రూ .35 లక్షల జీతం.. వైరల్ అయిన ఉద్యోగ ప్రకటన | Bengaluru Job Listing Goes Viral Over Rs 35 Lakh Pay Package | Sakshi
Sakshi News home page

రూ .35 లక్షల జీతం.. వైరల్ అయిన ఉద్యోగ ప్రకటన

Jan 15 2026 5:44 AM | Updated on Jan 15 2026 5:51 AM

Bengaluru Job Listing Goes Viral Over Rs 35 Lakh Pay Package

బెంగళూరులో కేవలం ఒక సంవత్సరం అనుభవం ఉన్న అభ్యర్థికి ఆఫర్ చేస్తున్న భారీ వేతన ప్యాకేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. SDE-1 (సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్) పోస్టుకు ఈ ఉద్యోగానికి వార్షికంగా రూ.25 లక్షల జీతం, నాలుగు సంవత్సరాల్లో రూ.20 లక్షల విలువైన ఈఎస్ఓపీలు లేదా స్టాక్ బోనస్, అలాగే రోజుకు రూ.600 జొమాటో క్రెడిట్స్ అందిస్తామని పేర్కొన్నారు.

ఇదే కాకుండా 10 శాతం పనితీరు బోనస్, రూ.5 లక్షల వరకు రీలొకేషన్‌, సైనింగ్ ఇన్సెంటివ్‌లతో మొదటి సంవత్సరంలో మొత్తం వేతనం సుమారు రూ.35 లక్షలకు చేరుతుందని సమాచారం. ఉచిత జిమ్ సభ్యత్వం, ఫోన్, వైఫై బిల్లుల రీయింబర్స్‌మెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ కోసం రూ.21,000 భత్యం, ప్రతి మూడు సంవత్సరాలకు ఫోన్ అప్‌గ్రేడ్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

ఈ జాబ్‌ లిస్టింగ్‌ను ‘ఎక్స్‌’ (ట్విట్టర్)లో ఓ వినియోగదారు షేర్ చేయగా, వెంటనే వైరల్ అయింది. ఒక వైపు టెక్ రంగంలో తొలగింపులు జరుగుతుండగా, మరో వైపు జూనియర్ స్థాయి ఉద్యోగాలకు ఇంత భారీ ప్యాకేజీలు ఇవ్వడంపై నెటిజన్లు భిన్న కామెంట్లతో ప్రతిస్పందించారు. ఈ ఘటన టెక్ పరిశ్రమలో మారుతున్న నియామక ధోరణులు, వేతన వ్యత్యాసాలపై మరోసారి చర్చకు దారి తీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement