీ నెం.15
ఆడపిల్లలు ఇలాగే ఉండాలి! ఈ పనులే చేయాలి! తరతరాలుగా ఈ మాటలు వింటూనే ఉన్నాం. ఆ ప్రకారం నడచుకుంటూనే ఉన్నాం. కానీ తరం మారింది. అవసరాలు మారుతున్నాయి. మరి ఆలోచనలూ మారాలి కదా! ఇదే ప్రశ్న వేసుకుంది మంజూదేవి. అనుకోకుండా జరిగిన ఓ సంఘటన తన జీవితాన్ని అల్లకల్లోలం చేస్తే... తప్పనిసరి పరిస్థితుల్లో సాహసోపేతమైన ఓ అడుగు వేసింది. ఏ మహిళా చేయని, చేయడానికి సాహసించని వృత్తిలో అడుగుపెట్టింది. దానిని సమర్థంగా నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఎంతోమందికి ప్రేరణగా, స్ఫూర్తిగా నిలుస్తోంది! మంజూదేవికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. తన సంపాదనతో వాళ్లని చదివిస్తోంది. ఆమె అంటుంది... ‘ఎవరో ఆదుకోవాలని ఎదురు చూడటం కంటే... గౌరవంగా మనకు తోచిన పని మనం చేసుకోవడం ఉత్తమం’ అని! జైపూర్ రైల్వేస్టేషన్‌కి వెళ్లినవాళ్లకు ఓ అరుదైన దృశ్యం కనబడుతుంది. ఎర్రటి చొక్కాలు వేసుకుని, బ్యాడ్జిలు పెట్టుకుని, వరుసగా ఉన్న కూలీల మధ్య ఓ యువతి కనిపిస్తుంది. ఆమె వేసుకున్న దుస్తులు ఆమె కూడా రైల్వే కూలీ అన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నా... నమ్మడానికి మాత్రం మన కళ్లు, మనసు ససేమిరా అంటాయి. ఎందుకంటే... కూలీ అంటే మనకు తెలిసి మగవాళ్లే. రైల్వేస్టేషన్లో, బస్టాపుల్లో లగేజీలు మోసేది వాళ్లే. అలాంటిది ఓ ఆడమనిషి ఆ పని చేస్తోందంటే ఆశ్చర్యం వేయక మానదు. పాపం ఎంత కష్టం వచ్చిందో అని జాలి వేయకా మానదు. నిజమే... ఆమెకి చాలా పెద్ద కష్టం వచ్చింది. అందుకే మహిళలు కలలో కూడా ఊహించని ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. సున్నితమైన చేతులతో బరువులు ఎత్తాల్సి వస్తోంది. ఆమె పేరు మంజూదేవి. జైపూర్‌లోనే కాదు... నార్త్ వెస్టర్న్ రైల్వేస్‌లోనే మొట్టమొదటి మహిళా కూలీ! విధిరాతకు తలవంచి... జైపూర్‌లోని సుందర్పురాలో భర్త, ముగ్గురు పిల్లలతో జీవించేది ముప్ఫై నాలుగేళ్ల మంజూదేవి. పూలపానుపు లాంటి జీవితం కాకపోయినా... కడుపు నిండా తిండి, కట్టుకోవడానికి బట్టకు లోటు లేదు. ఉన్నదానితో తృప్తిపడే తత్వం ఆమెని ఏనాడూ దిగులు పడనివ్వనూ లేదు. మంజు భర్త మహదేవ్ జైపూర్ రైల్వేస్టేషన్లో కూలీ. సరిపడానే సంపాదించేవాడు. దాంతో కుటుంబం బాగానే గడిచిపోయేది. అయితే విధి వక్రించడంతో వారి జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. మహదేవ్ కాలేయ వ్యాధితో హఠాత్తుగా కన్నుమూశాడు. దాంతో బతుకంతా అంధకారమైపోయింది మంజుకి. సంపాదించే భర్త లేడు. తనకేమో సంపాదించే మార్గాలే తెలియదు. పిల్లలదేమో పరిస్థితులు అర్థం చేసుకునే వయసు కాదు. ఇప్పుడేం చేయాలి? తనలో తనే కుమిలిపోయింది. అప్పుడే ఆమెకు ఎవరో సలహా ఇచ్చారు... మీ ఆయన పని నీకిస్తారేమో అడుగు అని! ప్రాణం లేచొచ్చింది మంజుకి. భవిష్యత్తు మీద చిన్న ఆశ చిగురించింది. తన భర్త స్నేహితులతో కలిసి పోర్టర్ యూనియన్ని సంప్రదించింది. వారి సాయంతో ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంది. మంజుకి ఉద్యోగమివ్వడానికి వారికి పెద్ద అభ్యంతరాలేమీ కనిపించలేదు. దాంతో భర్త స్థానం మంజుకి దక్కింది. అతడు ధరించిన బ్యాడ్జి ఆమె చేతిమీదికి చేరింది. దానిమీద రాసివున్న ‘పోర్టర్ నంబర్ 15’ అన్న అక్షరాలు చూసినప్పుడల్లా... భర్త జ్ఞాపకం వచ్చి కళ్లు చెమ్మగిల్లుతాయి మంజుకి. ‘నా భర్త ఈ రూపంలో నాకు అండగా ఉన్నాడు’ అంటుంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో! అయితే తొలినాళ్లలో ఆమె పని చేసినదాని కంటే ఏడుస్తూ గడిపిందే ఎక్కువ. అంతమంది మగవారి మధ్య కూర్చోవడం, తన వంతు కోసం ఎదురు చూడటం నరకంలా అనిపించేదామెకి. పైగా అందరూ తనని వింతగా చూస్తుంటే సిగ్గుతో చితికిపోయేది. దుఃఖాన్ని అదిమిపెట్టుకుని మౌనంగా చూస్తూ ఉండేది. సాయంత్రం ఇంటికి వెళ్లాక వెక్కి వెక్కి ఏడ్చేది. అలా చాలా రోజులు గడిపింది. అయితే ఓసారి మంజుని చూడటానికి వచ్చిన ఆమె తల్లి ఓ మాట చెప్పింది. ‘‘ఒక పని చేయడానికి సిద్ధపడిన తర్వాత దానిలోని మంచి చెడులను ఎదుర్కోవడానికీ సిద్ధపడాలి. విధి నీకు అన్యాయం చేసింది. నువ్వు నీ పిల్లలకు అన్యాయం చేయకు’ అని. ఆ మాటలు మంజుని ఆలోచింపజేశాయి. ఆ క్షణమే నిర్ణయించుకుంది... తన పిల్లలను పెంచుకోవడానికి దొరికిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని! మగవారికి దీటుగా... కూలీగా పని చేయాలనుకోవడం సులభమే. కానీ చేయడం మాత్రం చాలా కష్టం. ఆ సంగతి పనిలో చేరిన కొన్ని రోజులకే తెలిసివచ్చింది మంజుకి. చిన్న చిన్న సూట్‌కేసులు కూడా ఎత్తలేక తూలిపోయేది. ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు వాటిని చక్రాలబండి మీద వేసి లాక్కెళ్లడానికి కూడా ఆమె బలం సరి పోయేది కాదు. ఆమె అవస్థ చూడలేక ఒక్కోసారి తోటి కూలీలు వచ్చి సహకరించేవారు. అది ఆమెకు చాలా సంతోషమనిపించేది. వారితో పని చేయడానికి తనే అనవసరంగా మొహమాటపడుతున్నాను, వాళ్లు మంచి మనసున్నవాళ్లు అని అర్థం చేసుకుంది. ‘అన్నా..’ అంటూ అందరితో స్నేహంగా ఉండటం మొదలుపెట్టింది. పని సులభంగా చేసే మెళకువల్ని వాళ్ల దగ్గర నేర్చుకుంది. ఆ వాతావరణానికి అలవాటు పడింది. వారికి దీటుగా పనిచేసే స్థితికి చేరుకుంది. ఇప్పుడు జైపూర్ రైల్వేస్టేషన్‌కి మంజు ఓ పెద్ద అట్రాక్షన్. ఆమె అంటే అక్కడి కూలీలకే కాదు, దుకాణదారులకి కూడా చాలా ఇష్టం, గౌరవం. అందరూ బెహన్ (సోదరి) అంటూ ప్రేమగా మాట్లాడుతుంటారు ఆమెతో. అయితే ఇప్పటికీ కొందరు ప్రయాణికులు మాత్రం ఆడమనిషి పోర్టరేంటి అని ముఖమ్మీదే జోకులేస్తుంటారు. నువ్వేం మోయగలవు అంటుంటారు. అలాంటప్పుడు ఏమీ మాట్లాడదు మంజు. నవ్వుతూ తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడర్థమయ్యిందా చేయగలనో లేదో అన్నట్టుగా చూస్తుంది. నిజమే... చేయాలి అనుకోవాలేగానీ చేయలేనిది ఏదీ లేదు. పనికి పురుషుడు, స్త్రీ అన్న తేడా లేదు. శారీరక బలానికి ఆత్మబలం తోడైతే... మనల్ని ఆపగలిగే శక్తి దేనికీ ఉండదు. ఆ విషయాన్ని మంజు నిరూపించి చూపించింది! - సమీర నేలపూడి -
ఎటు తిప్పినా సులువుగా... 360 డిగ్రీలు
ట్రావెల్ గేర్ ప్రయాణాలలో లగేజీ అత్యంత ప్రధానమైనది. అవసరమైనవి పదిలపరుచుకునేందుకు ఎన్నో ట్రావెల్ బ్యాగ్‌లు, సూట్‌కేసులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వీల్ బ్యాగ్‌లు/సూట్‌కేసులు. ఒకవైపు మాత్రమే కాకుండా 360 డిగ్రీల కోణంలో ఎటువైపు తిప్పినా సులువుగా తిరుగుతూ, వెంట తీసుకెళ్లడానికి అనువుగా ఉన్నాయి ఈ బ్యాగ్/సూట్‌కేస్‌లు. ఫ్రంట్, ఇన్నర్ సెపరేషన్స్, నెంబర్లాక్ సిస్టమ్, పటిష్టమైన చక్రాలు వీటి ప్రత్యేకత. సామ్సోనైట్, అమెరికన్ టూరిస్టర్ వంటి బ్రాండెడ్ కంపెనీలలో 25 కేజీల సామర్థ్యం గల ఈ ట్రావెల్ సూట్‌కేస్ ధరలు సుమారు రూ.6 వేల నుంచి 12 వేల రూపాయల వరకు ఉన్నాయి. కొన్నిచోట్ల 30 శాతం డిస్కౌంట్ ధరలలో ఇవి లభిస్తున్నాయి. -
'సీఎం లగేజీ సర్దుకోవాల్సిన సమయం వచ్చింది'