వాచ్‌పేయి సేవలు మరవలేనివి
జగిత్యాలటౌన్/మెట్‌పల్లి/రాయికల్/పెగడపల్లి/కథలాపూర్/మల్లాపూర్/మల్యాల: దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలు మరువలేనివని పలువురు వక్తలు కొనియాడారు. జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో వాజ్‌పేయి చిత్రపటానికి భారత సురక్షా సమితి నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పుప్పాల సత్యనారాయణ, అక్కినపెల్లి కాశినాథం, చిట్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు ఆముద రాజు, సిరికొండ రాజన్న, గాదాసు రాజేందర్, పవన్‌సింగ్, సాంబారి కళావతి, గడ్డల లక్ష్మి, దూరిశెట్టి మమత తదితరులు పండ్లు పంపిణీ చేశారు. పెగడపల్లిలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యం, మండల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, గంగుల కొంరెల్లి, చింతకింది అనసూయ, గంగుల లక్ష్మీ,, కూన కుమార్, శ్రీరాం చారి పాల్గొన్నారు. వాజ్‌పేయి రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యమిచ్చి ఆదర్శంగా నిలిచారని బీజేపీ మెట్‌పల్లి పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్ తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెపల్లి శ్రీనివాస్, కొండ్లెపు శ్రీనివాస్, చెట్లపల్లి సత్యనారాయణ, డాక్టర్ వెంకట్‌రెడ్డి, మద్దెల లావణ్య, బొడ్ల ఆనంద్, జుంగుల అనిల్ పాల్గొన్నారు. కథలాపూర్‌లో వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు మల్యాల మారుతి, నాయకులు వెంకటేశ్వర్‌రావు, కొడిపెల్లి గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయికల్‌లో పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు అల్లె నర్సయ్య, కడార్ల శ్రీనివాస్, శ్రీగద్దె శ్రీనివాస్, దాసరి రవి, గోపి, తోకల శంకర్, కట్కం కిశోర్, మచ్చ శంకర్, తాటిపాముల శేఖర్ పాల్గొన్నారు. మల్లాపూర్‌లో వాజ్‌పేయి జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మీ, లవంగ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మల్యాల మండలకేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, సంబురాలు నిర్వహించారు. మల్లేశం, ప్రసాద్, వెంకటస్వామి, గోవర్ధన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


