మృతుడు దర్శన్(మధ్యలో..)
మెట్రో నగరం బెంగళూరులో మరో ఘాతుకం చోటు చేసుకుంది. తమ కారు సైడ్ మిర్రర్‌కు తాకిందని బైకర్‌తో గొడవపడి.. ఆపై ఆ యువకుడిని వెంటాడి కారుతో గుద్ది చంపారు ఇక్కడో జంట. ఈ షాకింగ్ ఘటనలో పోలీసులు వెల్లడించిన వివరాలు ఉన్నాయి.
ఈ నెల 25న అర్ధరాత్రి దర్శన్ తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి ఫుట్టనహెళిలోని శ్రీరామ లేఅవుట్ ప్రాంతంలో బైకుపై వెళ్తున్నారు. ఆ సమయంలో పక్కగా వెళుతున్న ఓ కారు సైడు మిర్రర్‌ను వీరి బైకు తాకింది. కారులో ఉన్న దంపతులు బైక్ నడుపుతున్న దర్శన్‌తో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ముందు వెళుతున్న బైకును దంపతులు కారులో రెండు కి.మీ. వెంబడించారు. వెనక నుంచి బైకును ఢీకొట్టి వెళ్లిపోయారు.
#Bengaluru Road Rage Turns Deadly!
A Kalaripayattu trainer & his wife were arrested for killing a delivery agent near JP Nagar: They rammed their car into his bike after its handle grazed their rear-view mirror. The pillion rider survived the crash.
@timesofindia pic.twitter.com/IqlaIedTGt— TOI Bengaluru (@TOIBengaluru) October 29, 2025
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శన్, వరుణ్‌లను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. దర్శన్ చనిపోగా.. వరుణ్ చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న జేపీనగర పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. యాక్సిడెంట్ తర్వాత కారు నుంచి విడిభాగాలు పడిపోతే ఆ జంట మాస్కులతో వెనక్కి వచ్చి మరీ వాటిని తీసుకెళ్లడం రికార్డైంది. ఈ క్రమంలో..
లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులకు నిందితుల ఆచూకీ లభ్యమైంది. నిందితులను భార్యాభర్తలైన మనోజ్, ఆరతిగా గుర్తించి బుధవారం అరెస్టు చేశారు. విచారణలో తాము నేరానికి పాల్పడినట్లు వాళ్లు ఒప్పుకున్నారు. తొలుత బైక్‌తో ఢీ కొట్టడానికి ప్రయత్నించగా.. వాళ్లు తప్పించుకున్నారని, ఆపై యూటర్న్ తీసుకుని మరోసారి వెంబడించి మరీ ఢీ కొట్టామని ఈ దంపతులు పోలీసులకు తెలిపారు.


