నిన్న జగ్గాసాగర్.. నేడు వెల్లుల
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం వెల్లుల గ్రామ రైతులు వ్యవసాయ విద్యుత్ సర్వీస్ చార్జీలు ఒకేరోజు వందశాతం చెల్లించి ఆదర్శంగా నిలిచారు. పదేళ్లుగా వందశాతం బిల్లులను ఒకేసారి చెల్లిస్తున్న రైతులు.. ఈ ఏడాదికి సంబంధించిన చార్జీలను కూడా గురువారం చెల్లించారు. 1,221 పంపుసెట్లకు సంబంధించి రూ.4,18,672ను విద్యుత్ అధికారులకు అందించారు. కార్యక్రమంలో ఏడీఈ రవి, ఏఈ రమేశ్, లైన్‌ఇన్స్‌పెక్టర్లు శంకర్, శ్రీదేవి, శేఖర్, లైన్‌మెన్లు నరహరి, ప్రసాద్, ఏఎల్‌ఎంలు, రైతులు పాల్గొన్నారు.


