లండన్‌లో ఘోరం.. తిలకం పెట్టుకున్నాడని.. | Hindu Boy Forced to Leave London School Over Tilak Dispute | Sakshi
Sakshi News home page

లండన్‌లో ఘోరం.. తిలకం పెట్టుకున్నాడని..

Jan 21 2026 1:16 PM | Updated on Jan 21 2026 1:21 PM

Hindu Boy Forced to Leave London School Over Tilak Dispute

ఆల్పెర్టన్‌: లండన్‌లోని ఆల్పెర్టన్‌ ప్రాంతంలో గల వికార్స్ గ్రీన్ ప్రైమరీ స్కూల్‌లో ఎనిమిదేళ్ల భారతీయ బాలునికి చేదు అనుభవం ఎదురైంది. నుదుటన తిలకం పెట్టుకుని పాఠశాలకు వెళ్లినందుకు, ఆ బాలుడు   మతపరమైన వివక్షను ఎదుర్కొన్నాడు. పాఠశాలలో తమ కుమారునికి ఎదురైన అవమానం కారణంగా బాలుని తల్లిదండ్రులు అతనిని ఆ పాఠశాలకు వెళ్లడాన్ని మాన్పించేశారు.

మీడియాకు అందిన వివరాల ప్రకారం సదరు విద్యార్థి నుదుటన తిలకం ధరించి పాఠశాలకు హాజరు కావడంతో ఈ వివాదం మొదలైంది. పాఠశాల యాజమాన్యం దీనిని తమ డ్రెస్ కోడ్ ఉల్లంఘనగా పరిగణించి, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆ తిలకాన్ని వారు  ‘స్కిన్ మార్క్’ (చర్మంపై మచ్చ)గా అభివర్ణిస్తూ ఎగతాళి చేశారు. తరువాత  ఆ బాలునిపై ప్రత్యేక నిఘా" ఉంచారు. పాఠశాల సిబ్బంది ప్రవర్తనతో భయాందోళనకు గురైన ఆ చిన్నారి, తోటి పిల్లలతో ఆడుకోవడానికి జంకుతూ ఒంటరిగా  ఉండేవాడు.

ఈ విషయం తెలుసుకున్న  తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని, స్కూల్ గవర్నర్లను నిలదీయగా,  వారు తిరిగి హిందూ మత ఆచారాలపై ప్రశ్నించారని బాధిత తల్లిదండ్రులు  వాపోయారు. ఈ ఘటనపై బ్రిటన్‌లో హిందువుల హక్కుల కోసం పోరాడే ‘ఇన్‌సైట్ యూకే’ (INSIGHT UK) సంస్థ తీవ్రంగా స్పందించింది.   ఆ పాఠశాల చర్యలు ఈక్వాలిటీ యాక్ట్ (సమానత్వ చట్టం)ను ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ, పాఠశాలకు లేఖ రాసింది. గతంలో కూడా ఇదే పాఠశాలలో మతపరమైన వివక్ష కారణంగా ముగ్గురు హిందూ చిన్నారులు స్కూల్ మానేయాల్సి వచ్చిందని ఆ సంస్థ గుర్తు చేసింది. 

ఇది కూడా చదవండి: అరుదైన హృద్రోగంతో చిన్నారి మృతి.. ‘కవాసాకి’ లక్షణాలివే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement