సిద్ధార్థ్‌ ప్రేయసికి చేదు అనుభవం.. ఏకంగా ఆరుగంటలకు పైగా! | Aditi Rao Hydari Calls Heathrow Airport Worst Not Receiving Luggage For 6 Hours | Sakshi
Sakshi News home page

Aditi Rao Hydari: ఆదితిరావుకు చేదు అనుభవం.. ఇంత చెత్తగానా?

Jun 26 2024 5:20 PM | Updated on Jun 26 2024 5:25 PM

Aditi Rao Hydari Calls Heathrow Airport Worst Not Receiving Luggage For 6 Hours

ఇటీవలే హీరామండి ది డైమండ్ బజార్‌ వెబ్‌ సిరీస్‌తో అభిమానులను మెప్పించిన బ్యూటీ ఆదితి రావు హైదరీ. బాలీవుడ్ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ తెరెకెక్కించిన ఈ సిరీస్‌కు విశేషమైన స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.  అయితే ఈ ముద్దుగుమ్మ ఈనెల 23న ముంబయిలో జరిగిన సోనాక్షి సిన్హా పెళ్లికి హాజరయ్యాడు. తనకు కాబోయే భర్త సిద్దార్థ్‌తో కలిసి రిసెప్షన్‌లో పాల్గొన్నారు.

అయితే తాజాగా ఆదితి రావు హైదరీకి ఇంగ్లాండ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆ దేశంలోని హీత్రో ఎయిర్‌పోర్ట్‌లో లగేజీ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. తన లగేజీ కోసం ఆరు గంటలకు పైగా  విమానాశ్రయంలో  వేచి ఉండాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇదొక 'చెత్త ఎయిర్‌పోర్ట్‌ అని కామెంట్ చేసింది. అక్కడి ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది తనకు సాయం చేయకుండా.. లగేజీ కోసం ఎయిర్‌లైన్‌ సంస్థను సంప్రదించమని  సలహా ఇచ్చారని వివరించింది. దాదాపు ఆరు గంటల తర్వాత కూడా తన లగేజీ అందలేదని అదితి వెల్లడించింది.

కాగా.. ఆదితి రావు హైదరీ ఢిల్లీ- 6 మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. సోనమ్ కపూర్, అభిషేక్ బచ్చన్‌ నటించిన ఈ చిత్రంలో సహాయక పాత్రలో కనిపించింది. ఆ తరువాత లండన్, పారిస్, న్యూయార్క్, మర్డర్ 3, వజీర్, పద్మావత్ లాంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం ఆదితి లయనెస్, గాంధీ టాక్స్ చిత్రాలలో కనిపించనుంది. అయితే వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు ఈ ఏడాది హీరో సిద్ధార్థ్‌తో ఆదితిరావు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement