ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ
ధర్మపురి/మేడిపల్లి/జగిత్యాలరూరల్: ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజను ఘనంగా నిర్వహించారు. గురుస్వాములు పెండ్యాల బాలకృష్ణస్వామి, రాజేశ్ ఆధ్వర్యంలో గణపతి పూజ చేశారు. అలాగే భీమారం మండలంలోని మన్నెగూడెంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. పొలాస శివారులోని అయ్యప్ప ఆలయంలో వేలాది మంది దీక్షాపరులు పడిపూజలో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి పాల్గొన్నారు.
ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ


