పాపం పావురం.. కాపాడండి ప్లీజ్‌.. వీడియో వైరల్‌ | Arunachal Boy Desperate Attempt To Save Injured Pigeon Goes Viral | Sakshi
Sakshi News home page

పాపం పావురం.. కాపాడండి ప్లీజ్‌.. వీడియో వైరల్‌

Jul 26 2025 6:39 PM | Updated on Jul 26 2025 7:09 PM

Arunachal Boy Desperate Attempt To Save Injured Pigeon Goes Viral

లాంగ్డింగ్‌: గాయపడిన పావురాన్ని రక్షించేందుకు ఓ బాలుడు చేసిన ప్రయత్నం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని లాంగ్డింగ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్వచ్ఛమైన ఆ చిన్నారి మనస్సుకు అద్దంపడుతోంది. అసలేం జరిగిందంటే.. గాయపడిన ఓ పావురాన్ని బాలుడు తన స్నేహితులతో కలిసి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ పావురానికి వైద్యం చేయాలని ఆ బాలుడు వేడుకున్నాడు.

పావురాన్ని ఇక్కడ వదిలి వేయాలని.. డ్రెస్సింగ్ చేస్తామని నర్సు చెబుతుండగా.. ఆ బాలుడు పావురాన్ని మృదువుగా ఒక బలపై పెట్టి.. కన్నీళ్లు తుడుచుకుంటూ పక్కన నిలబడ్డాడు. కొంతసేపటికి ఆ పావురం చనిపోయింది. ఇది చనిపోయిందా? అంటూ వైద్య సిబ్బందిని ఆ బాలుడు అడగ్గా.. అవును చనిపోయిందంటూ సమాధానం ఇచ్చారు.

దీంతో ఆ చిన్నారి హృదయం తట్టుకోలేకపోయింది.. బాధతో విలపించాడు. కన్నీటి పర్యంతమైన వీడియో ప్రస్తుతం నెటిజన్లను కదిలిస్తోంది. ఆ చిన్నారి చూపిన జంతువుల పట్ల ప్రేమ, దయ, మనిషితనానికి అద్దం పడుతుందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement