
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో బయోకాన్(Biocon) ఛైర్మన్ కిరణ్ మజుందార్ షా(Kiran Mazumdar-Shaw) భేటీ అయ్యారు. బెంగళూరు రోడ్ల దుస్థితి, చెత్త సమస్యలపై ఇటీవల బయోకాన్ ఛైర్మన్ పోస్టులు పెట్టారు. దీనిపై డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. కిరణ్ మజుందార్‌కు మద్దతుగా నిలిచిన పారిశ్రామిక వేత్త హర్ష్ గొయెంకా.. సమస్యకు పరిష్కారం వెతకకుండా.. రాజకీయాలా? అంటూ నేతలపై మండిపడ్డారు.
ఈ రోడ్లపై వివాదం నేపథ్యంలో డీకేతో బయోకాన్ ఛైర్మన్ భేటీ కావడం విశేషం. సమావేశంలో నగర మౌలిక సదుపాయాలపై ఆమె చేసిన విమర్శలపై చర్చ జరిగినట్లు సమాచారం. శివకుమార్ ఆమెకు సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ‘‘ఈ రోజు తన నివాసంలో బయోకాన్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్ మజుందార్-షాను కలవడం ఆనందంగా ఉందంటూ డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. బెంగళూరులో అభివృద్ధి, ఆవిష్కరణలు, రాష్ట్ర ప్రగతి దిశలో ముందుకు సాగే మార్గం గురించి తాము చర్చ జరిపాం’’ అంటూ ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.
#WATCH | Bengaluru | Biocon Chairman, Kiran Mazumdar Shah met Karnataka Deputy Chief Minister DK Shivakumar. Visuals from outside Dy CM DK Shivakumar's residence. https://t.co/ktBNzwI3AO pic.twitter.com/qLF9l3zo2M
— ANI (@ANI) October 21, 2025
ఇటీవలి కాలంలో బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ఓ విదేశీ విజిటర్.. బెంగళూరు నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానంటూ ఆమె ఓ పోస్టులో వెల్లడించారు. దీంతో ఆ పోస్టుపై బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా విమర్శలు చేశారు. డీకే శివకుమార్ రోడ్లపై పెడుతున్న పోస్టులపై కౌంటరిస్తూ.. కాస్త ఘాటుగా బదులిచ్చారు. మజుందార్ షా రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయవచ్చంటూ పేర్కొన్నారు. ఆమె వచ్చి అడిగితే.. ఆ గుంతలు పూడ్చేందుకు రోడ్లను కేటాయిస్తామన్నారు.
It was a pleasure to meet Ms. @kiranshaw, entrepreneur and Founder of Biocon, at my residence today. We had an engaging discussion on Bengaluru’s growth, innovation, and the path ahead for Karnataka’s growth story. pic.twitter.com/NsEkos6tFS
— DK Shivakumar (@DKShivakumar) October 21, 2025