గ్రామాల్లో వసతుల కల్పనకు కృషి
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
రాయికల్: గ్రామాల్లో వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. గురువారం అయోధ్య, రామాజీపేట పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యేను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వసతుల కల్పనకు కృషి చేస్తానని, ఏ సమస్య వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో రామాజీపేట సర్పంచ్ బెజ్జంకి మోహన్, విజయ్, రాజశేఖర్, మారుతి, శ్రీనివాస్‌రావు, నందనగిరి లక్ష్మీ, భరత్‌రెడ్డి పాల్గొన్నారు.
పంచాయతీల అభివృద్ధికి పాటుపడండి
జగిత్యాలరూరల్: పంచాయతీల అభివృద్ధికి సర్పంచులు నిరంతరం కృషి చేయాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి సర్పంచ్, బొలిశెట్టి రాజేశ్, వార్డుసభ్యులు వసంత గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వసంత వారిని సన్మానించారు. బీఆర్‌ఎస్ నాయకులు న్యాడెం శంకర్, ఎల్ల రాజన్న, శ్రీకాంత్, దినేశ్, అఫ్సర్‌ఖాన్, గణేశ్, రాజేందర్ పాల్గొన్నారు.
విద్యుత్ అధికారుల పొలంబాట
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం పాటిమీదితండాలో విద్యుత్ అధికారులు గురువారం పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. రైతులు వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలని, భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. టెక్నికల్ డీఈ అంజయ్య, డీఈ మధుసూదన్, ఏడీఈ రవి, ఏఈ రమేశ్, రైతులు పాల్గొన్నారు.
గ్రామాల్లో వసతుల కల్పనకు కృషి
గ్రామాల్లో వసతుల కల్పనకు కృషి


