కలవరపెడుతున్న వరుస చోరీలు
ఈనెల 22న రాత్రి.. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లిలో ఓ ఆలయంతోపాటు, తాళంవేసిన నాలుగు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడి వెండి, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.
ఈనెల 20న రాత్రి.. జిల్లాకేంద్రంలోని అరవింద్‌నగర్‌లో తాళం వేసిన రెండిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. 900 గ్రాముల వెండి, 10 గ్రాముల బంగారం, రెండు చైన్లు, విలువైన ల్యాప్‌టాప్ ఎత్తుకెళ్లారు.
ఈనెల 24న రాత్రి.. ధర్మపురిలోని శ్రీఅక్కపల్లి రామలింగేశ్వర స్వామి, శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో దొంగలు చొరబడి స్వామివారి వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
నిఘా పటిష్టం చేశాం
జగిత్యాలక్రైం: జిల్లాలో వరుస దొంగతనాలు కలవరపెడుతున్నాయి. ఇంటికి తాళం వేసి వెళ్లామా.. దొంగలు చోరీకి పాల్పడుతున్నారు. పగటిపూట తాళాలు వేసిన ఇళ్లను పరిశీలించి రాత్రివేళల్లో చొరబడుతున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 381 దొంగతనాల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇందులో 187 దొంగతనాల కేసులను పోలీసులు చేధించారు. మధ్యాహ్న సమయంలో 13, రాత్రి సమయంలో 132, ఇతర సమయంలో 224, దారిదోపిడీలు ఒకటి, ఇతరత్రా 11 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రూ.4,18,57,918 విలువైన వస్తువులు చోరీ చేయగా.. రూ.2,92,37,439ను పోలీసులు రికవరీ చేయగలిగారు. తాళం వేసిన ఇళ్లల్లోనే చోరీలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
సీసీకెమెరాలున్నా... ఆగని దొంగతనాలు
నేరాల నియంత్రణకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో శ్రీనేనుసైతంశ్రీ కార్యక్రమం ద్వారా పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ సీసీకెమెరాలు ఏర్పాటు చేసినా చోరీలు తగ్గడం లేదు. మరోవైపు పోలీస్ శాఖ కూడా నిరంతరం నిఘా పెడుతోంది. బ్లూకోల్ట్స్ బృందాలను నియమించింది. వారు రాత్రి సమయంలో పెట్రోలింగ్ చేస్తున్నా.. గస్తీ తిరుగుతున్నా.. దొంగలు మాత్రం తమ పనికానిచ్చేస్తున్నారు.
పోలీసులకు చిక్కని దొంగలు
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారు మంకీక్యాప్, చేతులకు గ్లౌస్‌లు ధరిస్తున్నారు. పైగా వేలిముద్రలు నమోదు కాకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో నిందితులను గుర్తించడం పోలీసులకు కష్టతరంగా మారింది. రాత్రివేళల్లో పోలీసుల మఫ్టీలో తిరుగుతూ అనుమానితులను విచారిస్తున్నా.. అసలు దొంగలు మాత్రం పట్టుబడటం లేదు.
పట్టణ, గ్రామీణ ప్రాంత ప్ర జలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్తే పోలీసులతోపాటు స్థాని కంగా ఉండే వారికి సమాచా రం ఇవ్వాలి. అలాంటి ఇళ్లవైపు నిఘా పెంచుతాం. ప్ర జలు ఇళ్లల్లో విలువైన వస్తువులు ఉంచి తాళాలు వేసుకుని బయటకు వెళ్లవద్దు. చాలా చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. – అశోక్‌కుమార్, ఎస్పీ
కలవరపెడుతున్న వరుస చోరీలు
కలవరపెడుతున్న వరుస చోరీలు
కలవరపెడుతున్న వరుస చోరీలు


