
జగిత్యాల జిల్లా: దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు యువకులు ‘దసరా బొనాంజా’ పేరుతో ప్రకటించిన ఆఫర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనికి సంబంధించిన ఫ్లెక్లీ నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
రూ.150తో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండంటూ.. మద్యం, మాసం పేరుతో సోషల్ మీడియాలో విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. రూ.150కు ప్రథమ బహుమతిగా మేక, రెండో బహుమతిగా బీర్లు, మూడో బహుమతిగా విస్కీ, నాలుగో బహుమతిగా కోళ్లు, ఐదో బహుమతిగా చీర అని పేర్కొంటూ వెలసిన ఫ్లెక్సీ విస్తుగొలుపుతోంది. స్థానికంగా ఉండే సాయిని తిరుపతి అనే వ్యక్తి ఈ బంపర్ డ్రా నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ నెల మొదటి తేదీన డ్రా తీయనున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. దీంతో ఎగబడి టోకెన్లు కొనుక్కుంటున్న జనాలు.