breaking news
goes viral
-
స్వామీజీ మసాజ్ వీడియో వైరల్
సాక్షి,బళ్లారి: అదో ప్రముఖ ఆధ్యాత్మికత క్షేత్రం. ఎంతో మంది భక్తులు ఆరాధించే మఠం కూడా. అయితే అక్కడ ఓ స్వామీజీ నగ్నంగా ఓ అమ్మాయితో మసాజ్ చేయించుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ధారవాడ జిల్లా కవలగేరి మఠానికి చెందిన శివానంద మఠ సరస్వతి స్వామీజీ కామ పురాణం వీడియో బయటకు వచ్చింది. ఇంత వరకు స్వామీజీ సన్యాసి అని జనం ఎంతో భక్తితో పూజించేవారు. అయితే ఆయన ఓ మహిళతో నగ్నంగా ఉంటూ మసాజ్ చేయించుకున్నారు. మసాజ్ చేయించుకున్న వీడియోను ఐదు మంది తమ దగ్గర ఉంచుకుని స్వామీజీని డబ్బు డిమాండ్ చేశారు. రూ.20 లక్షలు ఇవ్వకపోతే వీడియో వైరల్ చేస్తామని బెదిరించారు. స్వామీజీ వారితో చర్చలు జరిపి రూ.10 లక్షలకు డీల్ కుదుర్చుకుని, చెప్పిన ప్రకారం రూ.7 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. అనంతరం వీడియోను డిలీట్ చేయాలని విన్నవించారు. మిగిలిన రూ.3 లక్షలు ఇవ్వలేదని, ఐదు మందిలో ఒకరు వీడియోను బయటకు వదలడంలో స్వామీజీ మసాజ్ వీడియో వైరల్ అయింది. సన్యాసిగా ఫోజులు ఇచ్చిన స్వామీజీ కామ పురాణం వీడియో బయట పడటంతో ఒక్కసారిగా మఠం పరిసరాల్లో జనం చేరి స్వామీజీ తీరుపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాగా తనను బ్లాక్ మెయిల్ చేసి, వీడియోను వైరల్ చేసిన వారిపై స్వామి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. -
డియర్ క్యాబ్ డ్రైవర్ ఫ్రెండ్స్ , జిమ్మేదారీ అంటే ఇదీ..!
‘పిల్లల భద్రతకు పూర్తి బాధ్యత తీసుకోవడం అంటే ఇది’ అంటూ ఒక క్యాబ్ డ్రైవర్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు అతడి వృత్తినైపుణ్యాన్ని, అంకితభావాన్ని ప్రశంసిస్తున్నారు. ‘పిల్లలు సురక్షితంగా ఇంటికి చేరుకునేలా జాగ్రత్త పడడం ప్రతి స్కూల్ క్యాబ్ డ్రైవర్ బాధ్యత’ అనే కాప్షన్‌తో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వీడియోలో ఏముంది? అనే విషయానికి వస్తే... స్కూల్ క్యాబ్ నుంచి బయటికి దిగిన బాలిక తన ఇంటివైపు పరుగులు తీస్తూ కనిపిస్తుంది. ‘క్యాబ్ డ్రైవర్ మిత్రులారా, నేను చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అమ్మాయి క్యాబ్ దిగగానే మన బాధ్యత తీరినట్లు కాదు. ఆ ΄ాప ఇంట్లోకి అడుగుపెట్టేవరకు కాబ్ కదలకూడదు’ అనే మాటలు బ్యాక్‌గ్రౌండ్ నుంచి వినిపిస్తూ ఉంటాయి. ‘ప్రతి క్యాబ్ డ్రైవర్ నీలా ఆలోచిస్తే పిల్లల భద్రతకు ఎలాంటి సమస్య ఉండదు’ అని ఒక నెటిజన్ స్పందించారు. ‘మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు పిల్లల భద్రత విషయంలో కీలకం అవుతాయి’ అని మరోసారి గుర్తు చేసే వీడియో ఇది. View this post on Instagram A post shared by The Logical Indian (@thelogicalindian) -
దసరా వింత ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!
జగిత్యాల జిల్లా: దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు యువకులు ‘దసరా బొనాంజా’ పేరుతో ప్రకటించిన ఆఫర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనికి సంబంధించిన ఫ్లెక్లీ నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.రూ.150తో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండంటూ.. మద్యం, మాసం పేరుతో సోషల్ మీడియాలో విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. రూ.150కు ప్రథమ బహుమతిగా మేక, రెండో బహుమతిగా బీర్లు, మూడో బహుమతిగా విస్కీ, నాలుగో బహుమతిగా కోళ్లు, ఐదో బహుమతిగా చీర అని పేర్కొంటూ వెలసిన ఫ్లెక్సీ విస్తుగొలుపుతోంది. స్థానికంగా ఉండే సాయిని తిరుపతి అనే వ్యక్తి ఈ బంపర్ డ్రా నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ నెల మొదటి తేదీన డ్రా తీయనున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. దీంతో ఎగబడి టోకెన్లు కొనుక్కుంటున్న జనాలు. -
పాపం పావురం.. కాపాడండి ప్లీజ్.. వీడియో వైరల్
లాంగ్డింగ్: గాయపడిన పావురాన్ని రక్షించేందుకు ఓ బాలుడు చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని లాంగ్డింగ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్వచ్ఛమైన ఆ చిన్నారి మనస్సుకు అద్దంపడుతోంది. అసలేం జరిగిందంటే.. గాయపడిన ఓ పావురాన్ని బాలుడు తన స్నేహితులతో కలిసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ పావురానికి వైద్యం చేయాలని ఆ బాలుడు వేడుకున్నాడు.పావురాన్ని ఇక్కడ వదిలి వేయాలని.. డ్రెస్సింగ్ చేస్తామని నర్సు చెబుతుండగా.. ఆ బాలుడు పావురాన్ని మృదువుగా ఒక బలపై పెట్టి.. కన్నీళ్లు తుడుచుకుంటూ పక్కన నిలబడ్డాడు. కొంతసేపటికి ఆ పావురం చనిపోయింది. ఇది చనిపోయిందా? అంటూ వైద్య సిబ్బందిని ఆ బాలుడు అడగ్గా.. అవును చనిపోయిందంటూ సమాధానం ఇచ్చారు.దీంతో ఆ చిన్నారి హృదయం తట్టుకోలేకపోయింది.. బాధతో విలపించాడు. కన్నీటి పర్యంతమైన వీడియో ప్రస్తుతం నెటిజన్లను కదిలిస్తోంది. ఆ చిన్నారి చూపిన జంతువుల పట్ల ప్రేమ, దయ, మనిషితనానికి అద్దం పడుతుందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.कबूतर हो गया घायल, रोते हुए इलाज कराने अस्पताल पहुंचा बच्चा.... भावुक कर देगा वीडियो#ArunachalPradesh #viralvideo pic.twitter.com/J1kMQjd1G9— sweety dixit (@sweetydixit6) July 25, 2025 -
బెంగళూరు మెట్రోస్టేషన్లో ప్రేమికుల...
కర్ణాటక: గతంలో తెరవెనుక జరిగే రొమాన్స్ నేడు వీధుల్లోకి వచ్చింది. మెట్రో రైల్వేస్టేషన్లో ఓ జంట పట్టపగలే అందరి ముందు ప్రేమ కలాపాల్లో మునిగిపోయిన వీడియో భారీ వైరల్‌గా మారింది.ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని మెజెస్టిక్ మెట్రోస్టేషన్ ఒకటో ప్లాట్‌ఫాంలో ఓ జంట, చుట్టుపక్కల ప్రయాణికులు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా అసభ్యంగా ప్రవర్తించిన దృశ్యం ఎవరో మొబైల్లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. ప్రేమికులు ప్రేమకలాపం చోటు చేసుకున్నది మెజెస్టిక్ మెట్రోస్టేషనా లేక మాదావర స్టేషన్‌లోనా అనే స్పష్టత లేనప్పటికీ అందరి ముందు ఇలా ప్రవర్తించడంపై ఆ జంటపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక నిమిషం 30 సెకండ్ల నిడివి ఉన్న ప్రేమికుల రొమాన్స్ వీడియోపై వేలాదిమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దృశ్యాలు విదేశాల్లో మాత్రమే చూడవచ్చు. ఇటీవల రోజుల్లో ఇక్కడ కూడా ఇలాంటి ప్రవృత్తి పెచ్చుమీరడం మంచిది కాదని సోషల్ మీడియాలో నెటిజన్ ఒకరు తెలిపారు. -
అవును వాళ్లిద్దరికీ పెళ్లైంది : అదిరే స్టెప్పులతో పెళ్లి వీడియో వైరల్
మన దేశంలో పెళ్లి అంటే కేవలం వేడుక, ఆనందం మాత్రమేకాదు ఆడంబరం, ఆర్బాటం కూడా. ఎంత ఖర్చైనా పరవాలేదు విలాసవంతంగా మూడు ముళ్ల వేడుక పూర్తి కావాల్సిందే. ఇదీ నేటి ప్రజ తీరు. దీనికి తోడు ఇలాంటి వివాహ వేడుకలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం క్రేజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అంటే ముందుగా గుర్తొచ్చే నెటిజన్లు కమెంట్లే గదా. తాజాగా ఒక పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.అయితే ఈ పెళ్లి వెనుక విశేషం ఇదే అంటూ ఇంటర్నెట్ యూజర్లు కమెంట్లతో హోరెత్తించారు. ఇంతకీ విషయం ఏమిటంటే.ఈ వైరల్ వీడియోలో వధువు గ్రాండ్ జర్జోజీ వర్క్‌తో తయారైన మెరూన్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబైంది. డబుల్ దుపట్టాలతో మరింత అందంగా కనిపించింది.ఆకర్షణీయమైనమేకప్, చోకర్,నెక్లెస్‌లు,చెవిపోగులు ఇలా సర్వహంగులతో పెళ్లికూతురి లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తోంది. మరోవైపు, వరుడు కూడా ఐవరీ కలర్ షేర్వానీలో బాగానే తయారయ్యాడు. ఇద్దరూ ఆనందంగా డ్యాన్స్ చేస్తారు. మరీ ముఖ్యంగా పెళ్లి కూతురు చాలా ఉత్సాహంగా స్టెప్పులేసింది. అటు 40 ఏళ్ల పెళ్లి కొడుకుగా సిగ్గుపడుతూ ఆమెతో జత కలిశాడు. View this post on Instagram A post shared by mayank Kumar Patel (@mayank_kumar_patel473)అసలు స్టోరీ ఇదట! వరుడు వయసు 46, వధువు వయసు 24.తనకంటే పదహారు సంవత్సరాలు పెద్దవాడిని సంతోషంగా వివాహం చేసుకుంది. వయసులో చాలా తేడా ఉన్నా కూడా ఆమె ఆనందంగా కనిపిస్తోంది. వరుడు గవర్నమెంట్ టీచర , సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగం అందుకే ఇలా అంటూ గత ఏడాది డిసెంబరులో చేసిన పోస్ట్‌లో వెల్లడించింది. వీడియో అప్లోడ్ కాగానే కమెంట్ సెక్షన్‌ను నెటిజన్లు చమత్కారాలు, వ్యంగాలతో నింపేశారు. కొంతమంది పెళ్లి కొడుకు వయస్సును ఎగతాళి చేయగా, మరికొందరు గవర్నమెంట్ ఉద్యోగం బాబూ అని వ్యాఖ్యానించారు. పెళ్లి చేయాలంటే అందం, కులంతోపాటు, వయసు, హోదాకూడా పరిశీలిస్తారు పెద్దలు సాధారణంగా. సమయాన్నిబట్టి, తమ సౌలభ్యాన్ని వీటిల్లో అనేక మినహాంపులతో పెళ్లిళ్లు జరిగిపోతాయి. దాదాపు వీరంతా చాలా హ్యాపీగా జీవితాలను గడుపుతూ ఉంటారు. అయితే సోషల్ మీడియా యూజర్లు మాత్రం, చమత్కారాలతో, మీమ్స్ సందడిచేస్తూనే ఉంటారు. ‘కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు’ అన్న సామెత వీళ్లు అసలు పట్టించుకోరు. -
విమానంలో అదిరే హోలీ స్టెప్పులు: ఇక జన్మలో స్పైస్‌జెట్ ఎక్కను!
హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సామాన్యమానవుల దగ్గర్నించీ, సెలబ్రిటీల దాకా రంగుల పండుగ ఉత్సవాల్లోఉత్సాహంగా గడిపారు. ఈ వేడుకలకు సంబంధించి అనేక వీడియోలు సోషల్‌మీడియాలో ఆకట్టుకంటున్నాయి. అయితే వీటన్నింటికంటే భిన్నంగా ఒకవీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. హోలీ పండుగ సందర్భంగా స్పైస్ జెట్ (SpiceJet) సిబ్బంది తమ డ్యాన్స్‌తో ప్రయాణికులను అలరించారు. అయితే విధి నిర్వహణ మర్చి గెంతులేశారు అంటూ నెటిజన్లులు మండిపడ్డారు.హోలీ (Holi202) స్పైస్‌జెట్ క్యాబిన్ సిబ్బంది వార్తల్లో నిలిచాయి. విమానంలో స్టెప్పులేసి ప్రయాణీకులతో కలిసి హోలీని ఉత్సాహంగా జరుపుకున్నారు. బాలీవుడ్ మూవీ యే జవానీ హై దీవానీ చిత్రంలోని పాటకు నృత్యం చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో టేకాఫ్‌కు సిద్ధంగా విమానంలో స్పైస్‌జెట్ క్యాబిన్ క్రూ అంతా సంప్రదాయ దుస్తులు ధరించి, హోలీ ‘బలం పిచ్కారి’ పాటకు నృత్యంచేశారు ఎయిర్ హోస్టెస్‌లు, ఫ్లైట్ స్టీవార్డ్‌లు ఉత్సాహంగా మ్యూజిక్కు తగ్గట్లు స్టెప్పులతో అదరగొట్టేశారు. వీరి సంతోషానికి ప్రయాణికులు చప్పట్లు కొట్టారు. పనిలో పనిగా వీడియోలను రికార్డు చేశారు. ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోను గోవింద్ రాయ్ (@govindroyicai) అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వీడియో 3 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించినప్పటికీ, ఇది ఆన్లైన్లో చర్చకు దారితీసింది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు దీన్ని తప్పుబట్టారు. సిబ్బంది మూలంగా విమానం 5 గంటలు ఆలస్యం అయింది అంటూ విమర్శించారు. విధి నిర్వహణ మానేసి ఇదేం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.A signature festival, a signature song, and a celebration like no other! 💃 Our crew brought Holi to life with an energetic dance, proving that traditions take flight with us!#flyspicejet #spicejet #happyholi #addspicetoyourtravelVideo was filmed on ground with all safety… pic.twitter.com/63XKMJDZCI— SpiceJet (@flyspicejet) March 14, 2025 మరో వినియోగదారుడైతే ఏకంగా స్పైస్ జెట్ విమానం ఎక్కను అంటూ అన్నాడు. “చాలా ఏళ్ల తరువాత నేను స్పైస్‌జెట్‌లో ప్రయాణిస్తున్నా..ఇక ఇదే చివరిసారి. ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ ఈ ఎయిర్‌లైన్‌తో ప్రయాణించను”అంటూ కమెంట్ చేశాడు.కొంతమంది క్యాబిన్ క్రూ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. “ ఒక క్యాబిన్ క్రూగా, నేను దీన్ని అభినందించను. ఇది అస్సలు ప్రొఫెషనల్ కాదు” అని వ్యాఖ్యానించారు. -
బీట్స్‌తో అదరగొట్టేసిన బుడ్డోళ్లు : 3 కోట్ల వ్యూస్, ఓ లుక్కేసుకోండి మరి!
‘బాల్యం బంగారు నిధి’ ఇది అందరం ఒప్పుకునే మాట. బాల్య స్మృతులు ఎవరికైనా చెప్పలేనంత ఉల్లాసాన్ని ఇస్తాయి. బాల్యం అనగానే అందమైన అనుభూతులు, అనుభవాలు ఒక్కసారిగా మనల్ని చుట్టుముడతాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించిన జ్ఞ్యాపకాలు ఒక్కసారిగా నిద్ర లేస్తాయి. చిన్నపుడు మనం చేసిన అల్లరి, చిలిపి చిలిపి చేష్టలు గుర్తొస్తాయి. బ్లాక్ బోర్డుపై రాసిన రాతలు, స్కూలు బెంచ్‌పై చెక్కుకున్నపేర్లు, అదేదో సినిమాలో అన్నట్టు నచ్చిన అమ్మాయిపై పేపర్ బాల్ విసరడం, అది మాస్టార్‌కు తగిలి, వీపు పగలడం ఇలా.. ఎన్నో..ఎన్నో గుర్తుకు వస్తాయి కదా. ఇపుడు మీరు చదవబోయే కథనం కూడా అలాంటి ఎన్నో అనుభవాలను గుర్తు చేస్తుంది. పుణేకు చెందిన విద్యార్థుల వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది.ప్రాజెక్ట్ అస్మి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఇది 3 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. కమెంట్లు వెల్లువెత్తాయి. పూణేలోని ఒక పాఠశాల చెందిన బ్యాచ్ జామెట్రీ బాక్స్, బెంచె మీద వాయిస్తూ అద్భుతమైన సంగీతాన్ని సృష్టించారు. వాటర్ బాటిల్‌ను మాత్రమే ఉపయోగించి డ్రమ్ బీట్స్‌తో అదరగొట్టేశారు. ఒకరి తరువాత ఒకరు తమ టాలెంట్‌తో రెచ్చిపోయారు. దీంతో తరగతి గది ఒక చిన్న కచేరీ వేదికగా మారిపోయింది. దీంతో టీచర్లు కూడా అలా మైమరిచిపోయారు. చుట్టూ ఉన్న పిల్లలు, స్నేహితులు చప్పట్ల మోత మోగించారు. చదవండి: అప్పుడు వెడ్డింగ్ గౌను, ఇపుడు ఎంగేజ్మెంట్ రింగ్ : సమంత అంత పనిచేసిందా? View this post on Instagram A post shared by Project Asmi (@projectasmi_pune)అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించి విద్యార్థులు ఉత్పత్తి చేసే బీట్లు , రిథమ్‌లు భలే ఉంటాయి. వారి క్రియేటివిటీని మెచ్చుకోకుండా ఉండలేం. కల్మషం లేని లేత వయసులో వారి ప్రతిభను ,సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే గొప్ప ప్రతిభావంతులుగా మారతారు. మరి ఈ బాల శివమణిలకు ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుందో వేచి చూద్దాం. -
మీరు రాకుంటే కామెంట్లు ఎవరు చేస్తారు.. ?
మా ఇంట పెళ్లి.. మీరంతా రావడం మా కల.. పెళ్లి పందిరి నవ్వాలి కిలకిల. మీరాక మాకెంతో శుభదినం.. ఇలా కదా పెళ్లి పత్రిక రాస్తారు.. కానీ ఈ కుటుంబం వేసిన పెళ్లి ఆహ్వాన పత్రిక చూసి నెటిజన్లు అబ్బా.. ఏం రాసిర్రు భయ్యా అంటూ నవ్వుతూనే.. కామెంట్లు సైతం పెడుతున్నారు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన కొద్దీ సమయానికే లక్షదాటిన వ్యూస్.. దీంతో ఇదిప్పుడు వైరల్ ఐంది. సాధారణ సంప్రదాయానికి భిన్నంగా ఉన్న ఈ పెళ్లి పత్రిక చూసి పలువురు నవ్వుకుంటూనే.. మొత్తానికి అన్నీ నిజాలే రాసారు అని కామెంట్లు చేస్తున్నారు. మీరు పెళ్ళికి రాకుంటే ఎలా ? భోజనాల గురించి కామెంట్లు ఎవరు పెడతారు.. అది అలా ఉంది.. ఇది ఇలా ఉందని ఎవరు చెబుతారు ? కాబట్టి మీరు తప్పనిసరిగా రావాల్సిందే అని అందులో పేర్కొన్నారు. వధువు, “శర్మాజీకి లడ్కీ” (శర్మాజీ గారి కుమార్తె ) “మంచి తెలివైన అమ్మాయి" అని రాశారు. వరుడు, “గోపాలజీ కా లడ్కా” (గోపాలజీ గారికి కుమారుడు ) అంటూనే ఈయన బీటెక్ పూర్తి చేసినప్పటికీ, ఇప్పుడు ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాడని వివరించారు. జనవరి ఐదోతేదీ నాటికి తమ పిల్లలతోబాటు, బంధువుల పిల్లల పరీక్షలు కూడా ముగుస్తున్నందున ఆరోజు పెళ్లి చేస్తే బావుంటుందని ముగ్గురు పురోహితులు కలిసి ముహుర్తాన్ని ఖరారు చేసారని పేర్కొన్నారు. వియ్యాలవారి మధ్య చిన్నచిన్న కయ్యలు ఉంటాయి...వాటిని పట్టించుకోవద్దు అని చెబుతూనే పెళ్లి వేదికమీదకు వధూవరులు ఆలస్యంగా వస్తారని, అంత వరకు ఓపిక పట్టాలని రాసారు. అసలే వివాహవేదిక చాలా ఖరీదుపెట్టి డెకరేట్ చేయించాం. అందుకే అక్కడ మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి.. అదేం మీ పిల్లలు ఆదుకునే అట స్థలం కాదు కదా.. అని గుర్తు చేశారు ఫుడ్ చాలా కాస్ట్లీ.. ఒకసారే తినండి పెళ్లికోసం బుక్ చేసిన భోజనం చాలా ఖరీదైంది.. ఒక్కో ప్లేట్ భోజనం రూ. 2000 కాబట్టి.. కాస్త తక్కువ తినండి. లేదా ఒకసారి మాత్రమే తినండి. వివాహ వేదిక మీకు తెలుసుగా మన దూబే గారి రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది కదా.. అక్కడే ఈ పెళ్లి కూడా అని రాశారు. కానుకలు వద్దు.. క్యాష్ కొట్టండి పెళ్లిలో ఇచ్చే కనుకలగురించి కూడా వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఇప్పటికే ఇంట్లో ఆల్రెడీ 20 ఫోటో ఫ్రేమ్స్.. బోలెడు డిన్నర్ సెట్లు ఉన్నాయి కాబట్టి.. క్యాష్ కొట్టండి. లేదా గూగుల్ పే చేయండి అని గుర్తు చేసారు. బంధుమిత్రులగురించి చెబుతూ వాళ్లంతా ఎప్పట్లానే బోరింగ్ బ్యాచ్ అని రాశారు.. ఇంకా భారీగా కానుకలు ఇస్తారు కాబట్టి.. తాతయ్య పేరును పత్రిక పైన రాశామని సరదాగా చెప్పారు. మామ.. అత్తయ్యలను గురించి వివరిస్తూ ఇంట్లో గొడవలను తీర్చే స్పెషలిస్టులుగా వివరించారు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ పత్రికను దాదాపు 1.94 లక్షల మంది చూశారు. అయ్యో నేను ఈ కార్డు ముందే చూసి ఉంటె మా అబ్బాయి పెళ్ళికార్డును కూడా ఇలాగె ప్రింట్ చేయించేవాడిని అని ఒకాయన కామెంట్ చేయగా.. వామ్మో మరీ ఇంత నిజాయితీగా రాసేశారు.. బంధువులు ఏమనుకుంటారో అని ఇంకో అయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ పోస్ట్ కింద వందలాది ఎమోజీలు కూడా వచ్చాయి. సిమ్మాదిరప్పన్న -
అమెరికా ఉపాధ్యక్షుడు ‘వాన్స్ భయ్యా, ఉషా భాభీ’ పెళ్లి ఫోటోలు వైరల్
2024 వైట్ హౌస్ రేసులో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌పై రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి చరిత్రకెక్కాడు. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన భార్య ఉషా చిలుకూరి భర్త, ఉపాధ్యక్షుడిగా జెడి వాన్స్ కూడా విజయం సాధించారు. ఈ సందర్భంలో ఉష. వాన్స్ పెళ్లి ఫోటోలు ట్విటర్లో సందడి చేస్తున్నాయిఅధ్యక్ష ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించిన తర్వాత తన భార్యకు ఒక నోట్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు జేడీ వాన్స్. ముందుగా డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి, "ఈ స్థాయిలో మన దేశానికి సేవ చేయడానికి నాకు అలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికన్ ప్రజలకోసం తన పోరాటం ఎప్పటికీ కొనసాగుతుంది అంటూ వారికీ కృతజ్ఞతలు ప్రకటించారు. ‘‘ఇంతటి ఘనవిజయాన్ని మద్దతిచ్చిన నా అందమైన భార్యకు థ్యాంక్స్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తన సతీమణి ఉషి చిలుకూరికి మరో తీపి కబురు కూడా అందించారు. త్వరలోనే ఆమె అమెరికా రెండో పౌరురాలిగా కాబోతుతున్న తొలిభారతీయ మహిళ కాబోతోందని ప్రకటించారు.జెడి వాన్స్ భార్య ఉషా చిలుకూరి న్యాయవాది. ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఆమె కుటుంబం 50 సంవత్సరాల క్రితం విదేశాలకు వలస వచ్చింది. ఉష శాన్ డియాగోలో పెరిగింది. యేల్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2014లో వాన్స్‌ను పెళ్లాడారు ఉష. వాన్స్ తాజా విజయంతో శ్వేతజాతీయేతర రెండో మహిళగా ఉష అవతరించనుంది.Vice President JD Vance bhaiyya and Usha bhabhi ☺️ pic.twitter.com/L2HPTVuJfu— The Hawk Eye (@thehawkeyex) November 6, 2024 -
Khushi Kapoor: వింటేజ్ లుక్‌లో జాన్వీ కపూర్ చెల్లి.. చూస్తే వావ్ అంటేరేమో! (ఫొటోలు)
-
Mouni Roy: జుట్టుతో పరాచకాలు.. మౌనీ రాయ్ స్టైలే డిఫరెంట్ (ఫొటోలు)
-
Akhila Bhargavan: సముద్రతీరంలో మలయాళ బ్యూటీ అందాలు.. ఫోటోలు
-
Mrunal Thakur: పూల తోటలో మృణాల్ ఠాకుర్.. అందమే కుళ్లుకునేలా! (ఫొటోలు)
-
Taapsee Pannu: పారిస్ ఒలింపిక్స్‌లో చీరలతో అలరిస్తున్న తాప్సీ..! (ఫోటోలు)
-
Vicky-Rashmika: విక్కీ కౌషల్‌తో రష్మిక మందన్న ఫోజులు.. ఫోటోలు వైరల్
-
Jyotika: బ్లాక్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్స్‌లో మెరిసిపోతున్న జ్యోతిక (ఫోటోలు)
-
‘నన్ను పెళ్లాడతావా’.. స్వర్ణంతో పాటు ఎంగేజ్మెంట్ రింగ్ కూడా (ఫొటోలు)
-
అబ్బా అనేంత అందంతో హెబ్బా.. సూపర్ క్యూట్‌నెస్ (ఫొటోలు)
-
ప్యారిస్ ఒలింపిక్స్ : ఫ్యాషన్ ఐకాన్‌గా నీతా ఫోటోలు వైరల్
రిలయన్స్ షౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని చాటుకోవడంలో ఎపుడు తన అభిమానుల అంచనాలను తప్పరు. ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో అందర్నీ అబ్బుర పర్చిన నీతా అంబానీ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో కూడా స్టైల్ ఐకాన్‌గా నిలిచారు.ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీరలో నీతా అంబానీ హుందాగా కనిపించారు లోటస్ పింక్ హ్యాండ్-ఎంబ్రాయిడరీ చీరలో నీతా దేశీ శోభను ప్రదర్శించారు. ఫ్యాషన్ సీటీలో జరుగుతున్న విశ్వ క్రీడావేదికపై చీర పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. భారతీయ సంప్రదాయన్ని, హస్తకళ గొప్ప కళాత్మకతను చాటడమే కాదు, అద్భుతమైన చీరలో ఫ్యాషన్ ప్రియులను నీతా ఆకర్షించారు. ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.సున్నితమైన సోజ్నీ కలంకారి చేతి ఎంబ్రాయిడరీతో కస్టమ్ మేడ్ చీర, చీరకు సరిపోయే హాఫ్-స్లీవ్ బ్లౌజ్లో అద్భుతమైన ఛాయతో మెరిసారు. అంతేనా లగ్జరీ బహుళ-లేయర్డ్ ముత్యాల నెక్లెస్, చెవిపోగులు, అద్భుతమైన డైమండ్ రింగ్ , మ్యాచింగ్ ముత్యాల గాజుల సెట్‌ను ధరించారు. -
ఫ్యామిలీని పరిచయం చేసిన హీరోయిన్ నభా నటేశ్ (ఫొటోలు)
-
కొండాకోనల్ల నడుమ సేద తీరుతున్న అల్లు అర్జున్ ఫ్యామిలీ (ఫోటోలు)
-
Ranveer Singh: ఆ ఠీవీ, ఆ దర్పం.. మహారాజులా ఉన్నాడే! (ఫోటోలు)
-
కుమారుడితో కలిసి కల్కి చూసిన బిగ్‌బీ.. ఇంత ఆలస్యంగానా? (ఫోటోలు)
-
పెళ్లి సందడి షురూ.. ఘనంగా వరలక్ష్మి మెహందీ ఫంక్షన్ (ఫోటోలు)
-
రకుల్-భగ్నానీ జంటకు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్ వైరల్
PM Modi Wishes to Rakul-Jackky: మూడుమూళ్లు బంధంతో ఒక్కటైన నూతన జంట రకుల్ ప్రీత్ సింగ్-జాకీభగ్నానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. దీనికి సంబంధించిన ఒక నోట్‌ను స్వయంగా రకుల్ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ‘‘మా సరికొత్త జర్నీలో మీ ఆశీర్వాదాలు, మా హృదయాలను తాకాయి. ఇవి మాకెంతో విలువైనవి.. ధన్యవాదాలు’’ అంటూ రకుల్, జాకీ ఇద్దరూ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. Your blessings touch our hearts deeply, Prime Minister @narendramodi ji. Thank you for your kind wishes as we begin this meaningful new chapter.@Rakulpreet pic.twitter.com/6VOfWhzl68 — Jackky Bhagnani (@jackkybhagnani) February 22, 2024 ఫిబ్రవరి 21న గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు రకుల్-జాకీ జంట. దీంతో కొత్తగా పెళ్లయిన ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ జాబితాలో దేశ ప్రధాని మోదీ చేరడం విశేషంగా నిలిచింది. తన బిజీ షెడ్యూల్ కారణంగా మోదీ రకుల్-జాకీ పెళ్లికి హజరుకాలేక పోయానని తెలిపిన మోదీ నూతన దంపతులకు స్పెషల్ ఆశీర్వాదాలు అందించారు. తనకు ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ధనికవర్గాలు విదేశాల్లో కాకుండా భారతదేశంలోనే డెస్టినేషన్ పెళ్లిళ్లు చేసుకోవాలని, తద్వారా, పర్యాటక రంగానికి, ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలన్న భారత ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు విదేశాల్లో చేసుకోవాలనుకున్న వీరి పెళ్లి తొలి ప్లాన్‌ను గోవాకు మార్చుకున్నారనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. -
రకుల్, జాకీ పెళ్లి సందడి : వెడ్డింగ్ కార్డ్ వైరల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో పెళ్లిసందడికి ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఈ లవ్‌బర్డ్స్ తమ రిలేషన్ షిప్లో మరో అడుగు వేయబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజగా వీరి పెళ్లికి సంబందించిన వెడ్డింగ్ కార్డ్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఫిబ్రవరి 21న రకుల్, జాకీ భగ్నానీ ల వివాహం గోవాలో జరగబోతోంది. వివాహ సన్నాహాలు పూర్తి స్వింగ్‌లో ఉన్నాయి. వీరి వెడ్డింగ్ స్పెషల్‌గా , చిరకాలం గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా జరిపేందుకు రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే నీలం, తెలుపు రంగుల్లో రకుల్, జాకీ భగ్నానీ పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుభలేఖలో కొబ్బరి చెట్లు, బీచ్ దృశ్యాలతోపాటు గోవా అందాలు కనిపించేలా ముద్రించడం విశేషం. అందమైన సోఫా నీలం , తెలుపురంగుల్లో క్యూట్ క్యూట్ కుషన్లు.. మరో పూలద్వారం గుండా నీలిరంగు గేటు అందమైన బీచ్‌కి దారి తీస్తూ, రకుల్, జాగీ పెళ్లి ముహూర్తం విశేషం ఇందులో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నట్టు వీరి వెడ్డింగ్ డెస్టినేషన్ కూడా హాట్ టాపిక్కే. ఎందుకంటే వీరి ద్దరి ప్రేమ కూడా ఇక్కడే మొదలైందట. అందుకే గోవాను ఎంచుకున్నట్టు సమాచారం. -
యాపిల్ మెగా ఈవెంట్లో పీవీ సింధు: టీమ్ కుక్‌తో సెల్ఫీ పిక్స్ వైరల్
Apple Event Pv Sindhu Selfie with Tim Cook అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ మెగా ఈవెంట్‌కు బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు హాజరైంది. యుఎస్‌లోని కుపెర్టినోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోస్ట్ ఎవైటెడ్ iPhone 15 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు హాజరైనట్టు ఇన్‌స్టాలో షేర్ చేసిన సింధు Apple CEO టిమ్ కుక్‌తో సెల్ఫీలను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. (గోల్డ్ లవర్స్‌కి తీపి కబురు: బంగారం, వెండి ధరలు పతనం) ‘‘Apple Cupertinoలో సీఈవో టిమ్ కుక్‌ని కలుసుకోవడం మర్చిపోలేని క్షణం! ధన్యవాదాలు, టిమ్. అద్భుతమైన ఆపిల్ పార్క్‌ని , , మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది!’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఈ సారి మీరు భారత పర్యటనకు వచ్చినపుడు బ్యాడ్మింటన్ ఆడతాను అంటూ మరో పోస్ట్‌లో పేర్కొంది. ఈ పోస్ట్‌లకు ఇప్పటికే సింధు అభిమానులు, అనుచరుల నుండి లైక్‌లు, కామెంట్లు వెల్లువెత్తాయి. మిమ్మల్ని ఈ స్థాయిలో చూడటం గర్వంగా ఉందని ఒకరు, Apple Cupertinoలో కూడా బ్యాడ్మింటన్ సంఘం ఉంది అంటూ మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. కాగా USB-Cతో Apple Watch Series 9 , Airpods Proతో పాటు iPhone 15 సిరీస్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్‌కు రూ. 79,900 నుండి ప్రారంభమైతే, ఐఫోన్ 15 ప్లస్ రూ. 89,900 నుండి ప్రారంభమవుతుంది. iPhone 15 Pro 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,34,900 , iPhone 15 Pro Max 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభమవుతుంది. View this post on Instagram A post shared by Sindhu Pv (@pvsindhu1) -
బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా?
Vedhika Pink Bikini Photoshoot Goes Viral: బ్యూటీఫుల్ హీరోయిన్ వేదిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాలరాతి శిల్పంలా మెరిసే వేదిక దశాబ్దన్నరకు పైగానే చిత్ర పరిశ్రమలో రాణిస్తోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నటిస్తోంది. తమిళంలో పరదేశి, ముని, ముని–4 తదితర చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం వినోదన్, జంగిల్ వంటి చిత్రాలలో నటిస్తోంది. తెలుగులో బాలకృష్ణ, తమిళంలో శింబు, లారెన్స్ వంటి హీరోలతో నటించింది. అందం, ప్రతిభ ఉన్నప్పటికీ ఇప్పటిదాకా నటిగా ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయింది వేదిక. దీంతో పాపులారిటీ కోసం తెగ ఆరాటపడుతోంది ఈ ముద్దుగుమ్మ. అందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా ఎంచుకుంది వేదిక. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అందులో రకరకాల గ్లామరస్ దుస్తులతో ఫొటో షూట్ చేసుకుని ఫొటోలను పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. అలా ఆమెకు ప్రస్తుతం 34 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. తాజాగా మాల్దీవుల్లో పింక్ బికినీ వేసుకుని దిగిన ఫొటోలను ఈ బ్యూటీ విడుదల చేసింది. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇవైనా ఈ అమ్మడికి ఏ పాటి అవకాశాలు తీసుకొస్తాయో చూడాలి. చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి సినిమా.. View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) 🧞♀️🐚 pic.twitter.com/Mx0G9NuKMv — Vedhika (@Vedhika4u) August 1, 2022 Listen to the sound of waves within you 🐚🦢 pic.twitter.com/Hipz0n2Wd7 — Vedhika (@Vedhika4u) July 29, 2022 -
ఏందయ్యా రాహుల్ ఈ తమాషా.. నటుడి న్యూడ్ పిక్ వైరల్
Rahul Khanna Naked Photo Goes Viral: ప్రముఖ నటుడు, మాజీ కేంద్రమంత్రి వినోద్ ఖన్నా బాలీవుడ్లో విలన్ పాత్రల్లో మెప్పించారు. అంతేకాకుండా హీరోలకు సరిసమానమైన పారితోషికం తీసుకున్న యాక్టర్‌గా గుర్తింపు పొందారు. అయితే వినోద్ ఖన్నాకు ఉన్నంత పాపులారిటీ ఆయన పెద్ద కుమారుడు రాహుల్ ఖన్నాకు లేదు. లైమ్‌లైట్‌కు దూరంగా ఉండే రాహుల్ ఖన్నా నటుడితోపాటు రచయిత కూడా. బయటకు ఎక్కవ రాకుండా ప్రైవెసీ మెయింటేన్ చేసే రాహుల్ ఖన్నా తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో రచ్చ చేసింది. రాహుల్ ఖన్నా ఒంటిపై దుస్తులు లేకుండా సోఫాలో కూర్చున్న పిక్‌ను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో రాహుల్ బట్టలు లేకుండా ఒక దిండును అడ్డుగా పెట్టుకుని నగ్నంగా దర్శనమిచ్చాడు. ఈ పోస్ట్‌కు 'నేను ఇప్పటివరకు చాలా రహస్యంగా ఉంచాను. కానీ ఇక దాన్ని బయటపెట్టే సమయం వచ్చింది. నేను రివీల్ చేసే అతిపెద్ద విషయం కోసం వేచి ఉండండి' అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఫొటో చూసిన నెటిజన్లు విమర్శలతో దుమ్మెత్తిపోస్తున్నారు. 'ఇలాంటి పబ్లిక్ డోమైన్లో అలాంటి ఛండాలమైన పనులు చేయకు', 'ఎలాంటి మనుషులు అబ్బా. అర్థనగ్నంగా కనిపిస్తూ ఏదో సాధించినట్లు ఫీల్ అవుతున్నారు', 'ఇలా అర్థనగ్నంగా ఫోజులివ్వడం ఓకే అయితే సిగ్గు పడాల్సిన అవసరం ఏముంది. ఇక అన్ని బహిరంగంగానే చేయండి' అంటూ తిట్టిపోస్తున్నారు. చదవండి: కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్ 27 ఏళ్ల తర్వాత పూర్తి పాత్రల్లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ !.. So, there’s something I’ve been keeping under wraps—but it’s now time to share! Join me tomorrow for the big reveal? 🎁 pic.twitter.com/8AOD90ZugF — Rahul Khanna (@R_Khanna) July 17, 2022 అయితే ఓ పురుషులకు సంబంధించిన దుస్తులను ప్రమోట్ చేయడంలో భాగంగా రాహుల్ ఖన్నా ఈ పిక్‌ను షేర్ చేసినట్లు తెలుస్తోంది. తర్వాతి రోజు పోస్ట్‌లో ఫార్మల్ డ్రెస్‌లో స్విమ్మింగ్ పూల్‌లో ఓ టాయ్‌పై కూర్చున్న ఫొటోను షేర్ చేశాడు రాహుల్. కాగా ఇటీవల 'లైగర్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కేవలం పూలగుత్తిని అడ్డుపెట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేసిన విషయం తెలిసిందే. అలాగే 'పీకే'లో అమీర్ ఖాన్ కూడా రేడియో అడ్డం పెట్టుకుని నగ్నంగా దర్శనమిచ్చారు. చదవండి: డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్.. గర్భవతిగా నమ్మిస్తూ.