లగేజీ రుసుము వివాదం.. వదిలేసి విమానం ఎ‍క్కిన విద్యార్థి.. ట్విస్ట్‌ ఏంటంటే!

Bangalore: Student Left Luggage In Airport For High Cloak Room Fees - Sakshi

బెంగళూరు (దొడ్డబళ్లాపురం): లగేజీకి విధించిన అధిక రుసుము చెల్లించలేని ఒక విద్యార్థి వాటిని ఎయిర్‌పోర్టులోనే వదిలి మలేషియాకు వెళ్లిపోయిన సంఘటన కెంపేగౌడ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. బెళగావికి చెందిన సూరజ్‌ పాటిల్‌ అనే ఈ విద్యార్థి బెంగళూరు నుంచి మలేషియాకు వెళ్లాల్సి ఉంది. అక్కడ అతడు ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు.

ఎయిర్‌ ఏషియా వెబ్‌సైట్లో ప్రతి కేజీ అదనపు లగేజీకి రూ.500 రుసుము వసూలు చేస్తామని పేర్కొన్నారు. కానీ ఆ సంస్థ గ్రౌండ్‌ సిబ్బంది మాత్రం కేజీ లగేజీకి విద్యార్థికి రూ.2000 చెల్లించాలని డిమాండు చేసారు. దీంతో విద్యార్థి అంత డబ్బు తన వద్ద లేదని ఆహారం, దుస్తుల లగేజీని ఎయిర్‌పోర్టులో వదిలి మలేషియాకు వెళ్లిపోయాడు. అక్కడకు వెళ్లాక ఆన్‌లైన్‌ ద్వారా సదరు సంస్థపై ఫిర్యాదు చేశాడు. కాగా తమ సిబ్బంది తప్పేమీ లేదని సంస్థ చెప్పడం గమనార్హం. 

చదవండి   ఏనుగమ్మా ఏనుగు.. విశ్వవేదికపై ఘీంకారం.. ఇంతకూ మన దేశంలో ఏనుగుల పరిస్థితి ఏమిటి ?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top