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బుల్లితెర నటి.. చివరికి.. It’s the X I’ve been keeping under wraps! Thrilled to introduce RKXC—my collaboration with @ChokoreIndia. The #RKXC line offers the foundation blocks on which the modern Indian person can build a world-class accessories collection. Link in bio!#RahulKhannaXChokore pic.twitter.com/dhqcDkh7wQ — Rahul Khanna (@R_Khanna) July 18, 2022 -
Bill Gates Resume: రెజ్యూమ్ అంటే అట్లుంటది: బిల్‌గేట్స్ పోస్ట్ వైరల్
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం విశేషంగా ఆకట్టుకుంటోంది. 48 ఏళ్ల పాత రెజ్యూమ్ ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన బిల్ గేట్స్ తన రెజ్యూమ్‌ను శుక్రవారం సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేశారు. ‘‘మీలో ఎవరైనా ఇటీవల గ్రాడ్యుయేట్ అయినా లేదా కాలేజీ డ్రాపౌట్ అయినా, మీ రెజ్యూమ్ 48 సంవత్సరాల క్రితం నాటి నా రెజ్యూమ్ కంటే చాలా మెరుగ్గా ఉంటుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను’’ అని ఆయన తన పోస్ట్‌లో చెప్పారు. 1973 నాటి విలియం హెన్రీ గేట్స్ (బిల్ గేట్స్) రెజ్యూమ్ చూసి మంచి రెజ్యూమ్ కోసం వెబ్సైట్లు కన్సల్టెంట్లను వెతుక్కునే యూత్ అంతా వావ్ అంటోంది. సుమారు 48 ఏళ్ల క్రితం తాను ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో అప్పటి రెజ్యూమ్‌ను మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.1973లో బిల్‌గేట్స్ హార్వర్డ్స్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో ఉన్నారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై లింక్డిన్ వినియోగదారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక-పేజీ రెజ్యూమ్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు. చాలా బాగుంది. మన జీవితంలో మనం ఎంత సాధించామో చాలాసార్లు మర్చిపోతాం. అందుకే అలాంటి జ్ఞాపకాలం కోసం గత రెజ్యూమ్‌ల కాపీలను దాచుకోవాలని ఒకరు, అది రెజ్యూమ్‌లా లేదు ప్రామిసరీ నోట్‌గా ఉందని మరో యూజర్ వ్యాఖ్యానించడం విశేషం. -
మోదీకి కేరళ అమ్మాయి సంచలన వీడియో
తిరువంతపురం: 'మోదీజీ.. సాయం చేయండి...స్పందించండి' అంటూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖలు రాయడం, ట్విట్స్ చేయడం మనం గతంలో చాలా చూశాం కదా.. అయితే తాజాగా కేరళకు చెందిన ఓ విద్యార్థిని మోదీని ఉద్దేశించి రూపొందించిన వీడియో ఒకటి హాట్ టాపిక్ గా మారింది. దేశంలో చెలరేగిపోతున్న డ్రగ్ మాఫియాను అంతంచేయాలంటూ మోదీన కోరిన వీడియో ఒకటి హల్చల్ గా మారింది. ఆరోగ్యకరమైన భారతదేశానికి బాటలు వేయాలంటూ కేరళ త్రిస్సూర్ జిల్లా కు చెందిన 10వ తరగతి అమ్మాయి ఆనీ రుబు జోషి (15) ఒక వీడియో తీసింది. మత్తుపదార్థాల దుష్ర్పభావాలపై ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. 6 నిమిషాల నిడివి వున్న ఈ వీడియోలో మత్తు మందులు, తీవ్రవాదం కంటే చాలా భయంకరమైనవనీ తెలిపింది. దీంతో ఆనీ కి మద్దతుగా వేల సందేశాలు వెల్లువెత్తాయి. దేశంలోని ప్రతి పౌరుడు ఆరోగ్యంగ ఉన్నపుడే ,దేశం ఆరోగ్యంగా ఉంటుందని మీరే చెప్పారు. మరి మన చుట్టూ డ్రగ్ మాఫియా విస్తరించి ఉండగా.. దేశం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించింది. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ సమస్యల్ని సులభంగా పరిష్కరించవచ్చనీ, ఆ వైపు అడుగులుపడాలని ఆకాంక్షించింది. మందులు, మద్యం, పొగ ప్రభావాన్ని నిర్లక్ష్యం చేస్తే తీరని చేటు చేస్తుందని ఈ వీడియోలో పేర్కొంది. మత్తు మందులు చేస్తున్న కీడుపై తక్షణమే స్పందించాలని ప్రధానిని కోరింది. లివర్ కాన్సర్ కారణంగా తన తండ్రిని పోగొట్టుకున్న కారణంగా, స్నేహితులు, సన్నిహితులతో కలిసి యాంటీ డ్రగ్ ఎడ్యుకేషన్ ఇనీషియేటివ్ -ఫార్ట్యూన్ అనే స్థానిక వేదిక ద్వారా తాను పోరాటం చేస్తున్నట్టుఆనీ తెలిపింది. -
చిన్న పిల్లాడితో సిగరెట్ తాగించిన తండ్రి
-
దటీజ్ రజినీకాంత్


